మృతదేహం వద్ద కుటుంబీకుల రోదనలు
భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ వద్ద జాతీ య రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఓ హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఇద్దరూ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని బస్వాపూర్‌కు చెందిన సముద్రాల రామస్వామి(32) స్థానిక పోలీస్ స్టేషన్‌కు నాలుగు రోజుల క్రితం కామారెడ్డి పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చి విధుల్లో చేరాడు. గు రువారం ఉదయం విధులు నిర్వహించేందుకు రా మస్వామి తన బైకుపై బస్వాపూర్‌లోని తన ఇంటి నుంచి బయలు దేరాడు.
బస్టాండు వద్ద గ్రామానికి చెందిన ఇద్దరూ విద్యార్థులు భిక్కనూరు ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో 9 వతరగతి చదువుతున్న కవలలు బాస లక్ష్మణ్, రాములు భిక్కనూరుకు స్కూల్‌కు వెళ్తున్నామని తమను బైక్‌పై తీసుకెళ్లాల ని కోరారు. దీంతో రామస్వామి బైక్‌ను నిలిపి వారిని తీసుకుని భిక్కనూరుకు వస్తుండగా హైద రాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీ రామస్వామి నడుపుతున్న బైక్‌ను వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొంది.
లక్ష్మణ్, రాములుకు తీవ్ర గా యాలయ్యాయి. వెంటనే 108లో వీరిద్దరిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిం చారు. అక్కడి వైద్యులు చికిత్సలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాద స్థలాన్ని ఎస్‌ఐ రాజుగౌడ్ సంద ర్శించి కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు రామస్వామికి భార్య లావణ్యతో పాటు కుమార్తె, కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు.
పది నిమిషాల్లోపే అనంతలోకాలకు..
డ్యూటీకి వెళ్తున్నాని ఇంట్లో భార్య లావణ్యకు చెప్పి బైక్‌పై వెళ్లి రామస్వామి పది నిమిషాల్లో లారీ ఢీకొని మృతి చెందాడని సమాచారం అందుకున్న ఆయన కుటుంబీకులు కుప్పకూలిపోయారు. ఇ ప్పుడు డ్యూటీకి వెళ్తున్నాని చెప్పిన తన భర్త ఇక కానరాని లోకాలకు వెళ్లిపోయాడని భార్య లావణ్య, తండ్రి గుండయ్య బోరున విలపించారు.
ఏళ్లుగా భిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ కావా లని కలలు కన్న రామస్వామి బదిలీ అయ్యాక నాలుగు రోజులకే మృత్యువాత పడడం అందరిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న హోంగార్డు లు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.
అంత్యక్రియల్లో ప్రభుత్వ విప్
హోంగార్డు రామస్వామి అంత్యక్రియల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొన్నారు. రామస్వామి తండ్రి గుండయ్యను ఆలింగనం చేసుకుని బోరున విలపించారు. రామస్వామి మృతదేహాన్ని, రామస్వామి చిన్న కుమారుడిని చూసిన విప్ కన్నీటి పర్యంతమయ్యారు. ఎంపీపీ తొగరి సుదర్శన్, టీఆర్‌ఎస్ నాయకులు బల్‌రాం, రాజయ్య, బుర్రి గోపాల్, రాజిరెడ్డి, సిద్దరాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment