ఫామ్‌హౌస్‌లో మృతదేహం పూడ్చివేత | Woman Brutally Murdered At Chevella Village In Rangareddy District - Sakshi
Sakshi News home page

ఫామ్‌హౌస్‌లో మృతదేహం పూడ్చివేత

Published Mon, Sep 11 2023 6:46 AM | Last Updated on Mon, Sep 11 2023 12:50 PM

మహిళను హత్యచేసి పాతిపెట్టిన స్థలం   - Sakshi

మహిళను హత్యచేసి పాతిపెట్టిన స్థలం

ఓ ఫామ్‌హౌస్‌లో గుర్తు తెలియని మహిళ శవాన్ని పాతిపెట్టిన విషయం ఆదివారం చేవెళ్లలో కలకలం రేపింది.

రంగారెడ్డి: ఓ ఫామ్‌హౌస్‌లో గుర్తు తెలియని మహిళ శవాన్ని పాతిపెట్టిన విషయం ఆదివారం చేవెళ్లలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మండలకేంద్రంలోని కనకమామిడి మల్లారెడ్డి అనే రైతు ఫామ్‌హౌస్‌లో సత్తయ్య, కల్పన అనే ఇద్దరు భార్యాభర్తలు కూలీలుగా పనిచేస్తున్నారు. ఈనెల 7న సత్తయ్య, కల్పనలు ఓ మహిళ, మరో వ్యక్తిని ఫామ్‌హౌస్‌కు తీసుకువచ్చారు.

వారు తమ అన్నావదినలుగా యాజమానికి పరిచయం చేశారు. శుక్రవారం సత్తయ్య, కల్పనలు తమ ఇంటి వద్ద గొడవలు జరుగుతున్నాయని ఇంటికి వెళ్తున్నామని మల్లారెడ్డికి చెప్పి వెళ్లారు. దీంతో ఆయన నిన్న వచ్చిన మీ అన్నావదినలు ఎక్కడని అడగ్గా వాళ్లు నిన్ననే వెళ్లిపోయారని చెప్పారు. ఆదివారం పొలం వద్ద పైపులైన్‌ పగిలిపోవటంతో సరిచేసేందుకు మల్లారెడ్డితో పాటు మరో వ్యక్తి వెంకట్‌రెడ్డి, డ్రైవర్‌ శేఖర్‌లు వెళ్లారు.

దీంతో సామగిన్రి తీసుకువచ్చి గది పక్కనే ఉన్న గేట్‌ వాల్‌ను బంద్‌ చేసేందుకు వెళ్లా రు. అక్కడే మహిళ శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు శవాన్ని బయటకు తీసి తహసీల్దార్‌ కృష్ణయ్య, ఆర్‌ఐలతో శవ పంచనామా చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement