=ఇద్దరు తిరుపతి కూలీల అరెస్ట్
=వాహనాలు, దుంగల విలువ రూ.38 లక్షలు
చంద్రగిరి, న్యూస్‌లైన్: మండలంలో గురువారం 71 ఎర్రచందనం దుంగలను, రెండు టాటా వింగర్ వాహనాలను టాస్క్‌ఫోర్స్, ఫారెస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నా రు. రెండు టన్నుల బరువున్న ఈ దుంగ లు సుమారు రూ.20 లక్షలు, వాహనాలు రూ.18 లక్షలు చేస్తాయని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాద్ అంచనా వేశారు. చంద్రగిరి సీఐ నాగభూషనం వివరాల మేరకు... ఎస్‌టీఎఫ్ సీఐ అశోక్‌కుమార్ తన సిబ్బందితో కలిసి గురువారం తెల్లవారుజామున తొండవాడ ప్రాంతంలో తనిఖీలు చేశారు.
ముళ్ల చెట్లల్లో టాటావింగర్ (కేఏ 03డీ 7309) వాహనంలో దుంగలు లోడ్ చేయడాన్ని గుర్తించారు. వెంటనే టాస్క్‌ఫోర్స్ సిబ్బంది చుట్టిముట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 41 దుంగలున్న వాహనాన్ని అదుపులోకి తీసుకుని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో సురేష్ అనే వ్యక్తిది తిరుపతిలోని కేశవాయనగుంట, ఉదయ్‌కుమార్‌ది ఎమ్మార్‌పల్లె అని విచారణలో తెలిసింది. వీరి నుంచి పోలీసులు ప్రధాన స్మగ్లర్ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
సీఐతోపాటు ఎస్‌ఐ జాన్‌కెనడి, సుబ్రమణ్యం దుంగలను పరిశీలించారు. అలాగే భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాద్, డీఆర్వో బాలాజి గురువారం ఉదయం చెర్లోపల్లె నుంచి అలిపిరి వెళ్లే మార్గంలో దాడులు నిర్వహించారు. ఈ మార్గంలో ని మచాని గార్డెన్స్ వెనుక ఉన్న ఫారెస్ట్ లో తనిఖీలు చేశారు. టాటావింగర్ వా హనంలో దుండగులు ఎర్రచందనం దుంగలను లోడ్ చేయడాన్ని గుర్తించా రు. పోలీసులను చూడగానే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అధికారులు వాహనాన్ని అందులోని 30 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
భారీగా ‘ఎర్ర’ దుంగలు స్వాధీనం
Published Fri, Dec 6 2013 2:09 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement