చింతపల్లిలో ల్యాండ్‌మైన్ పేలుడు: హోంగార్డు మృతి
Published Fri, May 5 2017 12:59 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM
విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని చింతపల్లి మండలంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. స్థానిక మేడివాడ పంచాయతీ పరిధిలో రామన్నపాలెం వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ సంఘటనలో ఒక హోంగార్డు మృతి చెందాడు. పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement