ఇండికా కారులో మహిళ మృతదేహం | Woman dead body in indica car at prakash nagar in begumpet | Sakshi
Sakshi News home page

ఇండికా కారులో మహిళ మృతదేహం

Published Tue, Jun 16 2015 9:54 AM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

ఇండికా కారులో మహిళ మృతదేహం

ఇండికా కారులో మహిళ మృతదేహం

హైదరాబాద్ : బేగంపేట పోలీసు స్టేషన్కు కూతవేటు దూరంలో ప్రకాశ్నగర్లో నిలిపి ఉంచిన ఓఇండికా కారు నుంచి దుర్గంధం వెలువడటంలో స్థానికులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ప్రకాశ్నగర్ చేరుకుని మహిళ మృతదేహంతోపాటు కారును స్వాధీనం చేసుకుని... పోలీసుస్టేషన్కు తరలించారు. అనంతరం మృతదేహాన్ని కారు నుంచి బయటకు తీశారు. మహిళ మృతదేహం గుర్తు పట్టలేకుండా ఉంది. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే గత కొంత కాలంగా కారు అక్కడే ఉంటుందని స్థానికులు పోలీసులు తెలిపారు. ఎంత కాలం నుంచి ఆ కారు అక్కడే ఉంటుందన్నది మాత్రం స్థానికులు చెప్పలేకపోతున్నారు.  కాగా కారు నెంబర్... వివరాలు లేకపోవడంతో పోలీసులు కారు యాజమాని ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతురాలు యాచకురాలని పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తెలిసింది. ఆమె సదరు కారులో నివాసం ఏర్పరుచుకుందా ? లేక దుండగులు ఆమెను హత్య చేసి ఈ కారులో పడేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ అసలు విషయం తెలియదని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement