గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.ఈ ఘటన నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది.
దుండిగల్ (హైదరాబాద్) : గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.ఈ ఘటన నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది.రోడ్డు పక్కన మహిళ మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. అత్యాచారం చేసి అంతమొందించారేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.