Indica car
-
వీడియో: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా కార్
-
‘ఆ కారు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’.. రతన్ టాటా భావోద్వేగ పోస్ట్ వైరల్!
రతన్ టాటా.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగానే కాకుండా తన దాతృత్వ కార్యక్రమాల ద్వారా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను తన పోస్ట్‌లతో పలకరిస్తూ భారీగా ఫోలోవర్స్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశ ప్రగతి కోసం తన వంతు కృషి చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన టాటా ఇండికా కారుని ప్రారంభించ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాన్ని గుర్తుచేసుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు. అందులో .. ‘25 ఏళ్ల క్రితం టాటా ఇండికా ప్రారంభం కావడంతో భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది పడింది. ఇది మధురమైన జ్ఞాపకాలను నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది. ఈ కారుకు నా మనస్సులో ప్రత్యేక స్థానం ఉందంటూ..’ టాటా ఇండికాతో దిగిన ఫోటో షేర్ చేశారు. 1998లో ఇండికా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగాన్ని ప్రారంభించింది. ఈ వాహనం ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చింది. ఇందులోని ఫీచర్లు, అందుబాటు ధరల కారణంగా త్వరగా ఈ కారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఇరవై సంవత్సరాల తర్వాత, టాటా మోటార్స్ ఈ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కొన్న తర్వాత 2018లో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని నిలిపివేసింది. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) చదవండి: ‘అప్పుడు తండ్రిని.. ఇప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను’.. అమెజాన్ ఉద్యోగుల అంతులేని వ్యథ -
ఫోర్డ్‌పై రతన్‌టాటా స్వీట్ రివేంజ్ !
దేశమన్నా ఇక్కడి ప్రజలన్నా అమితంగా ఇష్టపడే రతన్‌టాటా ఓ విదేశీ కంపెనీ భారతీయులపై చూపించిన తల పొగరుకు ఊహించని రీతిలో బుద్ధి చెప్పారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలను బిర్లాల కుటుంబ సభ్యుడు వేదాంత్ బిర్లా ట్విటర్లో షేర్ చేశారు. జేఎల్ఆర్ను టాటా టేకోవర్ చేసి పద్నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా రతన్‌టాటా గొప్పదనాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేశారు. ఫోర్డ్‌పై టాటా ప్రతీకారం తీర్చుకున్న తీరు.. అంబాసిడర్ కారు మినహా 90వ దశకం వరకు పూర్తిగా స్వదేశీ కార్లు ఇండియాలో అందుబాటులో లేవు. జపాన్, అమెరికా, కొరియా అందించే సాంకేతిక సహకారంతో దేశీయంగా అనేక కార్లు మార్కెట్లోకి వచ్చాయి. కానీ పూర్తి స్వదేశీ కారు లేదు. ఆ లోటు భర్తీ చేసేందుకు రతన్ టాటా ఇండికా పేరుతో స్వదేశీ కారుని 1998లో మార్కెట్లోకి తెచ్చారు టాటా. కానీ ఆ కారు ముందుగా అంచనాలను అందుకోలేకపోయింది. ఊహించిన నష్టాలు వచ్చాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు, సరైన పరిష్కారం కనుగొనేందుకు 1999లో అమెరికా ఫ్లైట్ ఎక్కారు రతన్ టాటా. మీకెందుకయ్యా కార్లు అమెరికా వెళ్లిన రతన్‌టాటా అక్కడ ఫోర్డ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇండియా నష్టాల కారణంగా కార్ల తయారీ యూనిట్‌ను కొనుగోలు చేయాలంటూ ఫోర్డ్ కంపెనీతో చర్చలు జరిపాడు. అప్పుడు ఆ కంపనీ బాస్‌గా ఉన్న బిల్లీఫోర్డ్ భారత్‌ను మరీ తక్కువ చేసి మాట్లాడారు. కార్ల గురించి ఏమీ తెలియని మీకు ఎందుకు సొంత కార్లు ? అంటూ హేళనగా మాట్లాడారు. ఇండికాను మా మద్దతు ఇవ్వలేం. కంపెనీ మూసేయండంటూ ఉచిత సలహా ఇచ్చారు. అవమాన భారంతో ఫోర్డ్ చేసిన వ్యాఖ్యలను నొచ్చుకున్న రతన్ టాటా ఇండియాకి తిరిగి వచ్చారు. రిసెర్చ్ డిపార్ట్మెంటుతో కూర్చుని ఇండికాలోని లోపాలను, మార్కెట్ వ్యూహాలను మరోసారి పరిశీలించుకున్నారు. పట్టుదలతో శ్రమించి ఇండికాను లోపాలను సవరించి మరింత ఆకర్షీయంగా మార్చారు. అంతే దేశీ రోడ్లపై ఇండికా తిరుగులేని విజయం సాధించింది. ఇప్పటికీ ఇండికాకు ఆదరణ తగ్గలేదు. ఫోర్డ్‌ను ఆదుకున్న టాటా ఇండికా డీల్ ఘటన జరిగిన పదేళ్లకు 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఫోర్డ్ కంపెనీ పునాదులు కదిలిపోయాయి. బ్యాంకులకు రుణాలు చెల్లించలేక దివాలా అంచులకు చేరింది. ఈ కష్టాల నుంచి గట్టెక్కెందు ఫోర్డ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రాండ్లను అమ్మకానికి పెట్టింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జాగ్వార్, ల్యాండ్‌రోవర్ (జేఎలర్ఆర్)లను కొనుగోలు చేసి ఫోర్డ్ కంపెనీ దివాలా తీయకుండా ఒడ్డున పడేశారు రతన్ టాటా. అలా భారతీయులను అవమానించిన అమెరికన్ ఫోర్డ్‌పై స్వీట్ రివేంజ్ తీర్చుకున్నారు. #OnthisDay:-2008 Tata Motors completed the deal to acquire two luxury car brands Jaguar and Land Rover. “The best revenge is massive success.” ~ Frank Sinatra. The revenge story Of #Tata, especially #RatanTata Ji over Ford is truly the story of massive success too. @RNTata2000 pic.twitter.com/YCKW6EMR6E — Vedant Birla (@birla_vedant) June 2, 2022 గ్లోబల్ కంపెనీగా ఇండికా ఇచ్చిన స్ఫూర్తితో టాటా మోటార్స్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది. బ్రెజిల్‌కి చెందిన మార్క్పోలోతో కలిసి బస్సులు, సౌత్ కొరియాకు చెందిన దేవూతో కలిసి ట్రక్కులు, జపాన్‌కి చెందిన హిటాచితో కలిసి హెవీ మెషినరీ, ఏయిరో స్పేస్, డిఫెన్స్ సెక్టార్లలో ప్రస్తుతం టాటా దూసుకుపోతుంది. చదవండి: Ratan Tata Love Story: ఆ యుద్ధం.. వీళ్ల ప్రేమకు శాపంగా మారింది -
ఆగని కలప దందా
లక్సెట్టిపేట(మంచిర్యాల): ముందస్తు సమాచారం మేరకు ఆదివారం రాత్రి జన్నారం నుంచి మంచిర్యాల వైపునకు వెళ్తున్న ఇండికా కారును అంబేద్కర్ చౌరాస్తా వద్ద ఆపి అటవీ శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో పది టేకు దుంగలు, సుమారు పద్నాలుగు వేల విలువైనవి అధికారుల తనిఖీల్లో లభ్యమయ్యాయి. సోమవారం ఉదయం టాటా వెంచర్ వాహనంలో 31 టేకు దుంగలతో కలపను తరలిస్తుండగా ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకుని కలపను స్వాధీనం చేసుకున్నారు. కలప విలువ సుమారు రూ. లక్ష ఉంటుంది. వాహనాల డ్రైవర్లు పారిపోగా అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో అటవీ క్షేత్రాధికారి అనిత, ఫారెస్టు డీటీ అజహర్, బీట్ అఫీసర్లు కలీం, ముజ్జు పాల్గొన్నారు. తిర్యాణి మండలంలో.. తిర్యాణి(ఆసిఫాబాద్): తిర్యాణి మండలం గడలపల్లి, బోరింగ్గూడ, గోయగాం గ్రామాల నుంచి అక్రమంగా టేకు దుంగలు తరలిస్తున్న ఆశోక్ లేలాండ్ ట్రక్, ప్యాసింజర్ ఆటో, మోటార్‌బైక్‌ను పట్టుకుని అటవీ అధికారులు తిర్యాణి అటవీరేంజ్ కార్యాలయానికి తరలించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ రేంజర్ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా అక్రమంగా టేకు దుంగలు తరలిస్తున్న మూడు వాహనాలు తమకు తారసపడగా వాటిని తనిఖీ చేయగా ఆటో, ట్రక్‌లలో టేకుదుంగలు కనిపించాయి. బైక్‌పై తీసుకెళ్తున్న రెండు దుంగలను సైతం పట్టుకున్నారు. కాగా ఈ వాహనాల్లో తరలిస్తున్న 30 టేకుదుంగల విలువ రూ. 1.35 లక్షలు ఉంటుంది. కలప తరలించే వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు çఫ్లయింగ్ స్క్వాడ్ రేంజర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో అటవీ అధికారులు శంకర్, మహే«శ్, అనంతరావు ఉన్నారు. కోటపల్లి మండలంలో.. కోటపల్లి(చెన్నూర్): కోటపల్లి మండలం అర్జునగుట్ట నుంచి చెన్నూర్‌కు అక్రమంగా జీపులో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 2 కలప దుంగలను, జీపును ఎఫ్అర్వో రవి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పట్టుకున్న కలపను కోటపల్లి రేంజ్ ఆఫీసుకు తరలించారు. కలప విలువ రూ.15వేలు ఉంటుంది. ఇందులో ఎఫ్‌ఎస్‌వోలు రాములు, శ్రీనివాస్, ఎఫ్‌బీవో నాగరాజ్చారి, బేస్‌క్యాంప్ సిబ్బంది వెంకటేశ్, శ్రీనివాస్ ఉన్నారు. ఛేజింగ్.. ఛేజింగ్ నిర్మల్అర్బన్: అక్రమంగా కలపను తరలిస్తున్న వాహనాన్ని నిర్మల్ అటవీశాఖ అధికారులు సోమవారం వేకువజామున పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో నిర్మల్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వాహనాన్ని ఆపేలోపే డ్రైవర్ ఆ వాహనాన్ని వెనక్కి తింపి ఆదిలాబాద్ వైపు తీసుకెళ్లాడు. దీంతో సిబ్బంది వాహనాన్ని వెంబడించారు. అయితే వాహనం అధికారుల కళ్లుగప్పి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో సోన్ మండలంలోని గంజాల్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై అధికారులు గస్తీ ఏర్పాటు చేశారు. కొన్ని గంటల తర్వాత నల్ల రంగు పాలిథిన్ కవర్ పైకప్పుగా ఉన్న వాహనం అటువైపుగా వచ్చింది. అధికారులను గమనించి ఆపారు. ఆగకుండా వేగంగా ముందుకు వెళ్లిపోవడంతో అధికారులు వెంబడించారు. అటవీ శాఖ అధికారులను గమనించిన దుండగులు గంజాల్లోని ఓ వీధిలో వాహనాన్ని వదిలేసి, కారులో పారిపోయారు. నిలిపి ఉంచిన బులేరో వాహనాన్ని పరిశీలించగా, వాహనంలో 23 టేకు దుంగలు లభించాయి. వీటి విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని తెలిపారు. కలపను పట్టుకున్న అధికారులను జిల్లా అటవీశాఖ అధికారి దామోదర్‌రెడ్డి అభినందించారు. -
ఎస్పీ ఆఫీసు ఎదుటే కారు బీభత్సం
సాక్షి, కాకినాడ: పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ ఇండికా కారు హల్ చల్ చేసింది. సాక్షాత్తూ ఎస్పీ కార్యాలయం ఎదుట పోలీసులను ఢీకొడుతూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కారును నడపటం కలకలం రేపింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రాఫీక్ పోలీసులు తాజాగా విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం 4:45 గంటల ప్రాంతంలో ఎస్పీ ఆఫీసు ఎదుట పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వారి వద్ద నుంచి తప్పించుకునే యత్నంలో ఇండికా కారు డ్రైవర్ పోలీసుల పైనుంచి దూసుకుపోయింది. కారు ఆపడం లేదని గ్రహించిన ఓ పోలీసు బారికేడ్ అడ్డు పెట్టినా అతడిని ఢీకొడుతూ డ్రైవర్ ఆ కారును నడిపాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కి గాయాలు అయ్యాయి. బానుగుడి వైపు వెళ్తున్న కారును ట్రేస్ చేసిన పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు బైకర్స్ కారును ట్రేస్ చేసేందుకు పోలీసులకు లిఫ్ట్ ఇవ్వడం వీడియోలో కనిపిస్తుంది. -
పోలీసులు తనిఖీలలో కారుతో హల్ చల్
-
ఇండికా కారులో మహిళ మృతదేహం
-
ఇండికా కారులో మహిళ మృతదేహం
హైదరాబాద్ : బేగంపేట పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ప్రకాశ్‌నగర్‌లో నిలిపి ఉంచిన ఓఇండికా కారు నుంచి దుర్గంధం వెలువడటంలో స్థానికులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ప్రకాశ్‌నగర్ చేరుకుని మహిళ మృతదేహంతోపాటు కారును స్వాధీనం చేసుకుని... పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం మృతదేహాన్ని కారు నుంచి బయటకు తీశారు. మహిళ మృతదేహం గుర్తు పట్టలేకుండా ఉంది. దీంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొంత కాలంగా కారు అక్కడే ఉంటుందని స్థానికులు పోలీసులు తెలిపారు. ఎంత కాలం నుంచి ఆ కారు అక్కడే ఉంటుందన్నది మాత్రం స్థానికులు చెప్పలేకపోతున్నారు. కాగా కారు నెంబర్... వివరాలు లేకపోవడంతో పోలీసులు కారు యాజమాని ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతురాలు యాచకురాలని పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తెలిసింది. ఆమె సదరు కారులో నివాసం ఏర్పరుచుకుందా ? లేక దుండగులు ఆమెను హత్య చేసి ఈ కారులో పడేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ అసలు విషయం తెలియదని పోలీసులు వెల్లడించారు. -
అత్తాపూర్ బ్రిడ్జిపై కారు దగ్ధం
రంగారెడ్డి(రాజేంద్రనగర్): రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ బ్రిడ్జిపై టీఎస్08 యూఏ 1865 నంబర్ గల ఇండికా కారు ప్రమాదవశాత్తూ మంటల్లో చిక్కుకుంది. మంటలు వెనువెంటనే కారును చుట్టుముట్టేశాయి. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ వెంటనే అప్రమత్తవటంతో ప్రమాదం తప్పింది. ఫైరింజన్ వచ్చేలోపే కారు పూర్తిగా బూడిదయిపోయింది. ఇండికా కారు, ముందు వెళ్తున్న ఇన్నోవా కారును ఢీకొట్టడంతో షార్ట్ సర్క్యూట్‌కు గురైంది. -
ఇండికా కారులో బయటపడ్డ టేకు కర్రలు
సుల్తానాబాద్ : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో జరిగిన ఓ చిన్న రోడ్డు ప్రమాదంతో కారులో అక్రమంగా తరలిస్తున్న టేకు కర్రలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఆదివారం ఉదయం ఓ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే లారీ వెళ్లిపోగా కారు అక్కడే నిలిచిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ కారు వద్దకు చేరుకుని తనిఖీ చేయగా అందులో రూ.40 వేలు నుంచి రూ.50 వేల విలువ చేసే టేకు కర్రలు తరలిస్తున్నట్టు వెలుగు చూసింది. దీంతో కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ఆ కారును స్టేషన్‌కు తరలించారు. -
కారులో గుర్తు తెలియని మృతదేహం
వైఎస్సార్ జిల్లా: కడప నగరం మద్రాస్ రోడ్డులోని చిన్నచౌక్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న కారులో ఒక మృతదేహం ఉండటంతో స్థానికులు కలవరపడ్డారు. శుక్రవారం ఉదయం నుంచి కారు అక్కడే ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కర్ణాటక రాష్ట్రం రిజిస్ట్రేషన్ కెఎ 37ఎం-4758 నంబరుతో ఉన్న ఇండికా కారులో ఓ వ్యక్తి సీటులోనే చనిపోయి ఉన్నాడు. అతడు గీతల షర్టు ధరించి ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివారలు తెలియాల్సి ఉంది. -
దైవ దర్శనానికి వచ్చి.. అనంతలోకాలకు
మనూరు: పూజలు చేసేందుకు వచ్చిన కర్ణాటక ప్రాంత వాసులు రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారారు. మనూరు మండలం రాయిపల్లి మంజీర వంతెన సమీపంలో రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన దేవేంద్రప్ప(38), కాశీనాథ్(35), రాంచంద్ర(36), కట్టమని సోమ్‌నాథ్ (30) ఇండికా కారులో అల్లాదుర్గంలోని ఎల్లమ్మ ఆలయానికి వచ్చారు. ఇండికా కారును డ్రైవర్ సతీష్ (28) నడుపుతున్నాడు. అల్లాదుర్గంలోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి తిరుగు ప్రయాణంలో రాయిపల్లి వంతెన సమీపంలోకి రాగానే జహీరాబాద్ నుండి రాయిపల్లివైపునకు వస్తున్న లారీ(ఏపీ29వీ 0215) ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ సతీష్, దేవేంద్రప్పలు అక్కడికక్కడే మృతి చెందారు. కాశీనాథ్, రాంచంద్ర, సోమ్‌నాథ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి మనూరు ఎస్ఐ ఏడుకొండలు, సిబ్బంది చేరుకొని బాధితులను నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా సంఘటన జరిగిన అనంతరమే స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 వాహనం ఆలస్యంగా రావడంపై రాయిపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. -
రూ.3.52 లక్షలు స్వాధీనం
దెందులూరు, న్యూస్‌లైన్ : జాతీయ రహదారిపై కొవ్వలి వంతెన వద్ద బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రత్యేకాధికారి, దెందులూరు పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.3.52 లక్షలు పట్టుకున్నారు. భద్రాచలం నుంచి కొణితివాడ వెళ్తున్న ఇండికా కారును తనిఖీ చేయగా నగదుకు సంబంధించి యజమాని సుబ్బరాజు వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య పాతూరు(తాడేపల్లిగూడెం రూరల్), న్యూస్‌లైన్ : జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నందమూరు గ్రామానికి చెందిన గుండు వెంకన్న(37)కు తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన మహిళతో 2006లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకన్న మంగళవారం అత్తవారింటికి వ చ్చాడు. తెల్లవారు జామున అతను ఉరి వేసుకుని ఉండటాన్ని బంధువులు గమనించారు. పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ పోలీస్ స్టేషన్ హెచ్‌సీ ముత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.