palakajidi
-
నేడు పలకజీడిలో రీపోలింగ్
కొయ్యూరు, న్యూస్‌లైన్ : మావోయిస్టుల విధ్వంసం కారణంగా నిలిచిపోయిన పలకజీడిలో మంగళవారం రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. పాడేరు సబ్‌కలెక్టర్ కార్యాలయం నుం చి రెండు ఈవీఎంలతో పోలింగ్ సిబ్బందిని ప్రత్యేక వాహనంలో అక్కడకు తరలించారు. పాడేరు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రాజకుమారి ముందుగా పోలింగ్ సిబ్బం దితో కొంతసేపు సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కేంద్రంలో 468 మంది ఓటర్లున్నారు. ఈనెల7న జరిగిన ఈ పోలింగ్ కేంద్రంలోకి దళసభ్యులు వచ్చి ఈవీఎంలను తీసుకెళ్లి దగ్ధం చేశారు. సిబ్బందిని తరలించిన జీపును ధ్వంసం చేయడంతో పోలింగ్ వాయి దా పడింది. ఈ నెల 13న రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ సారి ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రెండు రోజు లు ముందుగానే తరలించారు. అధిక సంఖ్యలో గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. ఇటు తూర్పుగోదావరి జిల్లా దుచ్చర్తి ప్రాంతం నుంచి యు.చీడిపాలెం మీదుగా ఎర్రగొండ, నీలవరం, గంగవరం, మర్రిపాకల వరకు పోలీ సులు కూంబింగ్ చేపట్టారు. అవతల పలకజీడి నుంచి రేవులకోట ప్రాంతం వరకు గాలిస్తున్నారు. పలకజీడిలో రీపోలింగ్‌కు అన్ని చర్యలు తీసుకున్నామని తహశీల్దారు ఉమామహేశ్వరరావు సోమవారం తెలిపారు. సోమవారం పాడేరు వచ్చిన రూరల్ ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ లేకరులతో మాట్లాడుతూ పలకజీడిలో రీపోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. -
పలకజీడిలో 13న రీపోలింగ్
- భారీగా పోలీసు భద్రత - రేపు ఈవీఎంలు, సిబ్బంది తరలింపు పాడేరు,న్యూస్‌లైన్: కొయ్యూరు మండలం పలకజీడిలో ఈ నెల13న రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మావోయిస్టులు ఈవీఎంలు,ఎన్నికల సిబ్బంది వాహనాన్ని దగ్ధం చేయడంతో ఈ నేల 7న ఇక్కడ పోలింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈమేరకు పలకజీడిలో రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రాజకుమారి తెలిపారు. సోమవారం సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలకు అక్కడికి తరలిస్తామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మంగళవారంనాటి రీపోలింగ్‌కు భారీగా భద్రత చర్యలు చేపడుతున్నామని నర్సీపట్నం ఓఎస్డీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పోలీసు కూంబింగ్ పార్టీలు విస్త్రృతంగా గాలిస్తున్నాయన్నారు. రీపోలింగ్ ప్రశాంతంగా జరిగి,ఎన్నికల సిబ్బంది క్షేమంగా వచ్చేంత వరకు పోలీసుల భద్రత ఉంటుందన్నారు. గిరిజనులు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు.