మట్టి కింద యువతి శరీరం.. ఆమె ఎవరు? హత్య చేసిందెవరు? | - | Sakshi
Sakshi News home page

మట్టి కింద యువతి శరీరం.. ఆమె ఎవరు? హత్య చేసిందెవరు?

Published Wed, Aug 2 2023 6:48 AM | Last Updated on Wed, Aug 2 2023 8:08 AM

- - Sakshi

గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన అనంతరం మట్టిలో పూడ్చిపెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఒడిశా: నగరానికి సమీపంలో మట్టి కింద గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని హిజిలికాట్‌ పోలీసులు గుర్తించారు. ఐఐసీ అధికారి అభిమన్య దాస్‌ తెలిపిన వివరాల మేరకు.. గంజాం జిల్లా హిజిలికాట్‌ పోలీసుస్టేషన్‌ పరిధి కుకుడాఖండి బ్లాక్‌ పరిధిలోని మౌలపల్లి గ్రామం దగ్గర పొలంలో మట్టి కింద యువతి శరీరం కనబడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే హింజిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో అస్కా మెజిస్ట్రేట్‌ సమక్షంలో యువతి మృతదేహాన్ని బయటికి తీశారు. యువతి మెడలో బంగారం గొలుసు, హ్యాండ్‌ బ్యాగ్‌లో ఫొటోని స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన అనంతరం మట్టిలో పూడ్చిపెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని బరంపురం ఎంకేసీజీ మెడికల్‌ ఆస్పత్రికి పోర్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement