రోడ్డుపై పడిఉన్న మృతదేహం
ఖాజీపేట : ఖాజీపేట మండలం అగ్రహారం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి పోరుమామిళ్లకు చెందిన షేక్ సర్దార్ (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులకు సమాచారం రావడంతో అక్కడకు చేరుని పరిశీలించారు. జరిగిన సంఘటన రోడ్డు ప్రమాదమా లేక హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారా అన్న అనుమానాలు పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. వివరాల్లోకి వెళితే
షేక్.సర్దార్ ది ప్రకాశం జిల్లా కొమరోలు. ఇతను పోరుమామిళ్లకు చెందిన షేక్ మహబూబ్‌నిషాను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహమైన ఏడాది తర్వాత నుంచి పోరుమామిళ్లలో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. 16వతేదీ రాత్రి అగ్రహారం సమీపంలోని జాతీయ రహదారిపై మృతదేహం ఉందని తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌ఐ హాజీవలి పరిశీలించారు. అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు. అతని జేబులోని డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతని పేరు సర్దార్‌గా నిర్ధారించారు. స్వగ్రామం కొమరోలుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
అయితే అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 16వ తేదీ ఉదయం సర్దార్ కారు తీసుకుని వస్తానని చెప్పి కడపకు వెళ్లాడు. కడపకు చేరున్న తరువాత ఫోన్ చేశాడు. తిరిగా సాయంత్రం బయలు దేరుతానని చెప్పాడు. అయితే అర్థరాత్రి భర్త చనిపోయినట్లు సమాచారం రావడంతో ఇక్కడకి వచ్చామని చెబుతోంది.
మృతిపై అనేక అనుమానాలు
సర్దార్ మృతి పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోరుమామిళ్లకు చెందిన వ్యక్తి ఖాజీపేట జాతీయ రహదారిపై ఎలా మృతి చెందాడన్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోరుమామిళ్లకు వెళ్లాల్సిన వ్యక్తి ఇక్కడికి ఎలా వచ్చాడు. కారును తీసుకు వస్తానని భార్యతో చెప్పిన వాడు కారులో రావాలి.. లేదా ఇంటికి వెళ్లాలంటే ఏదైనా వాహనంలో కానీ బస్సులో కానీ వెళ్లాలి. కానీ వాహనంలో వచ్చినట్లు కనిపించడంలేదు.. అతను ఖాజీపేట జాతీయ రహదారిపై ఎందుకు ఉన్నాడు.. ప్రమాదం జరిగిన సమయంలో శరీరంపై చొక్కాలేదు. చెప్పులు దూరంగా పడి ఉన్నాయి. మృతుడి తలపై నుంచి వాహనం వెళ్లడంతో తల పూర్తిగా ఛిద్రమైంది. ఎవ్వరైనా అతనిపై దాడిచేసి ఇక్కడ పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment