Woman skeleton
-
కలకలం రేపిన మహిళ అస్థిపంజరం.. 50 రోజులుగా చెట్టుకు వేలాడుతూ..
నగరి(చిత్తూరు జిల్లా): డీవీఆర్‌కండ్రిగ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ మహిళ పుర్రె కనిపించడం ఆదివారం కలకలం రేపింది. ఎక్కువ రోజులు కావడంతో మహిళ ఎవరో గుర్తు తెలియని విధంగా ఉంది. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని జంతువులు లాక్కెళ్లి పీక్కుతిన్నట్లు పలు ప్రాంతాల్లో ఎముకలున్న ఆనవాళ్లు కనిపించింది. సీఐ మద్దయ్య ఆచారి తెలిపిన వివరాల మేరకు.. మేకల కాపరులు ఆదివారం సాయంత్రం మేకలు మేపుతూ అటవీ ప్రాంతంలో చెట్టుకు తల వేలాడుతూ ఉండటాన్ని గమనించి భయపడి పరుగులు తీశారు. చదవండి: తల్లి మరణించిందని తెలియక.. రోజూ స్కూల్‌కు వెళ్లొచ్చిన బాలుడు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు చీరకు వేలాడుతున్న పుర్రె, సమీపంగా పడివున్న పచ్చ, నీలి రంగు కలిసిన చీర, డార్క్ గ్రీన్ కలర్ జాకెట్, పూసల దండ, ఎముకలను గమనించారు. వాటిని శవపరీక్షకు పంపారు. మృతి చెంది 50 నుంచి 60 రోజులు అయ్యుంటుందని వైద్యులు తేల్చారు. వయసు నిర్ధారించలేకపోతున్నారు. మహిళ ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా చంపి వేలాడదీశారా అనే కోణాల్లో విచారిస్తున్నారు. అటవీ ప్రాంతం కావడంతో గ్రామస్తులు ఎక్కువగా ఆ వైపు వెళ్లకపోవడం వల్ల 50 రోజుల వరకు విషయం బయటపడలేదు. విచారణ కొనసాగుతోంది. -
3 నెలల క్రితం అత్యాచారం.. రైల్వే స్టేషన్లో అస్థిపంజరం
సాక్షి, టీ.నగర్: చెన్నై రైల్వేస్టేషన్లో ఓ యువతి అస్థిపంజరాన్ని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె అత్యాచారానికి గురై హత్య గావించబడినట్లు తెలియడంతో తీవ్ర విచారణ జరుపుతున్నారు. చెన్నై కోట్టూర్‌పురం పోలీసులు ఆదివారం గంజాయి ముఠాకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతూ వచ్చారు. మత్తులో జోగుతున్న వారు సంచలన సమాచారం అందించారు. మూడు నెలల క్రితం ఓ యువతి చెన్నై గ్రీన్‌వేస్‌రోడ్డు రైల్వేస్టేషన్లో రాత్రి అత్యాచారానికి గురై హత్య గావించబడినట్లు, ఆ యువతి మృతదేహాన్ని రైల్వేస్టేషన్‌లోని ఒక గోదాములో విసిరేసి నిందితులు పరారైనట్లు, దీన్ని తాము స్వయంగా చూసినట్లు ముఠా వ్యక్తులు తెలిపారు. దీంతో పోలీసులు గ్రీన్‌వేస్‌రోడ్డు రైల్వేస్టేషన్ గోదాములో తనిఖీ చేశారు. ఈ గోదాములో ఒక మానవ అస్తిపంజరం లభించింది. దీన్ని రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. గంజాయి ముఠా వద్ద తీవ్ర విచారణ జరపగా అత్యాచార ముఠాకు చెందిన ఒక వ్యక్తి సమాచారం లభించింది. ఆ వ్యక్తి గత మూడు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇది పోలీసులను దిగ్భ్రాంతి కలిగించింది. అడిషనల్ కమిషనర్ డాక్టర్ కన్నన్ ఉత్తర్వుల మేరకు జాయింట్ కమిషనర్ బాలకృష్ణన్, అసిస్టెంట్ కమిషనర్ శ్యాంసన్ పర్యవేక్షణలో కోట్టూర్‌పురం పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడికాగలవని సమాచారం. చదవండి: ప్రాణాలు బలిగొన్న కులాంతర ప్రేమ -
డీఎస్పీ బంధువు ఇంట్లో మహిళ అస్థిపంజరం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలోని హిమా నగర్లో ఓ డీఎస్పీ బంధువు ఇంట్లో... మహిళ అస్థిపంజరం బయటపడిన ఘటన కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం మహిళను హత్య చేసి ఇంట్లోనే గొయ్యితీసి పూడ్చి పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహబూబ్ నగర్లో అస్తిపంజరం కలకలం
-
లారీ టూల్ బాక్స్‌లో మహిళ అస్థిపంజరం
మహబూబ్‌నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మహిళ అస్థిపంజరం కలకలం సృష్టించింది. బిజినేపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసుల స్వాధీనంలోని ఓ లారీ టూల్ బాక్స్ లోంచి ఈ అస్థి పంజరం బయటపడడంతో సంచలనం కలిగించింది. ఏడేళ్ల క్రితం 2007 జనవరి 10న జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంచారు. ఈ కేసును రెండేళ్ల క్రితం కోర్టులో కొట్టేశారు. అప్పటి నుంచి చెడిపోయిన లారీకి మరమత్తులు చేయించేందుకు మెకానిక్‌ను తీసుకుని యజమాని స్టేషన్ వద్దకు వచ్చి చూడగా లారీలో మహిళ అస్థి పంజరం కనిపించింది. మృతురాలు బిజినేపల్లికి చెందిన లక్ష్మమ్మగా పోలీసులు భావిస్తున్నారు.