కొరాపుట్: అడవిలో దంపతులు మృతి చెందిన ఘటన కొరాపుట్ జిల్లాలో చోటు చేసుకుంది. గురువారం కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి నందపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిపుట్ గ్రామానికి చెందిన బలరాం గలాయి (22), బల గలాయి (21) మృతి చెందారు. వీరిద్దరూ టీ దుకాణం నడుపుతుంటారు.
కట్టెలు తేవడానికి అడవిలోనికి వెళ్లగా అక్కడ అడవి పందులను వేటాడడానికి పెట్టిన విద్యుత్‌తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. అడవికి వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు అడవిలో గాలించగా మృతదేహాలు దొరికాయి. నందపూర్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన వేటగాళ్ల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment