woman dead body
-
ఫామ్‌హౌస్‌లో మృతదేహం పూడ్చివేత
రంగారెడ్డి: ఓ ఫామ్‌హౌస్‌లో గుర్తు తెలియని మహిళ శవాన్ని పాతిపెట్టిన విషయం ఆదివారం చేవెళ్లలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మండలకేంద్రంలోని కనకమామిడి మల్లారెడ్డి అనే రైతు ఫామ్‌హౌస్‌లో సత్తయ్య, కల్పన అనే ఇద్దరు భార్యాభర్తలు కూలీలుగా పనిచేస్తున్నారు. ఈనెల 7న సత్తయ్య, కల్పనలు ఓ మహిళ, మరో వ్యక్తిని ఫామ్‌హౌస్‌కు తీసుకువచ్చారు. వారు తమ అన్నావదినలుగా యాజమానికి పరిచయం చేశారు. శుక్రవారం సత్తయ్య, కల్పనలు తమ ఇంటి వద్ద గొడవలు జరుగుతున్నాయని ఇంటికి వెళ్తున్నామని మల్లారెడ్డికి చెప్పి వెళ్లారు. దీంతో ఆయన నిన్న వచ్చిన మీ అన్నావదినలు ఎక్కడని అడగ్గా వాళ్లు నిన్ననే వెళ్లిపోయారని చెప్పారు. ఆదివారం పొలం వద్ద పైపులైన్ పగిలిపోవటంతో సరిచేసేందుకు మల్లారెడ్డితో పాటు మరో వ్యక్తి వెంకట్‌రెడ్డి, డ్రైవర్ శేఖర్లు వెళ్లారు. దీంతో సామగిన్రి తీసుకువచ్చి గది పక్కనే ఉన్న గేట్ వాల్‌ను బంద్ చేసేందుకు వెళ్లా రు. అక్కడే మహిళ శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు శవాన్ని బయటకు తీసి తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్ఐలతో శవ పంచనామా చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం?
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో గల్లంతైన మహిళ మృతి చెందిది. మూసీలో లక్ష్మి మృతదేహం కొట్టుకొచ్చింది. మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని లక్ష్మీ కూతురు గుర్తించినట్లు తెలుస్తోంది. కవాడిగూడ డివిజన్ పరిధిలోని దామోదర సంజీవయ్య బస్తీలో లక్ష్మి (55) అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.. అయితే, ఇంటి దగ్గరే ఉన్న నాలాలో పడిందేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి గాంధీనగర్ పోలీసులు, జీహెచ్ఎంసీ, డిజాస్టర్ సిబ్బంది నాలాలో వెతికినా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దామోదర సంజీవయ్యనగర్‌లో నివాసం ఉండే లక్ష్మి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా..భర్త గతంలోనే చనిపోయాడు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఇంటి గోడ కూలిపోవడంతో ప్రమాదభరితంగా మారింది. హుస్సేన్‌సాగర్ నాలాకు రిటర్నింగ్ వాల్ పూర్తయితే తమ ఇంటికి టాయిలెట్ నిర్మించుకోవాలని అనుకున్నామని ఆమె కూతుళ్లు కన్నీటి పర్యంతరం అయ్యారు. Lakshmi's body, found during JCB-assisted garbage removal at #MoosarambaghBridge, is now taken for a postmortem. @NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE @shibasahu2012 #hyderabad #HyderabadRains pic.twitter.com/D5FumD59Cj — Sri Loganathan Velmurugan (@sriloganathan6) September 6, 2023 చదవండి: ఇంకెన్నాళ్లు నాలా మరణాలు? మొహం కడుక్కోవడానికి ప్రయత్నించిన లక్ష్మి ప్రమాదవశాత్తు హుస్సేన్‌సాగర్ నాలాలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మి కూతురు సుజాత తన తల్లి దగ్గరికి రాగా..ఆమె కనిపించకపోవడంతో ఆందోళన చెంది పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించారు. కాగా, మూసీలో మహిళ మృతదేహం కొట్టుకురావడంతో.. గల్లంతైన లక్ష్మిగా గుర్తించారు. -
మట్టి కింద యువతి శరీరం.. ఆమె ఎవరు? హత్య చేసిందెవరు?
ఒడిశా: నగరానికి సమీపంలో మట్టి కింద గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని హిజిలికాట్ పోలీసులు గుర్తించారు. ఐఐసీ అధికారి అభిమన్య దాస్ తెలిపిన వివరాల మేరకు.. గంజాం జిల్లా హిజిలికాట్ పోలీసుస్టేషన్ పరిధి కుకుడాఖండి బ్లాక్ పరిధిలోని మౌలపల్లి గ్రామం దగ్గర పొలంలో మట్టి కింద యువతి శరీరం కనబడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హింజిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో అస్కా మెజిస్ట్రేట్ సమక్షంలో యువతి మృతదేహాన్ని బయటికి తీశారు. యువతి మెడలో బంగారం గొలుసు, హ్యాండ్ బ్యాగ్‌లో ఫొటోని స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన అనంతరం మట్టిలో పూడ్చిపెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని బరంపురం ఎంకేసీజీ మెడికల్ ఆస్పత్రికి పోర్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విహార యాత్రలో విషాదం
మలికిపురం/సఖినేటిపల్లి: విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అంతర్వేది బీచ్‌లో ఇద్దరు గల్లంతయ్యారు. వీరిలో యువతి మృతదేహం లభ్యం కాగా, బాలుడి ఆచూకీ తెలియ రాలేదు. ఇందుకు సంబంధించిన వివరాలివీ.. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన సాలా ఏసురాజు నూతన గృహం నిర్మించుకున్నాడు. గృహప్రవేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన 15 మంది బంధువులు శుక్రవారం అంతర్వేది సాగర సంగమం వద్దకు విహార యాత్రకు వెళ్లారు. ఎగసి పడుతున్న సాగర కెరటాలను చూసిన ఉత్సాహంలో.. ఏసురాజు కుమారుడు రాజీవ్‌కుమార్ (5) పరుగు పరుగున అక్కడకు వెళ్లాడు. వేగంగా నీటిలో దిగడంతో ఒక్కసారిగా మునిగిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన ఏసురాజు సోదరి, పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకోడేరుకు చెందిన బెల్లపుకొండ జ్యోతి (20) ఒక్క ఉదుటన పరుగెత్తుకుని వెళ్లి, ఆ బాలుడిని రక్షించబోయింది. ఈ క్రమంలో అలల ధృతికి ఆమె కూడా సముద్రంలోకి కొట్టుకుపోయింది. కాసేపటికి జ్యోతి మృతదేహం లభ్యమైంది. బాలుని ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. బంధుమిత్రులందరితో కలిసి సందడిగా గృహప్రవేశం చేసుకున్నామన్న ఆనందం ఆ కుటుంబానికి ఒక్క రోజు కూడా నిలవలేదు. కన్న కొడుకు గల్లంతవ్వడం, సోదరి జ్యోతి మృతి చెందడంతో ఏసురాజు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సఖినేటిపల్లి ఎస్సై ఎస్.రాము సందర్శించారు. బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
గోనె సంచిలో మహిళ మృత దేహం.. కుక్కలు పీక్కుతింటుండగా
లక్నో: యూపీలో దారుణం చోటు చేసుకుంది. మీరట్‌లోని పార్తాపూర్‌లో సమీపంలో.. ఒక గోనె సంచిలో ఉన్న మహిళ మృత దేహం కుక్కి ఉండటం కలకలంగా మారింది. కాగా, కాశీ గ్రామంలోని చెరువుకు ఒడ్డున మహిళ మృత దేహన్ని కుక్కలు పీక్కుతింటుండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గత ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు వెంటనే మృత దేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. చనిపోయిన మహిళ.. బురఖా వేసుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పాడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: రిపబ్లిక్ డే వేడుకలలో అపశృతి.. తలపై పడిన డ్రోన్.. ఇద్దరికి -
ఐదేళ్ల క్రితం రెండో పెళ్లి: ఏమైందోఏమో రోడ్డుపై నిర్జీవంగా..
పెడన: మండలంలోని నందమూరు పంచాయతీ సత్యనారాయణపురంలో ఓ మహిళ హత్యకు గురైంది. భర్తే ఆమెను హత్య చేశాడని మృతురాలి కుమార్తెలు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవికి చెందిన పేరం లక్ష్మి(37) మొదటి భర్తకు విడాకులు ఇచ్చి సుమారు ఐదేళ్ల కిందట పెడన మండలం నందమూరు పంచాయతీ సత్యనారాయణపురం గ్రామానికి వచ్చి ఇక్కడ ఉంటోంది. నందమూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పరసా సూరిబాబు తన భార్యకు విడాకులు ఇచ్చి లక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మికి మొదటి వివాహంలో పుట్టిన సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సూరిబాబు వారితో కలిసి సత్యనారాయణపురంలోనే ఉంటున్నాడు. నాలుగేళ్ల కిందట లక్ష్మి పెద్దకుమార్తెకు వివాహం చేశారు. ఇటీవల తరుచుగా సూరిబాబు, లక్ష్మిల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట సూరిబాబు లక్ష్మితో గొడవపడి ఆమెను గాయపరచడంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స పొందింది. అనంతరం భర్తపై కేసు పెట్టింది. ఈ కేసు విషయంలో శుక్రవారం ఉదయం కూడా పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నందమూరు నుంచి కాకర్లమూడి వెళ్లే డొంక మార్గంలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ ఎన్.కొండయ్య, ఎస్ఐ మురళి, తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహం లక్ష్మిదిగా గుర్తించారు. ఉదయం పంచాయతీ జరిగిన అనంతరం సూరిబాబు, లక్ష్మి కలసి వెళ్లారని లక్ష్మి కుమార్తెలు లావణ్య, శ్రీదుర్గ చెబుతున్నారు. సూరిబాబే తమ తల్లిని హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుమార్తెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కొండయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గుజరాత్ చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: వీళ్ల అరాచకాలు ఒక్కొక్కటిగా.. -
రంగారెడ్డి: హయత్‌నగర్‌లో మహిళ మృతదేహం కలకలం
-
హయత్‌నగర్: దుప్పటిలో మహిళ మృతదేహం కలకలం
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా మహిళ మృతదేహాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానిక యువకులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి.. వారిని అప్పగించారు. హయత్‌నగర్‌లోని తొర్రూరు రోడ్డులో ఉన్న బాతుల చెరువు సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు వ్యక్తులు గురువారం రాత్రి 10 గంటల సమయంలో మహిళ మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి తీసుకెళ్తుండగా స్థానికులు గమనించారు. బ్లాంకెట్‌లో ఏమిటని ప్రశ్నించగా.. సదరు వ్యక్తులు పొంతన లేని సమాధానం చెప్పారు. దాంతో అనుమానం వచ్చిన స్థానికులు వారిద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనుమానితుల్లో ఒక వ్యక్తి తన పేరు శ్రీనివాస్ అని.. బ్లాంకెట్‌లో ఉన్నది తన భార్య మృతదేహం అని.. తమది లవ్ మ్యారేజ్ అని చెప్పాడు. ఆమె ఎలా చనిపోయిందని అని అడిగితే.. శ్రీనివాస్ సరైన సమాధానం చెప్పలేదు. (చదవండి: శవం తెచ్చిన తంటా.. ఇద్దరు ఆలయ అధికారుల సస్పెండ్) దీంతో అనుమానంతో పోలీసులకు వారిని పట్టించారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇక మహిళ ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మృతురాలిని డేగ లక్ష్మీగా గుర్తించారు. కర్ణాటకకు చెందిన డేగ లక్ష్మి, నెల్లూరుకి చెందిన శ్రీనివాస్‌కు 12 ఏళ్ల కిందట ప్రేమ వివాహంమైంది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. రెండేళ్ల కిందట బతుకుదెరువు కోసం శ్రీనివాస్ హైదరాబాద్ వచ్చాడు. తాపీమేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని.. ఈక్రమంలోనే ఆమె మృతి చెందినట్లు శ్రీనివాస్ చెప్పినట్టు సమాచారం. (చదవండి: పెన్షన్ డబ్బుల కోసం.. తల్లి మృతదేహాన్ని ‘మమ్మీ’గా మార్చి) డబ్బులు లేక స్నేహితుడి సహాయంతో ఎక్కడన్నా దహన సంస్కారాలు చేద్దామని తీసుకువెళ్తున్నట్లు శ్రీనివాస్ పోలీసుల విచారణలో తెలిపాడు. పోస్ట్మామార్టం రిపోర్ట్ వచ్చాకే లక్ష్మి మృతికి కారణాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. ప్రస్తుతం లక్ష్మి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: ఆ బాడీ దొరికితేనే సంచలన కేసు కొలిక్కి: కృష్ణానదిలో గాలింపు ముమ్మరం -
కోర్టు ఎదుట డ్రైనేజీలో మహిళ మృతదేహం, వీడిన మిస్టరీ!
సాక్షి, కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కోర్టు బస్టాప్ వద్ద డ్రైనేజీలో శవమై తేలిన మహిళ హత్య కేసు మిస్టరీని పో లీసులు ఛేదించినట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజీల ఆ ధారంగా మిస్టరీ వీడినట్లు సమాచారం. మంచి ర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఉట్కూర్‌కు చెంది న కవితగా గుర్తించిన పోలీసులు ఆమెను భర్త కమలాకర్ హత్య చేశాడని ప్రాథమికంగా నిర్ధారణకు వ చ్చినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్ర కారం.. కవితకు చిన్న వయసులోనే లక్షెట్టిపేట ప్రాంతానికే చెందిన కమలాకర్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆమెకు మ రో వ్యక్తితో వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. 11ఏళ్ల తర్వాత కమలాకర్ మళ్లీ కవిత జీవితంలోకి వచ్చాడు. ఆమెకు మాయమాట లు చెప్పి హైదరాబాద్‌కు తీసుకెళ్లి నివాసం ఉంటున్నారు. కవిత ప్రవర్తన వల్ల వారి మధ్య తరచూ గొ డవలు జరుగుతున్నాయి. కరీంనగర్లో నివాసం ఉందామని ఇల్లు అద్దెకు తీసుకునేందుకు కారులో సోమవారం రాత్రి వచ్చారు. ఇద్దరి మధ్య గొడవ తీ వ్రమైంది. కోర్టు వద్ద కారు దిగారు. కోర్టు బస్టాప్ వ ద్ద గొడవ తీవ్రమై కవిత అక్కడి నుంచి డివైడర్ దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం తగిలింది. అక్కడి నుంచి కవితను తీసుకొచ్చిన కమలాకర్ బస్టాప్ లో కూర్చోబెట్టి చున్నీతో మెడకు బిగించి ఊపిరాడకుండా చేశాడు. మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసి వెళ్లి నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లే వరకు అతడి తమ్ముడు కోర్టు చౌరస్తాలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాతోపాటు కోర్టు ఏరియా టవర్ లొకేషన్లో ఉన్న మొబైల్స్ కాల్ డే టాలోని అనుమానిత నంబర్ల ఆధారంగా కేసును ఛే దించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసుల ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్లు సమాచారం. చదవండి: అనుమానాస్పద మృతి: కోర్టు ఎదుట డ్రైనేజీలో.. -
అనుమానాస్పద మృతి: కోర్టు ఎదుట డ్రైనేజీలో..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని జిల్లా కోర్టు భవనాల సముదాయం ఎదుట డ్రైనేజీలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మహిళ మృతదేహాన్ని గుర్తించిన ఆటోడ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ రితిరాజ్, కరీంనగర్ టౌన్ ఏసీపీ అశోక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతదేహం లభ్యమైన చోట సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఉరి వేసి హత్య చేసినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. టూటౌన్, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మహిళ వివరాలు తెలియకపోవడంతో ఫొటోలు, గుర్తులు సోషల్‌మీడియాలో పోస్టు చేసి ఆరా తీస్తున్నారు. ఘటనలో ఇద్దరి పాత్ర..? జిల్లా జడ్జి భవనం ప్రాంగణం ఎదుట గల సీసీ కెమెరాల్లో మంగళవారం వేకువజామున 5గంటల ప్రాంతంలో మృతురాలు రోడ్డుపై తిరిగినట్లు రికార్డయినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి బైక్‌పై మరోవ్యక్తిని దించి వెళ్లడం, ఆ వ్యక్తి మహిళ వద్దకు వెళ్లడం సీసీ పుటేజీల్లో నమోదైంది. దీని ఆధారంగా మహిళ మృతిలో ఇద్దరి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని ఆధారాల కోసం కోర్టు ఎదురుగా ఉన్న దుకాణాల్లో సీసీ పుటేజీలను పరిశీలించారు. -
ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!
సాక్షి, గన్నవరంజ/కృష్ణా: ఓ ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో గన్నవరం శివారు మర్లపాలెంలోని చెరువులో శవమై తేలిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల అందించిన వివరాలు.. స్థానిక రామ్‌నగర్ కాలనీలో నివసిస్తున్న గోచిపాత పుష్పలత(30) ఆరేళ్ల కిందట ఏలూరులోని శనివారపుపేటకు చెందిన చోడగిరి అనిల్‌కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి ఉమామహేశ్వరి వద్ద మూడేళ్ల నుంచి పుష్పలత ఉంటోంది. తొలుత ప్రైవేట్ స్కూల్స్‌లో పనిచేసిన పుష్పలత ఇటీవల కేసరపల్లిలోని ఐటీ పార్కులోని మేధా టవర్స్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది. అయితే వివాహం అయినప్పటి నుంచి పుష్పలతకు ఆమె భర్త అనిల్‌కుమార్‌తో మనస్పర్థలున్నాయి. ఆరు నెలల కిందట అనిల్‌కుమార్ ఏలూరు వెళ్లిపోయి ఉంటున్నాడు. అప్పటి నుంచి పుష్పలతతో తరచూ భర్త ఫోన్‌చేసి గొడవ పడుతుండేవాడు. ఆమె భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్న పుష్పలత తీవ్ర మనస్తాపానికి గురై వారం రోజులుగా ఉద్యోగానికి కూడా వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో హనుమాన్‌జంక్షన్‌లో ఉంటున్న స్నేహితురాలి ఇంటికి వెళ్లివస్తానని తల్లికి చెప్పి శనివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై వెళ్లింది. తిరిగి రాత్రి 8.15 గంటలకు తల్లికి ఫోన్ చేసి ఏలూరు వెళ్తునని పుష్పలత చెప్పింది. చెరువులో శవమై.. మర్లపాలెంలోని చెరువులో పుష్పలత శవమై తేలడాన్ని ఆదివారం తెల్లవారుజామున గ్రామస్తులు గుర్తించారు. తొలుత చెరువు గట్టున హ్యాండ్ బ్యాగ్‌తో కూడిన వాహనం పార్కింగ్ చేసి ఉండి, కొద్ది దూరంలో వాచ్, కళ్లజోడు ఉండడం గమనించారు. చుట్టూ పరిశీలించగా మినరల్ వాటర్ ప్లాంట్ వెనుక చెరువులో మృతదేహం తేలి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ వాసిరెడ్డి శ్రీనివాస్ హ్యాండ్ బ్యాగ్‌లోని బ్యాంక్ పాస్‌బుక్ ఆధారంగా ఆమె పుష్పలతగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లి ఉమామహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనిల్‌కుమార్ వేధింపులతో కుమార్తె మృతి చెందినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పుష్పలతది హత్య? ఆత్మహత్య అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
హత్య చేసి.. దహనం
హిందూపురం అర్బన్: కర్టాటకలోని పోలేపల్లి సమీపంలో గుర్తు తెలియని 22 ఏళ్ల యువతి శవం లభ్యమైంది. ఈమెను హత్య చేసి గోనె సంచిలో ఇక్కడి తీసుకువచ్చి పెట్రోల్ పోసి కాల్చిచంపినట్లు కొడిగెనహళ్లి పోలీసులు కేసునమోదు చేశారు. కాగా బుధవారం మృతురాలి తల్లి అపర్ణ తన కుమారై 23వతేది నుంచి కనపించడం లేదని వన్ టౌన్‌పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టన సీఐ చిన్న గోవిందు పోలేపల్లి వద్ద లభ్యమైన శవం దీపికగా గుర్తించారు. అపర్ణ తన కుమారైను అన్న కొడుకు పాండు వినయ్‌తో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం చేసింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. పెళ్లెనా ఏడాదికే కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలతో విడిపోయారు. ఈ నేపథ్యంలో దీపిక మృతి చెందటంతో హత్య కేసుగా కర్ణాటక పోలీసులు నమోదు చేశారు. ఈ మేరకు కర్టాటక పోలీసులు హిందూపురానికి వచ్చి విచారణ చేశారు. -
భార్య దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు
-
మహిళను హత్య చేసి మూటలో పడేశారు
-
పల్లవి శరీరంపై గాయాలున్నాయి
సాక్షి, ముంబై : గత రాత్రి రైలు పట్టాలపై దొరికిన యువతి మృత దేహాన్ని ఎట్టకేలకు దక్షిణ ముంబై పోలీసులు గుర్తించారు. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడు నీలేశ్ వికమ్‌సే కూతురు పల్లవిగా తేల్చారు. 20 ఏళ్ల పల్లవి ఫోర్ట్ లోని ఓ లా సంస్థలో ఇంటర్న్‌షిఫ్ చేస్తోంది. అయితే ఈ నెల 4 నుంచి ఆమె కనిపించకుండా పోయిందంటూ కుటుంబ సభ్యులు ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పరేల్-కర్రీ రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలపై యువతి మృతదేహం పడి ఉందని ఓ ఆంగతకుడు పరేల్ స్టేషన్ మాస్టర్ కు సమాచారం అందించాడు. దీంతో ఆయన పోలీసులకు విషయం తెలియజేయగా.. యువతి మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. అనంతరం చనిపోయింది పల్లవేనని పోలీసులు నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఎప్పటిలాగే తన పనికి వెళ్లిన పల్లవి ఈ నెల 4న సాయంత్రం ఆరుగంటలకు సీఎస్ఎంటీ స్టేషన్లో రైలు ఎక్కిందని డీసీపీ సమాధాన్ పవార్ తెలిపారు. ఆ తర్వాతే ఆమె కనిపించకుండా పోయిందని ఆయన తెలిపారు. తొలుత తన చావుకు ఎవరూ కారణం కాదని ఆమె మొబైల్ నుంచి కుటుంబ సభ్యులకు సందేశం పెట్టడంతో ఆత్మహత్య చేసుకుందని భావించారు. అయితే, తలతోపాటు శరీరంపై తీవ్ర గాయాలుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఆమె ఎలా చనిపోయిందన్న అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని పవార్ తెలిపారు. మరోవైపు కాల్ చేసి సమాచారం అందించిన అగంతకుడిని ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. -
యువతుల కోసం వశీకరణ కాటుక
చెన్నై: తమిళనాడు పెరంబలూరులో సంచలనం సృష్టించిన క్షుద్రపూజల కార్తికేయన్ ఉదంతంలో పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్షుద్రపూజలకు పాల్పడిన అతడు యువతులను లొంగదీసుకునేందుకు వశీకరణ కాటుకను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పెరంబలూరు ఎంఎం నగర్‌కు చెందిన కార్తికేయన్ (32) తన ఇంట్లో క్షుద్రపూజలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. (చదవండి...పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతా) ఇలా వుండగా పోలీసులు తాజాగా జరిపిన విచారణలో ఇతగాడు యువతులను లొంగదీసుకునేందుకు వశీకరణ కాటుకను ఉపయోగించినట్లు సమాచారం. కాగా ఒక చిన్నారిని నరబలి ఇచ్చాడనే ఆరోపణతో కార్తికేయన్‌ను కొద్దిరోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవలే అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చాకే అతడు నివాసం ఉంటున్న ఇంట్లో యువతి మృతదేహం బయటపడడంతో ఆమెను సైతం నరబలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
యనమదుర్రు కాలువలో మహిళ మృతదేహం
భీమవరం టౌన్ : యనమదుర్రు కాలువలో దెయ్యాలతిప్ప వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. తన కుమార్తె వెలిగొట్ల దుర్గానవ్య (21) కనిపించడం లేదని స్థానిక బలుసుమూడి బీసీ కాలనికి చెందిన సత్యనారాయణ టూటౌన్ పోలీస్‌స్టేçÙన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో మహిళ అదృశ్యమైనట్టు కేసును టూటౌన్ సీఐ ఎం.రమేష్‌బాబు నమోదు చేశారు. ఇది జరిగిన కొద్ది గంటలకే మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సీఐ చెప్పారు. దుర్గానవ్య మానసిక స్థితి బాలేదని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 12న యనమదుర్రు కాలువలో దూకిన మహిళ దుర్గనవ్యే అయి ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎం.రమేష్‌బాబు తెలిపారు. -
ఎయిర్‌పోర్టు రోడ్డుపై మహిళ మృతదేహం
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాతంరాయి వద్ద రహదారిపై ఓ మహిళ మృతదేహం శనివారం స్థానికులు గుర్తించారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని...మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళను ఎవరో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదంలో సదరు మహిళ మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
కారులో మహిళ మృతదేహం తీసుకెళ్తూ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో విస్తుగొలిపే ఘటన వెలుగు చూసింది. ఉత్తర ఢిల్లీలోని మౌరైస్ నగర్లో మంగళవారం సాయంత్రం 40 ఏళ్ల మహిళ మృతదేహాన్ని కారులో తీసుకెళ్తూ ఆమె స్నేహితుడు పోలీసులకు దొరికిపోయాడు. మృతురాలి శరీరంపై బుల్లెట్ గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారిస్తున్నారు. ఢిల్లీ శివారు రోహిణిలో మృతురాలు తన భర్త, ఇద్దరు పిల్లలతో కలసి నివసించేదని పోలీసుల విచారణలో తేలింది. మంగళవారం కమలా నెహ్రూ రిడ్జ్‌లో ఉన్న బొంటా పార్క్‌లో ఆమె తన స్నేహితుడిని కలిసినట్టు పోలీసులు చెప్పారు. స్నేహితుడి కారులో కూర్చుని ఇద్దరూ గొడవపడినట్టు తెలిపారు. కాసేపటి తర్వాత బాధితురాలి స్నేహితుడు తన సోదరికి ఫోన్ చేసి.. కారులో ఆమె తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు సోదరికి చెప్పాడు. అతని సోదరి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో.. సంఘటన ప్రాంతంలో పోలీసులు చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి ఆ కారు కోసం సోదాలు చేశారు. స్నేహితురాలి మృతదేహాన్ని కారులో తీసుకున్న వస్తున్న అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రోడ్డు పక్కన మహిళ మృతదేహం
దుండిగల్ (హైదరాబాద్) : గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.ఈ ఘటన నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది.రోడ్డు పక్కన మహిళ మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. అత్యాచారం చేసి అంతమొందించారేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాగ్ లో యువతి మృతదేహం
హైదరాబాద్ : లింగంపల్లి రైల్వేస్టేషన్లో గురువారం దారుణం వెలుగుచూసింది. రైల్లోని బోగీలో వదిలేసి ఉన్న ఓ బ్యాగ్‌ను రైల్వే పోలీసులు తెరచి చూడగా గుర్తుతెలియని యువతి ( సుమారు 20 సంవత్సరాలు) మృతదేహం కనిపించింది. కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయి. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కాలువలో మహిళ మృతదేహం
దుర్గి (గుంటూరు) : నాగార్జున సాగర్ కుడి కాలువలో శుక్రవారం ఓ మహిళ మృతదేహం కొట్టుకొచ్చింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎన్ఎస్పీ కాలువ వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిందా.. లేక ఎవరైనా హత్య చేసి కాలువలో పడేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎర్రచెరువులో మహిళ మృతదేహం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలోని ఎర్రచెరువులో గురువారం గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎర్రచెరువు వద్దకు చేరుకుని మహిళ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళ వయస్సు 40 - 50 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మహిళ మృతదేహన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్య లేక ఆత్మహత్య అనేది పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : హుస్సేన్ సాగర్‌లో ఓ గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని రాంగోపాల్‌పేట్ పోలీసులు సోమవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. మృతురాలికి 18 నుంచి 20 సంవత్సరాల వయసు ఉంటుందని, ఒంటిపై మెరూన్ కలర్ టాప్, నలుపు రంగు లెగిన్ ధరించి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్లో లేదా 040-27853595, 9490616346 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
పొలాల్లో మహిళ మృతదేహం
పెద్దపప్పూరు (అనంతపురం) : అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని మహిళ శవం పంట పొలాల్లో కనిపించింది. జిల్లాలోని పెద్దపప్పూరు మండలంలోని నరసాపురం గ్రామంలో పంట పొలాల్లో స్థానికులు శనివారం ఓ మహిళ మృతదేహం పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలిది సహజ మరణమా లేదా హత్యా అనేది తేలాల్సి ఉంది. అలాగే మృతురాలు వివరాలు కూడా తెలియాల్సి ఉంది. -
లిఫ్టు అడుగున మహిళ మృతదేహం
తిరువొత్తియూరు: చెన్నై కొత్వాల్ చావడిలోని ఓ అపార్టుమెంటు లిప్టు అడుగుభాగంలో మహిళ మృతదేహాన్ని సోమవారం పోలీసులు కనుగొన్నారు. చెన్నై కొత్వాల్ చావడి సాధిక్ వీధికి చెందిన సాధిక్ వీధికి చెందిన వ్యక్తి డేవిడ్ సింగ్ (45). ఇతను షావుకారుపేటలో బొమ్మల హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతని భార్య రేణుక (40). శనివారం ఆలయానికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళిన రేణుక తిరిగి ఇంటికి రాలేదు. ఈమె బంధువులు ఈమె కోసం అన్ని చోట్ల గాలించినప్పటికీ రేణుక ఆచూకి తెలియలేదు. దీనిపై కొత్వాల్ చావడి పోలీసులకు డేవిడ్సింగ్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రేణుక నివాసం వుంటున్న అపార్టుమెంటులో వున్న లిప్టు అడుగు నుంచి దుర్వాసన వెలువడింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేయగా రెండు రోజులుగా లిప్టు పని చేయడం లేదని తెలిసింది. దీంతో కార్మికులను పిలిపించి లిప్టు తొలగించి చూడగా లిప్టు కింద శరీరం నలిగిన స్థితిలో రేణుక శవంగా పడి ఉంది. ఇది చూసిన అక్కడి వారు దిగ్భ్రాంతి చెందారు. రేణుక లిఫ్టుకు అడుగు భాగంలోకి ఎందుకు వెళ్లింది, ఎలా మృతి చెందిందని పోలీసులు విచారణ చేస్తున్నారు. -
రైల్వేబ్రిడ్జి కింద మహిళ మృతదేహం
గుంటూరు (మంగళగిరి) : అనుమానాస్పద స్థితిలో రైల్వే బ్రిడ్జి కింద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలోని రైల్వే బ్రిడ్జి వద్ద గురువారం జరిగింది. మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది తమ పరిధిలోకి రాదని, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఎక్కడైనా హత్య చేసి తెచ్చి ఇక్కడ పడేశారా, లేక ఇక్కడే హతమార్చారా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నా -
ఇండికా కారులో మహిళ మృతదేహం
-
ఇండికా కారులో మహిళ మృతదేహం
హైదరాబాద్ : బేగంపేట పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ప్రకాశ్‌నగర్‌లో నిలిపి ఉంచిన ఓఇండికా కారు నుంచి దుర్గంధం వెలువడటంలో స్థానికులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ప్రకాశ్‌నగర్ చేరుకుని మహిళ మృతదేహంతోపాటు కారును స్వాధీనం చేసుకుని... పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం మృతదేహాన్ని కారు నుంచి బయటకు తీశారు. మహిళ మృతదేహం గుర్తు పట్టలేకుండా ఉంది. దీంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొంత కాలంగా కారు అక్కడే ఉంటుందని స్థానికులు పోలీసులు తెలిపారు. ఎంత కాలం నుంచి ఆ కారు అక్కడే ఉంటుందన్నది మాత్రం స్థానికులు చెప్పలేకపోతున్నారు. కాగా కారు నెంబర్... వివరాలు లేకపోవడంతో పోలీసులు కారు యాజమాని ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతురాలు యాచకురాలని పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తెలిసింది. ఆమె సదరు కారులో నివాసం ఏర్పరుచుకుందా ? లేక దుండగులు ఆమెను హత్య చేసి ఈ కారులో పడేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ అసలు విషయం తెలియదని పోలీసులు వెల్లడించారు. -
మహబూబ్ నగర్లో అస్తిపంజరం కలకలం
-
లారీ టూల్ బాక్స్‌లో మహిళ అస్థిపంజరం
మహబూబ్‌నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మహిళ అస్థిపంజరం కలకలం సృష్టించింది. బిజినేపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసుల స్వాధీనంలోని ఓ లారీ టూల్ బాక్స్ లోంచి ఈ అస్థి పంజరం బయటపడడంతో సంచలనం కలిగించింది. ఏడేళ్ల క్రితం 2007 జనవరి 10న జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంచారు. ఈ కేసును రెండేళ్ల క్రితం కోర్టులో కొట్టేశారు. అప్పటి నుంచి చెడిపోయిన లారీకి మరమత్తులు చేయించేందుకు మెకానిక్‌ను తీసుకుని యజమాని స్టేషన్ వద్దకు వచ్చి చూడగా లారీలో మహిళ అస్థి పంజరం కనిపించింది. మృతురాలు బిజినేపల్లికి చెందిన లక్ష్మమ్మగా పోలీసులు భావిస్తున్నారు. -
టూల్‌బాక్స్‌లో మహిళ మృతదేహం
న్యూఢిల్లీ: ఒక ప్రముఖ పాఠశాల స్కూలు బస్సు వెనుకభాగంలో ఉన్న టూల్‌బాక్స్‌లో మహిళ శవం లభించింది. ఆమె వయసు 35 సంవత్సరాలు ఉంటుందని, మృతదేహం కుళ్లి గుర్తుపట్టలేని స్థితిలో ఉందని పోలీసులు చెప్పారు. గత కొన్ని రోజుల క్రితం మృతి చెందిన ఆమె పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఆ మహిళ మూడు రోజుల క్రితం మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే షాలోమ్ హిల్స్ ఇంటర్నేషనల్ స్కూలు బస్సు వర్క్‌షాపు నుంచి వచ్చిందని తెలిపారు. గత మూడు రోజులుగా ఈ బస్సు షెడ్డులోనే ఉందని చెప్పారు. మహిళను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని, మతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించామని దర్యాప్తు అధికారి తెలిపారు.