రూ.3.52 లక్షలు స్వాధీనం | RS. 3.52 lacks caught by police | Sakshi
Sakshi News home page

రూ.3.52 లక్షలు స్వాధీనం

Published Thu, Mar 20 2014 5:45 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

RS. 3.52 lacks caught by police

దెందులూరు, న్యూస్‌లైన్ : జాతీయ రహదారిపై కొవ్వలి వంతెన వద్ద బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రత్యేకాధికారి, దెందులూరు

పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.3.52 లక్షలు పట్టుకున్నారు. భద్రాచలం నుంచి కొణితివాడ వెళ్తున్న ఇండికా కారును తనిఖీ చేయగా నగదుకు సంబంధించి యజమాని సుబ్బరాజు వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
 
 వ్యక్తి ఆత్మహత్య
 పాతూరు(తాడేపల్లిగూడెం రూరల్), న్యూస్‌లైన్ : జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నందమూరు గ్రామానికి చెందిన గుండు వెంకన్న(37)కు తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన మహిళతో 2006లో వివాహం జరిగింది.
 
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకన్న మంగళవారం అత్తవారింటికి వ చ్చాడు. తెల్లవారు జామున అతను ఉరి వేసుకుని ఉండటాన్ని బంధువులు గమనించారు. పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ పోలీస్ స్టేషన్ హెచ్‌సీ ముత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement