home guard died
-
బేగంపేటలో వింగర్ బీభత్సం
హైదరాబాద్: బేగంపేటలో ఆదివారం ఉదయం టాటా వింగర్ వాహనం బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్లి వాహనాలు, పాదచారుల పైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు అక్కడికక్కడే చనిపోగా పలు వురికి గాయాలయ్యాయి. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టి వింగర్ ఆగిపోయింది. వింగర్ డ్రైవర్‌కు మూర్ఛ రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మల్కాజిగిరి పరిధిలోని ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతానికి చెందిన సముద్రాల రవికృష్ణ (30) టాటా వింగర్ వాహనం డ్రైవర్. తన వాహనంలో ప్రతిరోజూ ఉప్పల్ నుంచి సికింద్రాబాద్, బేగంపేట మీదుగా హైటెక్ సిటీకి హెచ్డీఎఫ్సీ ఉద్యోగులను తీసుకెళ్తుంటాడు. రోజూలాగానే ఆదివారం ఉదయం 10.30 సమయంలో ఉద్యోగులను తీసుకుని వెళ్తున్నాడు. బేగం పేట ప్రకాశ్‌నగర్ బస్టాప్ వద్దకు రాగానే వాహన వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ముందున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. దీంతో అక్కడి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరకు సమీపంలోని కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి వింగర్ నిలిచింది. హోంగార్డు అక్కడికక్కడే మృతి... ఈ ప్రమాదంలో ప్రకాశ్‌నగర్ బస్టాప్ సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న బేగంపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ హోంగార్డు ప్రభాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. వింగర్ 8 వాహనాలను ఢీకొట్టగా అవి దెబ్బతినడంతో పాటు నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వింగర్ నడుపుతున్న రవికృష్ణకు ఆ సమయంలో మూర్ఛ వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో చనిపోయిన ప్రభాకర్ స్వస్థలం మెదక్ జిల్లా ఝరాసంగం కక్కెరవాడ. మూడేళ్ల నుంచి బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఆదివారం కావడంతో రద్దీ పెద్దగా లేదని, పని దినాల్లో ఈ ప్రమాదం జరిగితే నష్టం ఊహించని విధంగా ఉండేది. రవికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
బేగంపేటలో టాటా వింగర్ బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : టాటా వింగర్ వాహనం ఆదివారం ఉదయం బేగంపేట ప్రకాశ్ నగర్లో బీభత్సం సృష్టించింది. టాటా వాహనం బేగంపేట ఎయిర్‌పోర్టు వద్దకు రాగానే అదుపు తప్పి వాహనదారులపైకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో అప్పుడే విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న హోంగార్డు ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. మరోవైపు ఈ సంఘటనలో గాయపడ్డ వాహనం డ్రైవర్ రవితో పాటు మరో అయిదుగురిని బేగంపేట పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా డ్రైవర్‌కు హఠాత్తుగా ఫిట్స్ రావడంతో వాహనం అదుపు తప్పి...ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. -
తాగుడుకు బానిసై హోంగార్డు మృతి
కల్హేర్(నారాయణఖేడ్) : ఒ హోంగార్డు కుటుంబ కలహాల కారణంతో కావాల్సిన వారు దురం కాగా విధులకు వెళ్లకుండా తాగుడుకు బానిసై చివరకు ఇంట్లోనే మరణించాడు. వివరాల్లోకి వెళితే కల్హేర్ మండలం బీబీపేటకు చెందిన సార పాండురంగగౌడ్ కామారెడ్డి జిల్లా పిట్లం పోలీస్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి స్వగ్రామం బీబీపేటలో స్వంత ఇంట్లో పాండురంగగౌడ్ శవమై కనిపించాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో గుర్తించిన చుట్టుపక్కల వ్యక్తులు ఇంటి తలుపులు తెరిచి చూశారు. పాండురంగా గౌడ్ మృతిచెంది ఉన్నాడు. మృతదేహం కుళ్లిపోవడంతో వాసన వెదజల్లింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కోనాపూర్‌లో పుట్టింటిలో ఉంటున్న మృతుడి భార్య కల్పనకు గ్రామస్తులు సమచారం ఇచ్చారు. కల్హేర్ ఎస్ఐ సాయిరాం సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతుడి భార్య కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపారు. మృతుడు పాండురంగగౌడ్కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పాండురంగగౌడ్ మృతితో బీబీపేటలో విషాధఛాయలు అలుముకున్నాయి. అతిగా మద్యం తాగడంతో రెండు రోజుల క్రితం మరణించి ఉండోచ్చని ఎస్ఐ సాయిరాం తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ వద్ద జాతీ య రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఓ హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఇద్దరూ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని బస్వాపూర్‌కు చెందిన సముద్రాల రామస్వామి(32) స్థానిక పోలీస్ స్టేషన్‌కు నాలుగు రోజుల క్రితం కామారెడ్డి పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చి విధుల్లో చేరాడు. గు రువారం ఉదయం విధులు నిర్వహించేందుకు రా మస్వామి తన బైకుపై బస్వాపూర్‌లోని తన ఇంటి నుంచి బయలు దేరాడు. బస్టాండు వద్ద గ్రామానికి చెందిన ఇద్దరూ విద్యార్థులు భిక్కనూరు ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో 9 వతరగతి చదువుతున్న కవలలు బాస లక్ష్మణ్, రాములు భిక్కనూరుకు స్కూల్‌కు వెళ్తున్నామని తమను బైక్‌పై తీసుకెళ్లాల ని కోరారు. దీంతో రామస్వామి బైక్‌ను నిలిపి వారిని తీసుకుని భిక్కనూరుకు వస్తుండగా హైద రాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీ రామస్వామి నడుపుతున్న బైక్‌ను వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొంది. లక్ష్మణ్, రాములుకు తీవ్ర గా యాలయ్యాయి. వెంటనే 108లో వీరిద్దరిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిం చారు. అక్కడి వైద్యులు చికిత్సలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాద స్థలాన్ని ఎస్ఐ రాజుగౌడ్ సంద ర్శించి కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు రామస్వామికి భార్య లావణ్యతో పాటు కుమార్తె, కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు. పది నిమిషాల్లోపే అనంతలోకాలకు.. డ్యూటీకి వెళ్తున్నాని ఇంట్లో భార్య లావణ్యకు చెప్పి బైక్‌పై వెళ్లి రామస్వామి పది నిమిషాల్లో లారీ ఢీకొని మృతి చెందాడని సమాచారం అందుకున్న ఆయన కుటుంబీకులు కుప్పకూలిపోయారు. ఇ ప్పుడు డ్యూటీకి వెళ్తున్నాని చెప్పిన తన భర్త ఇక కానరాని లోకాలకు వెళ్లిపోయాడని భార్య లావణ్య, తండ్రి గుండయ్య బోరున విలపించారు. ఏళ్లుగా భిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ కావా లని కలలు కన్న రామస్వామి బదిలీ అయ్యాక నాలుగు రోజులకే మృత్యువాత పడడం అందరిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న హోంగార్డు లు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. అంత్యక్రియల్లో ప్రభుత్వ విప్ హోంగార్డు రామస్వామి అంత్యక్రియల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొన్నారు. రామస్వామి తండ్రి గుండయ్యను ఆలింగనం చేసుకుని బోరున విలపించారు. రామస్వామి మృతదేహాన్ని, రామస్వామి చిన్న కుమారుడిని చూసిన విప్ కన్నీటి పర్యంతమయ్యారు. ఎంపీపీ తొగరి సుదర్శన్, టీఆర్ఎస్ నాయకులు బల్రాం, రాజయ్య, బుర్రి గోపాల్, రాజిరెడ్డి, సిద్దరాములు పాల్గొన్నారు. -
చింతపల్లిలో ల్యాండ్‌మైన్ పేలుడు: హోంగార్డు మృతి
విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని చింతపల్లి మండలంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. స్థానిక మేడివాడ పంచాయతీ పరిధిలో రామన్నపాలెం వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ సంఘటనలో ఒక హోంగార్డు మృతి చెందాడు. పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చికిత్స పొందుతూ హోంగార్డు మృతి
విజయవాడ: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఓ హోంగార్డు నిండు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ జిల్లా కంచరపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు అనే హోంగార్డు పుష్కర విధుల నిమిత్తం ఈ నెల 7వ తేదీన విజయవాడకు వచ్చాడు. 11 వ తేదీ అర్థరాత్రి ఆయన ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో తోటి హోంగార్డులు ఆయన్ను సమీప ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. అనంతరం వెంకటేశ్వరరావును విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బుధవారం రాత్రి చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. హోంగార్డు కుటుంబానికి తోటి ఉద్యోగులు రూ.25 వేలు సాయం అందించారు. దీనిపై కనీసం ఉన్నతాధికారులు, ప్రభుత్వం కానీ స్పందించడంలేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందించి ఉంటే వెంకటేశ్వరరావు బ్రతికుండేవారని కుటుంబసభ్యులు వాపోతున్నారు. -
‘ప్రమాదం’ తప్పించాలని చూస్తే..
శంషాబాద్ రూరల్: ప్రమాదస్థలిలో సూచికలు ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ సిబ్బందిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శంషాబాద్ మండల పరిధిలోని పెద్దగోల్కొండ సమీపంలో ఔటర్ రింగురోడ్డుపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ సమీపంలో శనివారం రాత్రి మహారాష్ట్రకు చెందిన ఓ లారీ రోడ్డు పక్కన ఉన్న వంతెన ఢీకొని ఆగిపోయింది. సమాచారం అందుకున్న ఆర్జీఐఏ ట్రాఫిక్ మొబైల్-2 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన లారీ పక్కన రోడ్డుపై రేడియం కోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో విజయవాడ వైపు నుంచి శంషాబాద్ వస్తున్న ఓ లారీ వేగంగా వచ్చి వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు అవంగపురం విజయ్‌కుమార్‌రెడ్డి(27) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మొబైల్ వ్యాన్ డ్రైవర్ డ్రైవర్ భిక్షపతి, రికవరీ వ్యాన్ డ్రైవర్ అలీఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు విజయ్‌కుమార్‌రెడ్డి గండేడ్ మండలం సల్కర్‌పేట్ గ్రామస్తుడు. పోలీసులు ఆదివారం స్థానిక క్లస్టర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోంగార్డు దుర్మరణంతో ఆర్జీఐఏ ట్రాఫిక్ ఠాణాలో విషాదం అలుముకుంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.