మావోయిస్టుల విధ్వంసం కారణంగా నిలిచిపోయిన పలకజీడిలో మంగళవారం రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. పాడేరు సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి రెండు ఈవీఎంలతో పోలింగ్ సిబ్బందిని ప్రత్యేక వాహనంలో అక్కడకు తరలించారు.
కొయ్యూరు, న్యూస్‌లైన్ : మావోయిస్టుల విధ్వంసం కారణంగా నిలిచిపోయిన పలకజీడిలో మంగళవారం రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. పాడేరు సబ్‌కలెక్టర్ కార్యాలయం నుం చి రెండు ఈవీఎంలతో పోలింగ్ సిబ్బందిని ప్రత్యేక వాహనంలో అక్కడకు తరలించారు. పాడేరు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రాజకుమారి ముందుగా పోలింగ్ సిబ్బం దితో కొంతసేపు సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కేంద్రంలో 468 మంది ఓటర్లున్నారు.
ఈనెల7న జరిగిన ఈ పోలింగ్ కేంద్రంలోకి దళసభ్యులు వచ్చి ఈవీఎంలను తీసుకెళ్లి దగ్ధం చేశారు. సిబ్బందిని తరలించిన జీపును ధ్వంసం చేయడంతో పోలింగ్ వాయి దా పడింది. ఈ నెల 13న రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ సారి ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రెండు రోజు లు ముందుగానే తరలించారు.
అధిక సంఖ్యలో గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. ఇటు తూర్పుగోదావరి జిల్లా దుచ్చర్తి ప్రాంతం నుంచి యు.చీడిపాలెం మీదుగా ఎర్రగొండ, నీలవరం, గంగవరం, మర్రిపాకల వరకు పోలీ సులు కూంబింగ్ చేపట్టారు. అవతల పలకజీడి నుంచి రేవులకోట ప్రాంతం వరకు గాలిస్తున్నారు. పలకజీడిలో రీపోలింగ్‌కు అన్ని చర్యలు తీసుకున్నామని తహశీల్దారు ఉమామహేశ్వరరావు సోమవారం తెలిపారు. సోమవారం పాడేరు వచ్చిన రూరల్ ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ లేకరులతో మాట్లాడుతూ పలకజీడిలో రీపోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహిస్తామని తెలిపారు.