దేశానికి పట్టిన శని.. కాంగ్రెస్‌ | Congress Party Are Failure In Telangana | Sakshi
Sakshi News home page

దేశానికి పట్టిన శని.. కాంగ్రెస్‌

Published Sat, Jun 23 2018 12:21 PM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

Congress Party Are Failure  In Telangana - Sakshi

 కోదాడ జాతీయ రహదారి పనులను   పరిశీలిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి

సాక్షి, జడ్చర్ల : దేశంతో పాటు రాష్ట్రానికి పట్టిన శని అని... ఆ పార్టీ తరిమికొట్టడం ద్వారా తమిళనాడు, కేరళ, తదితర రాష్ట్రాలు బాగుపడిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కూడా అదే తరహాలో ముందుకు సాగి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా నిలవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. జడ్చర్ల మండలంలోని పల్గుగడ్డ తండాలో శుక్రవారం ఆయన టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అరవై ఏళ్ల పాటు కాంగ్రెస్, టీడీపీలు రాష్టాన్ని పాలించగా ప్రజలు దగా పడ్డారని.. కేవలం నాలుగేళ్ల కాలంలో తాము అనేక అభివృద్ధి కార్యఖ్రమాలు చేపట్టామని తెలిపారు. ఇక్కడ చేపడుతున్న పథకాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని పేర్కొన్నారు. నాటి శ్రీరాముడి పాలన మాదిరిగా రాష్ట్రంలో పాలన సాగుతోందని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, వైస్‌ ఎంపీపీ రాములు, ఎంపీటీసీ సభ్యురాలు మణెమ్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోడ్గల్‌ యాదయ్య, కోఆప్షన్‌ సభ్యుడు ఇమ్ము, మార్కెట్‌ డైరెక్టర్‌ గోవర్దన్‌రెడ్డితో పాటు కొంగళి జంగయ్య, తావుర్యానాయక్, శ్రీకాంత్, ప్రణీల్‌ పాల్గొన్నారు. 


జాతీయ రహదారి పనుల్లో నాణ్యత పాటించాలి 
జడ్చర్ల–కోదాడ జాతీయరహదారి విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి ఆదేశించారు. జడ్చర్ల – మిడ్జిల్‌ మద్యలో జరుగుతున్న పనులను శనివారం ఆయన పరిశీలించి పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై కాంట్రాక్టర్, ఉద్యోగులతో చర్చించారు. రాకపోకలకు అంతరాయం కలుగకుండా, ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా పనులు చేపడుతూ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రహదారి విస్తరణ పనులు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఆయన వెంట మిడ్జిల్‌ జెడ్పీటీసీ సభ్యురాలు హైమావతి, తదితరులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement