జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత కరడుగట్టిన ముగ్గురు మావోయిస్టులను పాలమ్ జిల్లాలో ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. రాష్ట్రంలో జార్ఖండ్ మంత్రి నివాసం, సెల్ ఫోన్ టవర్లు, పోలీసులపై దాడులు, ప్రజలను హతమార్చడం వంటి పలు విధ్వంసకాండకు వారు నేతృత్వం వహించారని చెప్పారు.
మావోయిస్టులు వారి కుటుంబ సభ్యులతో ఉండగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కరడుగట్టిన మావోయిస్టుల ఆరెస్ట్ పోలీసులు, భద్రత సిబ్బంది సాధించిన విజయంగా పోలీసు ఉన్నతాధికారి అభివర్ణించారు. అరెస్ట్ అయిన మావోయిస్టుల వద్ద నుంచి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు చెప్పారు. వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని తెలిపారు.