ఎన్నికలపై మావోయిస్టులు తమ గురిని వదలట్లేదు. ఎన్నికల విధులకు హాజరయ్యే పోలీసులను టార్గెట్ చేయడం మానలేదు. జార్ఖండ్లోని ఖుంటి జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ అధికారి సహా ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.

ముర్హు పోలీసు స్టేషన్ ఇన్చార్జి పి.కె.ఝా, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తమ వాహనంలో పొట్నా గ్రామానికి వెళ్తుండగా దారిలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. దీంతో వాళ్లు ముగ్గురూ తీవ్రంగా గాయపడినట్లు డీఐజీ ప్రవీణ్ కుమార్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇది బహుశా పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వర్గానికి చెందిన తీవ్రవాదుల పనే అయి ఉంటుందని డీఐజీ అనుమానం వ్యక్తం చేశారు.