ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోలు హతం | 4 suspected Maoists killed in encounter in Jharkhand's Palamu | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోలు హతం

Published Tue, Feb 27 2018 3:28 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

4 suspected Maoists killed in encounter in Jharkhand's Palamu - Sakshi

రాంచీ: జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళా మావోలు ఉన్నారు.  మావోయిస్టుల ఏరివేత చర్యల్లో భాగంగా సోమవారం లాలాఘటీ–నదిహా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ దళాలు, పోలీసులు ఉమ్మడిగా కూంబింగ్‌ చేస్తున్నపుడు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మృతుల్లో స్థానిక నక్సల్‌ గ్రూప్‌కు సబ్‌ జోన్‌ కమాండర్‌ భూహియాన్, లల్లు యాదవ్, రింకీ, రూబీ ఉన్నారు. ఘటన  ప్రాంతం నుంచి 2 ఎస్‌ఎల్‌ఆర్‌లు,5 మ్యాగజైన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement