లారీ టూల్ బాక్స్లో మహిళ అస్థిపంజరం | Woman skeleton found in Lorry Tool Box | Sakshi
Sakshi News home page

లారీ టూల్ బాక్స్లో మహిళ అస్థిపంజరం

Published Tue, Oct 29 2013 1:05 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

లారీ టూల్ బాక్స్లో మహిళ అస్థిపంజరం - Sakshi

లారీ టూల్ బాక్స్లో మహిళ అస్థిపంజరం

మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మహిళ అస్థిపంజరం కలకలం సృష్టించింది. బిజినేపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసుల స్వాధీనంలోని ఓ లారీ టూల్ బాక్స్ లోంచి ఈ అస్థి పంజరం బయటపడడంతో సంచలనం కలిగించింది. ఏడేళ్ల క్రితం 2007 జనవరి 10న జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంచారు.

ఈ కేసును రెండేళ్ల క్రితం  కోర్టులో కొట్టేశారు. అప్పటి నుంచి చెడిపోయిన లారీకి మరమత్తులు చేయించేందుకు మెకానిక్ను తీసుకుని యజమాని  స్టేషన్ వద్దకు వచ్చి చూడగా లారీలో మహిళ అస్థి పంజరం కనిపించింది. మృతురాలు బిజినేపల్లికి చెందిన లక్ష్మమ్మగా పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement