
హిందూపురం అర్బన్: కర్టాటకలోని పోలేపల్లి సమీపంలో గుర్తు తెలియని 22 ఏళ్ల యువతి శవం లభ్యమైంది. ఈమెను హత్య చేసి గోనె సంచిలో ఇక్కడి తీసుకువచ్చి పెట్రోల్ పోసి కాల్చిచంపినట్లు కొడిగెనహళ్లి పోలీసులు కేసునమోదు చేశారు. కాగా బుధవారం మృతురాలి తల్లి అపర్ణ తన కుమారై 23వతేది నుంచి కనపించడం లేదని వన్ టౌన్‌పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టన సీఐ చిన్న గోవిందు పోలేపల్లి వద్ద లభ్యమైన శవం దీపికగా గుర్తించారు.
అపర్ణ తన కుమారైను అన్న కొడుకు పాండు వినయ్‌తో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం చేసింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. పెళ్లెనా ఏడాదికే కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలతో విడిపోయారు. ఈ నేపథ్యంలో దీపిక మృతి చెందటంతో హత్య కేసుగా కర్ణాటక పోలీసులు నమోదు చేశారు. ఈ మేరకు కర్టాటక పోలీసులు హిందూపురానికి వచ్చి విచారణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment