
సాక్షి, హైదరాబాద్ : టాటా వింగర్ వాహనం ఆదివారం ఉదయం బేగంపేట ప్రకాశ్ నగర్‌లో బీభత్సం సృష్టించింది. టాటా వాహనం బేగంపేట ఎయిర్‌పోర్టు వద్దకు రాగానే అదుపు తప్పి వాహనదారులపైకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో అప్పుడే విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న హోంగార్డు ప్రభాకర్ తీవ్రంగా గాయపడ‍్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. మరోవైపు ఈ సంఘటనలో గాయపడ్డ వాహనం డ్రైవర్ రవితో పాటు మరో అయిదుగురిని బేగంపేట పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా డ్రైవర్‌కు హఠాత్తుగా ఫిట్స్ రావడంతో వాహనం అదుపు తప్పి...ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.