న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో విస్తుగొలిపే ఘటన వెలుగు చూసింది. ఉత్తర ఢిల్లీలోని మౌరైస్ నగర్లో మంగళవారం సాయంత్రం 40 ఏళ్ల మహిళ మృతదేహాన్ని కారులో తీసుకెళ్తూ ఆమె స్నేహితుడు పోలీసులకు దొరికిపోయాడు. మృతురాలి శరీరంపై బుల్లెట్ గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారిస్తున్నారు.
ఢిల్లీ శివారు రోహిణిలో మృతురాలు తన భర్త, ఇద్దరు పిల్లలతో కలసి నివసించేదని పోలీసుల విచారణలో తేలింది. మంగళవారం కమలా నెహ్రూ రిడ్జ్లో ఉన్న బొంటా పార్క్లో ఆమె తన స్నేహితుడిని కలిసినట్టు పోలీసులు చెప్పారు. స్నేహితుడి కారులో కూర్చుని ఇద్దరూ గొడవపడినట్టు తెలిపారు. కాసేపటి తర్వాత బాధితురాలి స్నేహితుడు తన సోదరికి ఫోన్ చేసి.. కారులో ఆమె తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు సోదరికి చెప్పాడు. అతని సోదరి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో.. సంఘటన ప్రాంతంలో పోలీసులు చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి ఆ కారు కోసం సోదాలు చేశారు. స్నేహితురాలి మృతదేహాన్ని కారులో తీసుకున్న వస్తున్న అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కారులో మహిళ మృతదేహం తీసుకెళ్తూ..
Published Wed, May 11 2016 1:57 PM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM
Advertisement
Advertisement