రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : హుస్సేన్ సాగర్‌లో ఓ గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని రాంగోపాల్‌పేట్ పోలీసులు సోమవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. మృతురాలికి 18 నుంచి 20 సంవత్సరాల వయసు ఉంటుందని, ఒంటిపై మెరూన్ కలర్ టాప్, నలుపు రంగు లెగిన్ ధరించి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో లేదా 040-27853595, 9490616346 నంబర్లను సంప్రదించాలని కోరారు.