జయపురం: ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించడంతో యువతి మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో ఘటన జరిగింది. బొయిపరిగుడ సమితి కలాపొడ గ్రామంలో యువతి దేవకీ పూజారి డెంగకుసుమగుడ గ్రామానికి చెందిన జొగా బిశాయిలు ప్రేమించుకున్నారు.
కొన్ని రోజుల కిందట ఆమెకు పెళ్లి సంబంధం వచ్చింది. దీంతో ఆమె ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పి పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ జొగా బిశాయి పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది శనివారం రాత్రి పురుగుమందు తాగేసింది. ఆమెను కుటుంబ సభ్యులు కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆదివారం ఆమె మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కలాపొడ తీసుకువచ్చారు.
మృతదేహాన్ని ముట్టుకోని గ్రామస్తులు..
గ్రామానికి తీసుకువచ్చిన మృతదేహాన్ని స్థానికులు ముట్టుకోలేదు. ఆ యువతి ప్రేమించిన వ్యక్తి కులం, ఆమె కులం వేర్వేరు కావడంతో స్థానికులు అంత్యక్రియలకు సైతం రావడానికి ఒప్పుకోలేదు. దీంతో చాలాసేపు యువతి మృతదేహం శ్మశానంలో దహన సంస్కారాలు లేకుండా అలాగే ఉండిపోయింది. అనంతరం కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం నిందితుడు జొగా బిశాయిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment