Tata Winger
-
బేగంపేటలో వింగర్ బీభత్సం
హైదరాబాద్: బేగంపేటలో ఆదివారం ఉదయం టాటా వింగర్ వాహనం బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్లి వాహనాలు, పాదచారుల పైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు అక్కడికక్కడే చనిపోగా పలు వురికి గాయాలయ్యాయి. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టి వింగర్ ఆగిపోయింది. వింగర్ డ్రైవర్‌కు మూర్ఛ రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మల్కాజిగిరి పరిధిలోని ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతానికి చెందిన సముద్రాల రవికృష్ణ (30) టాటా వింగర్ వాహనం డ్రైవర్. తన వాహనంలో ప్రతిరోజూ ఉప్పల్ నుంచి సికింద్రాబాద్, బేగంపేట మీదుగా హైటెక్ సిటీకి హెచ్డీఎఫ్సీ ఉద్యోగులను తీసుకెళ్తుంటాడు. రోజూలాగానే ఆదివారం ఉదయం 10.30 సమయంలో ఉద్యోగులను తీసుకుని వెళ్తున్నాడు. బేగం పేట ప్రకాశ్‌నగర్ బస్టాప్ వద్దకు రాగానే వాహన వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ముందున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. దీంతో అక్కడి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరకు సమీపంలోని కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి వింగర్ నిలిచింది. హోంగార్డు అక్కడికక్కడే మృతి... ఈ ప్రమాదంలో ప్రకాశ్‌నగర్ బస్టాప్ సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న బేగంపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ హోంగార్డు ప్రభాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. వింగర్ 8 వాహనాలను ఢీకొట్టగా అవి దెబ్బతినడంతో పాటు నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వింగర్ నడుపుతున్న రవికృష్ణకు ఆ సమయంలో మూర్ఛ వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో చనిపోయిన ప్రభాకర్ స్వస్థలం మెదక్ జిల్లా ఝరాసంగం కక్కెరవాడ. మూడేళ్ల నుంచి బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఆదివారం కావడంతో రద్దీ పెద్దగా లేదని, పని దినాల్లో ఈ ప్రమాదం జరిగితే నష్టం ఊహించని విధంగా ఉండేది. రవికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
బేగంపేటలో టాటా వింగర్ బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : టాటా వింగర్ వాహనం ఆదివారం ఉదయం బేగంపేట ప్రకాశ్ నగర్లో బీభత్సం సృష్టించింది. టాటా వాహనం బేగంపేట ఎయిర్‌పోర్టు వద్దకు రాగానే అదుపు తప్పి వాహనదారులపైకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో అప్పుడే విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న హోంగార్డు ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. మరోవైపు ఈ సంఘటనలో గాయపడ్డ వాహనం డ్రైవర్ రవితో పాటు మరో అయిదుగురిని బేగంపేట పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా డ్రైవర్‌కు హఠాత్తుగా ఫిట్స్ రావడంతో వాహనం అదుపు తప్పి...ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. -
భారీగా ‘ఎర్ర’ దుంగలు స్వాధీనం
=ఇద్దరు తిరుపతి కూలీల అరెస్ట్ =వాహనాలు, దుంగల విలువ రూ.38 లక్షలు చంద్రగిరి, న్యూస్‌లైన్: మండలంలో గురువారం 71 ఎర్రచందనం దుంగలను, రెండు టాటా వింగర్ వాహనాలను టాస్క్‌ఫోర్స్, ఫారెస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నా రు. రెండు టన్నుల బరువున్న ఈ దుంగ లు సుమారు రూ.20 లక్షలు, వాహనాలు రూ.18 లక్షలు చేస్తాయని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాద్ అంచనా వేశారు. చంద్రగిరి సీఐ నాగభూషనం వివరాల మేరకు... ఎస్టీఎఫ్ సీఐ అశోక్‌కుమార్ తన సిబ్బందితో కలిసి గురువారం తెల్లవారుజామున తొండవాడ ప్రాంతంలో తనిఖీలు చేశారు. ముళ్ల చెట్లల్లో టాటావింగర్ (కేఏ 03డీ 7309) వాహనంలో దుంగలు లోడ్ చేయడాన్ని గుర్తించారు. వెంటనే టాస్క్‌ఫోర్స్ సిబ్బంది చుట్టిముట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 41 దుంగలున్న వాహనాన్ని అదుపులోకి తీసుకుని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో సురేష్ అనే వ్యక్తిది తిరుపతిలోని కేశవాయనగుంట, ఉదయ్‌కుమార్‌ది ఎమ్మార్‌పల్లె అని విచారణలో తెలిసింది. వీరి నుంచి పోలీసులు ప్రధాన స్మగ్లర్ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. సీఐతోపాటు ఎస్ఐ జాన్‌కెనడి, సుబ్రమణ్యం దుంగలను పరిశీలించారు. అలాగే భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాద్, డీఆర్వో బాలాజి గురువారం ఉదయం చెర్లోపల్లె నుంచి అలిపిరి వెళ్లే మార్గంలో దాడులు నిర్వహించారు. ఈ మార్గంలో ని మచాని గార్డెన్స్ వెనుక ఉన్న ఫారెస్ట్ లో తనిఖీలు చేశారు. టాటావింగర్ వా హనంలో దుండగులు ఎర్రచందనం దుంగలను లోడ్ చేయడాన్ని గుర్తించా రు. పోలీసులను చూడగానే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అధికారులు వాహనాన్ని అందులోని 30 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.