ఇద్దరు మావోయిస్టుల అరెస్టు | Two Maoists arrested in Jharkhand | Sakshi
Sakshi News home page

ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

Published Thu, Jun 5 2014 3:24 PM | Last Updated on Tue, Oct 9 2018 2:39 PM

Two Maoists arrested in Jharkhand

ఓ దళ కమాండర్ సహా ఇద్దరు మావోయిస్టులను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు.గతంలో జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో కొంతమంది పోలీసులను హతమార్చిన కేసులో వీరిద్దరూ నిందితులు. ముందుగా బుధవారం రాత్రి చక్రధర్పూర్ ప్రాంతంలోని రైల్వే కాలనీలో ఓ మావోయిస్టును పట్టుకున్నామని, అతడిచ్చిన సమాచారంతోనే సిబో చాకి అనే దళ కమాండర్ కూడా అరెస్టయ్యాడని జిల్లా ఎస్పీ ఎన్కే సింగ్ తెలిపారు.

వాళ్ల వద్ద ఓ నాటు తుపాకి, మూడు రౌండ్ల మందుగుండును స్వాధీనం చేసుకున్నామన్నారు. 2009 సంవత్సరంలో పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని చిక్రిఘాటి ప్రాంతంలో మందుపాతర పేలుడు సహా 18 కేసుల్లో చాకి నిందితుడు. ఆ పేలుడులోనే గోలికెరా పోలీసు స్టేషన్ ఇన్ఛార్జి సహా ఏడుగురు పోలీసులు మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement