
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: యూపీలో దారుణం చోటు చేసుకుంది. మీరట్‌లోని పార్తాపూర్‌లో సమీపంలో.. ఒక గోనె సంచిలో ఉన్న మహిళ మృత దేహం కుక్కి ఉండటం కలకలంగా మారింది. కాగా, కాశీ గ్రామంలోని చెరువుకు ఒడ్డున మహిళ మృత దేహన్ని కుక్కలు పీక్కుతింటుండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గత ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అధికారులు వెంటనే మృత దేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. చనిపోయిన మహిళ.. బురఖా వేసుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పాడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: రిపబ్లిక్ డే వేడుకలలో అపశృతి.. తలపై పడిన డ్రోన్.. ఇద్దరికి
Comments
Please login to add a commentAdd a comment