Vehicle Checks
-
‘కూటమి’పై కక్ష.. పోలీసుల వివక్ష
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీ ల నేతల లక్ష్యంగా వాహనాల తనిఖీలు జరుపుతూ వేధింపులకు గురిచేస్తున్నారని మహకూటమి ఆరో పించింది. నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత వాతావరణం లో ఎన్నికలు జరగడం లేదని, కొందరు పోలీసు లు అధికార టీఆర్ఎస్కు కొమ్ముకాస్తున్నారని పేర్కొంది. మహాకూటమి తరఫున టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్ ఉపాధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్ బృందం గురువారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. మహాకూటమి నేతల పట్ల కొందరు పోలీసులు కక్షపూరిత, పక్షపాత వైఖరిపై నిర్దిష్ట ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో ఎల్.రమణ ప్రయాణిస్తున్న వాహనాన్ని టాస్క్‌ఫోర్స్ డీసీపీ, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ బంధువు రాధాకృష్ణారావు తనిఖీ చేసి అవమానించారన్నారు. రమణ అనుచరులను పోలీసులు పట్టుకెళ్లి హింసించారని ఆరోపించారు. చివరికి టీజేఎస్ అధినేత ఎం.కోదండరాం వాహనాన్ని సైతం పోలీసులు ఆపి సోదాలు జరిపారని, టీజేఎస్ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో ఇంటెలిజెన్స్ సిబ్బందిని మోహరించారని తెలిపారు. పోరాడినందుకే నాపై కుట్రలు..: రమణ మహాకూటమి ఏర్పాటును జీర్ణించుకోలేక ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ గత పది రోజులుగా తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎల్.రమణ ఆరోపించారు. వస్త్ర వ్యాపారులు, హవాలా, హుండీ వ్యాపారుల నుంచి జప్తు చేసిన డబ్బును తన పేరు అంటగట్టి వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. 42 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఒక్క కేసు లేదన్నారు. రైతు ఆత్మహత్యలు, నేరళ్లలో దళితులపై దాడులు, మియాపూర్ భూ కుంభకోణానికి వ్యతిరేకంగా పోరాడినందుకే కేసీఆర్ తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ ఎస్.శ్రీనివాస్ తన అనుచరులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదు చేశామన్నారు. కేసీఆర్ శంకరగిరి మాన్యాలకు వెళ్లే సమయం వచ్చిందన్నారు. ఆయన్ను గద్దె దింపే వరకు పోరాడుతామని చెప్పారు. ఇప్పటికే కేసీఆర్ తన పార్టీ అభ్యర్థులకు రూ.1000 కోట్లు పంపించారని, పెద్ద మొత్తంలో డబ్బుల పంపిణీ జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ కనుసన్నల్లో పోలీసులు: చాడ పోలీసు అధికారులు సీఎం కేసీఆర్ కనుసన్నల్లో పని చేస్తున్నారని చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు విపక్షాలను టార్గెట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు మహాకూటమిని టార్గెట్ చేశారన్నారు. పోలీసులు కేసీఆర్‌కు తాబేదారులుగా వ్యవహరిస్తున్నారని, కోదండరాం లాంటి వ్యక్తులపై నిఘా పెట్టడం దుర్మా ర్గమని కపిలవాయి దిలీప్‌కుమార్ మండిపడ్డారు. ‘ఇంటెలిజెన్స్’తో ఫోన్ ట్యాపింగ్.. రాజకీయ అవసరాలకు ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో విపక్ష పార్టీల నేతల ఫోన్ల ట్యాపింగ్ చేయిస్తూ ప్రభుత్వం తమ ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు భంగం కలిగిస్తోందని ఉత్తమ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారో తెలపాలని హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ డీఐజీల నుంచి వివరాలు కోరుతామని సీఈఓ హామీ ఇచ్చారని తెలిపారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసీఆర్ సొంత పత్రిక, న్యూస్ చానల్ ద్వారా విపక్ష పార్టీల నేతలపై చేస్తున్న దుష్ప్రచారంపై కూడా ఫిర్యాదు చేశామన్నారు. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల మీద సీఎం కేసీఆర్ బొమ్మలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రచార ప్రకటనలను తొలగిస్తామని సీఈఓ హామీనిచ్చినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సీఎం నివాసం ప్రగతిభవన్, మంత్రుల నివాసాలను పార్టీ సమావేశాలకు వినియోగిస్తున్నారని సీఈఓ దృష్టికి తీసుకెళ్లామని ఉత్తమ్ చెప్పారు. -
యాదాద్రిలో వాహన తనిఖీలు
నల్లగొండ జిల్లా యాదాద్రిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదులు పట్టుబడ్డ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సాయంత్రం ప్రధాన రహదారిలో వాహనాలను సోదా చే శారు. అనుమానితులను ప్రశ్నించి, వారి వద్ద పత్రాలను పరిశీలించారు. ఈ సోదాలు ట్రాఫిక్ ఏఎస్ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. -
నిషేధిత క్యాట్‌ఫిష్ స్వాధీనం
కైకలూరు(కృష్ణా): అక్రమంగా తరలిస్తున్న క్యాట్‌ఫిష్‌ను కృష్ణా జిల్లా కైకలూరు పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని లక్ష్మీపురం వద్ద శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టిన అటవీ అధికారులు వ్యాన్‌లో తరలిస్తున్న 8 క్వింటాళ్ల క్యాట్‌ఫిషను గుర్తించి, వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ రూ.80 లక్షలు ఉంటుందని తెలిపారు. సీజ్ చేసిన క్యాట్‌ఫిషను గుంత తీసి పూడ్చి పెడతామన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే చేపల్లో ఒక రకమైన క్యాట్ ఫిష్ వాడకాన్ని, పెంపకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. -
గుజరాతి గల్లీలో రూ. 20 లక్షలు స్వాధీనం
సుల్తాన్‌బజార్: ఎన్నికల నేపథ్యంలో సుల్తాన్‌బజార్ పోలీసులు సోమవారం రాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షలు పట్టుబడ్డాయి. కోఠి గుజరాతి గల్లీలో భరత్, జాకబ్ అనే ఇద్దరు వాహనంలో ఈ డబ్బు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు.. ఈ డబ్బును ఎక్కడికి, ఎందుకు తరలిస్తున్నారనేది తెలుసుకొనే పనిలో పడ్డారు. 183 మద్యం బాటిళ్లు... గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ట్రూప్‌బజార్‌లోని సిటీ వైన్స్‌లో సోమవారం మద్యం విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వివిధ కంపెనీలకు చెందిన 183 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని వైన్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అలాగే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉమేష్ అనే వ్యక్తి వద్ద రూ. 15 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ.2.5 లక్షలు పట్టివేత... మలేషియాటౌన్షిప్: అనుమానాస్పదంగా కారులో ఉన్న రూ. 2.5 లక్షలను కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీకాంత్‌గౌడ్ కథనం ప్రకారం... హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ వద్ద ఇన్నోవా కారులో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని పోలీసులకు సమాచారం అందింది. వారు వెళ్లి కారును సోదా చేయగా అందులో రూ. 2.5 లక్షలు నగదు కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు, డబ్బు ఎవరిదనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామ ని, నిందితులను గుర్తించి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. కాగా, కారులో ఉన్న నగదు టీఆర్ఎస్ పార్టీ వారిదేనని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేయగా..., తమ కారు అద్దం పగులగొట్టి కారులో డబ్బు పెట్టి టీడీపీ వారు తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని టీఆర్ఎస్ వారు పరస్పరం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
వాహన తనిఖీల్లో రూ.6 లక్షలు స్వాధీనం
చైతన్యపురి: వాహనాల తనిఖీలలో చైతన్యపురి పోలీసులు రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ కోటయ్య తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం అష్టలక్ష్మీ దేవాలయం రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో వచ్చిన వాసవికాలనీకి చెందిన వ్యాపారి పాపిశెట్టి వెంకటేశ్వరరావును ఆపి సోదా చేశారు. కారులో రూ.6 లక్షలు నగదు ఉండడంతో డబ్బుకు సంబంధించిన వివరాలను అడిగారు. ఆయన ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు, ఐటీ అధికారులకు సమాచారం అందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు కావడంతో తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్ఐ కోటయ్య తేలిపారు. -
రూటు మారని చెక్‌పోస్టులు
సరిహద్దు చెక్‌పోస్టులతో వాణిజ్య పన్నుల శాఖ యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతోంది. ఒకే మార్గంలో ఒక బోర్డర్ చెక్‌పోస్టు దాటిన తరువాత జిల్లా మధ్యలో మరో బోర్డర్ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ అనధికార చెక్‌పోస్టుకు అధికారులు టార్గెట్లు విధించడం వింతగా ఉందని ఆ శాఖ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. విజయవాడ(వన్‌టౌన్) : రాష్ట్రం విడిపోయిన తరువాత కృష్ణా, ఖమ్మం జిల్లాలు రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. కృష్ణాజిల్లాలో తిరువూరు వద్ద వాణిజ్య పన్నుల శాఖ అధికారికంగా ఒక చెక్‌పోస్ట్‌ను నిర్వహిస్తుంది. తెలంగాణా ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోకి వచ్చే వాహనాలను అక్కడ తనిఖీలు నిర్వహిస్తారు. ఇదే రూట్లో కొండపల్లి బాలకృష్ణా సినిమా హాలు వద్ద వాణిజ్య పన్నుల శాఖ మరో సరిహద్దు చెక్‌పోస్ట్ పేరుతో తనిఖీలు చేయడం విమర్శలకు దారితీస్తోంది. తిరువూరులో బోర్డర్ చెక్‌పోస్ట్‌లో తనిఖీ చేసిన వాహనాలు అదే దారిలో ఇబ్రహీంపట్నంకు వచ్చే క్రమంలో కొండపల్లి వద్ద వారికి ఈ బోర్డర్ చెక్‌పోస్టు కనిపిస్తోంది. జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారికంగా నిర్వహిస్తోంది. ఒకే రహదారిలో రెండు బోర్డర్ చెక్‌పోస్టులు ఏ విధంగా పెడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన మూడు మాసాలకు అధికారులు రెవెన్యూ శాఖ వద్ద స్థలం తీసుకుని చెక్‌పోస్టు ఏర్పాటు చేయడంతోపాటు ఏసీటీవో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అటెండర్ విధులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి లక్షల వ్యయం అవుతున్నా ఆశించినంత ఆదాయం మాత్రం రావడం లేదని సమాచారం. అయితే ఈ చెక్‌పోస్టు వివరాలు వాణిజ్య పన్నుల శాఖ వెబ్సైట్లోనూ లేకపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. నిరుపయోగంగా చెక్‌పోస్టు తెలంగాణ రాష్ట్రంలోంచి వచ్చే వాహనాలు కొండపల్లి చెక్‌పోస్టుకు రాకుండానే రాష్ట్రంలోకి వెళ్లి పోవచ్చని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. తిరువూరు నుంచి నూజివీడు మీదుగా హనుమాన్జంక్షన్కు వెళ్లిపోవచ్చు. కొండపల్లిలోకి ప్రవేశించిన తరువాత కూడా మరోమార్గంలో విజయవాడ జాతీయ రహదారి మీదకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ చెక్‌పోస్టు వల్ల ఉపయోగం లేదంటున్నారు. తొలగించమని ప్రభుత్వానికి లేఖ రాశాం రాష్ట్ర విభజనతో గూగుల్ మ్యాప్ సహాయంతో కొండపల్లి చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఖమ్మం నుంచి కొన్ని వాహనాలు తిరువూరు మీదుగా కొండపల్లి రావచ్చని భావించి దీనిని ఏర్పాటు చేశారు. అయితే సరుకు రవాణా చేసే భారీ వాహనాలన్నీ తిరువూరు చెక్‌పోస్టు మీదు గా తప్ప ఇతర మార్గాల్లో రావడం సాధ్యపడదు. దీంతో ఈ చెక్‌పోస్టు పెద్దగా ఉపయోగపడటం లేదు. ప్రభుత్వం చెక్‌పోస్టు కేటాయిం చినందున సిబ్బందిని కేటాయించి తనిఖీలు చేయిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తొలగిస్తాం. - కిరణ్, అసిస్టెంట్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ -
మెదక్ జిల్లాలో పోలీసుల వాహన తనిఖీలు
సంగారెడ్డి రూరల్(మెదక్): మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఏకకాలంలో ఆదివారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వాహనాల చట్టంతోపాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద 86 కేసులు నమోదు చేసి, రూ.20,400 చలాన్ విధించారు. జిల్లా ఎస్పీ సుమతి ఆదేశాల మేరకు సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో కంది శివారులోని జాతీయ రహదారిపై 132 వాహనాలను తనిఖీ చేసి, ఎంవీ యాక్ట్ ప్రకారం 25, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 5 కేసులు నమోదు చేసి రూ.5,800 చలాన్ విధించారు. ఆర్సీ పురం డీఎస్పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 375 వాహనాలను తనిఖీ చేసి, 33 కేసులు నమోదు చేసి రూ.10,800 చలాన్ విధించారు. సిద్దిపేట డివిజన్‌పరిధిలో 219 వాహనాలను, తూప్రాన్ డివిజన్‌పరిధిలో 315 వాహనాలు తనిఖీ చేశారు. మెదక్ డివిజన్ పరిధిలో 138 వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో 19 ఎంవీయాక్ట్ కేసులు, 4 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి, రూ.3,800 చలాన్ విధించినట్లు ఎస్పీ వివరించారు. -
సరిహద్దులో తనిఖీలు చేయండి
బంట్వారం: కర్ణాటక సరిహద్దులోని తొర్మామిడి శివారులో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేయాలని జిల్లా ఎస్పీ రాజకుమారి పోలీసులకు సూచించారు. శుక్రవారం ఆమె బంట్వారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పెండింగ్ రికార్డులను, ఫైళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారి విలేకరులతో మాట్లాడారు. వార్షిక తనిఖీల్లో భాగంగానే పీఎస్‌ను సందర్శించినట్లు తెలిపారు. బంట్వారం ఠాణా పరిధిలో 2012లో 86 కేసులు నమోదవగా 7 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గతేడాది 109 కేసులకు గాను 11 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈఏడాది ఇప్పటివరకు 92 కేసులు నమోదవగా 32 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఎస్పీ వివరించారు. 22 కేసులు లోక్‌అదాలత్‌లో పరిష్కారమయ్యాయని తెలిపారు. తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో ఉన్న తొర్మామిడి శివారులో మఫ్టీలో నిత్యం వాహనాల తనిఖీలు చేయాలని ఎస్పీ ఈసందర్భంగా మోమిన్‌పేట సీఐ రంగాను ఆదేశించారు. వాహనాల తనిఖీలతో చోరీలను నివారించవచ్చని చెప్పారు. గతేడాదితో పోలిస్తే బంట్వారం పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాలు, ఆత్మహత్యలు, రోడ్డుప్రమాదాలు తగ్గిపోయాయని ఆమె వివరించారు. రాంపూర్, తొర్మామిడి, మోత్కుపల్లి, బార్వాద్ తదితర గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీకి సంబంధించి 4 కేసులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయని తెలిపారు. ఓ గ్యాంగ్ ట్రాన్స్ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్నట్లు తాము గుర్తించామని ఎస్పీ రాజకుమారి చెప్పారు. సదరు గ్యాంగ్ ఆట కట్టించేందుకు ఓ పోలీస్ బృందం దర్యాప్తు చేస్తోందన్నారు. సిబ్బంది కొరతతో కొంత ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్‌లో మంచి నీటి సమస్య ఉన్నట్లు గుర్తించామని ఆమె అన్నారు. బోరు వేయడానికి కావల్సిన బడ్జెట్ కోసం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపించనున్నట్లు ఎస్పీ వివరించారు. స్థానిక సిబ్బంది పనితీరుపై బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందు ఎస్పీ రాజకుమారి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో డీఎస్పీ స్వామి, సీఐ రంగా, స్థానిక ఎస్ఐ రవీందర్ సిబ్బంది ఉన్నారు. -
తనిఖీల్లో రూ. 20.5లక్షలు పట్టివేత
వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం మొయినాబాద్, న్యూస్‌లైన్: జిల్లా పరిధిలో శనివారం వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు రూ. 20.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రెడ్డిపల్లి వద్ద శనివారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు. నగరం నుంచి శంకర్పల్లి మండల పరిధిలోని ప్రగతి రిసార్ట్స్‌కు వెళ్తున్న ఓ కారులో రూ.15.20 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న వ్యక్తిని ప్రగతి రిసార్ట్స్‌లో పనిచేసే శివగా గుర్తించారు. అతడు నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్లు సీఐ రవిచంద్ర వెల్లడించారు. అదే విధంగా మండల పరిధిలోని హిమాయత్‌నగర్ చౌరస్తాలో మధ్యాహ్నం నిర్వహించిన తనిఖీల్లో చేవెళ్ల పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య సంగీతారెడ్డి కారులోంచి టీఆర్ఎస్ పార్టీ జెండాలు, బ్యానర్లు, తోరణాలు, కండువాలు, గొడుగులు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేసి ఎన్నికల అధికారి, చేవెళ్ల ఆర్డీవో చంద్రశేఖరరావుకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ఉన్నారు. బైకుపై తరలిస్తున్న రూ.3.8 లక్షలు.. ఘట్కేసర్: బైకుపై తరలిస్తున్న రూ.3.8 లక్షల నగదును ఘట్కేసర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వివరాలు.. మండల పరిధిలోని నారపల్లిలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై చెక్‌పోస్టులో శనివారం స్థానిక పోలీసులు తనిఖీలు చేశారు. బైకుపై వెళ్తున్న హరిశ్రీనివాస్ నుంచి రూ.3.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నారపల్లి సమీపంలోని సిద్ధార్థ కాలేజీకి విద్యార్థులు చెల్లించిన ఫీజును నగరంలోని ఆక్సిస్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు హరిశ్రీనివాస్ పోలీసులకు చెప్పాడు. ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు నగదును సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కందుకూరు: కారులో తీసుకెళ్తున్న రూ.1.5 లక్షలను కందుకూరు పోలీసులు సీజ్ చేశారు. వివరాలు.. కందుకూరు పరిధిలోని శ్రీశైలం రహదారిలో అమ్ములు దాబా సమీపంలోని చెక్ పోస్టులో శనివారం సీఐ జానకీరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. మధ్యాహ్న సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ నుంచి వస్తున్న కారు (ఏపీ 22 ఎడీ 1122)లో రూ.1.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఆమన్‌గల్‌కు చెందిన పున్నం రామకృష్ణ తాను బట్టల వ్యాపారినని, దుస్తుల కొనుగోలు కోసం నగరానికి వెళ్తున్నట్లు చెప్పాడు. కాగా నగుదుకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసి స్టాటిస్టిక్ అధికారుల ద్వారా ట్రెజరీకి తరలించినట్లు సీఐ తెలిపారు. -
వేపాడ, పార్వతీపురంలలో.. నగదు పట్టివేత
సోంపురం(వేపాడ) న్యూస్‌లైన్: వేపాడ మండలంలోని సోంపురం జంక్షన్లో వల్లంపూడి పోలీ సులు శుక్రవారం వాహన తనిఖీల్లో భాగంగా రూ.2,97,550 పట్టుబడింది. ఎస్సై బాలాజీరావు, ప్లయింగ్ స్క్వాడ్ చంద్రశేఖర్, ఏఎస్సై దయానందరావు సంఘటనా స్థలానికి చేరుకుని పట్టుబడ్డ నగదుపై విచారణ చేశారు. ఇందుకు సంబంధించి పోలీస్ సిబ్బంది అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్.కోట మం డలం కుద్దువలస నుంచి ఎస్.కోట వైపు కారులో వెళ్తున్న పోతంపేట సర్పంచ్ కొరుపో లు ముత్యాలునాయుడు వద్ద ఎటువంటి అధారాలులేకుండా ఉన్న నగదు రూ.1,02,050 పట్టుబడ్డాయి. తాము కోళ్లఫారం పెట్టామని అందుకు సంబంధించిన సొమ్ముచెల్లించడానికి తీసుకెళ్తున్నట్లు ముత్యాలు నాయుడు చెప్పారు. కొట్యాడ నుంచి ఎల్.కోట వైపు వెళ్తున్న మల్లు శంకర్రావు వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో రూ.1,95,500 స్వాధీనం చేసుకున్నారు. ఎల్.కోట బ్యాం కులో వేయడానికి తీసుకెళ్తున్నట్లు శంకర్రా వు బ్యాంక్ పాసుపుస్తకం చూపిం చారు. అయినా ఆ సొమ్ముకు ఆధారాలు లేకపోవడంతో ఇద్దరి వద్ద పట్టుబడిన సొమ్మును సీజ్ చేశారు. కేసు నమోదుచేసి సొమ్మును వేపాడ తహశీల్దారు పి.అప్పలనాయుడుకు అప్పగించినట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు. పార్వతీపురం చెక్‌పోస్టు వద్ద.. పార్వతీపురం టౌన్: పార్వతీపురంలోని నవిరి కాలనీ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద భారత్ ట్రేడర్స్‌కు సంబంధించిన రూ.1,87,850లు, గణేష్ గుప్త నుంచి 1,91,500లు, జట్టు ఆశ్రమం వద్ద ఒడిశాలోని కెరడ నుంచి పార్వతీపురం వస్తున్న జి.రవి వద్ద రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బి.వెంకటరావు, ఎలక్షన్ డీటీ జి.రామచంద్రరావు తెలిపారు. -
రూ.3.52 లక్షలు స్వాధీనం
దెందులూరు, న్యూస్‌లైన్ : జాతీయ రహదారిపై కొవ్వలి వంతెన వద్ద బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రత్యేకాధికారి, దెందులూరు పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.3.52 లక్షలు పట్టుకున్నారు. భద్రాచలం నుంచి కొణితివాడ వెళ్తున్న ఇండికా కారును తనిఖీ చేయగా నగదుకు సంబంధించి యజమాని సుబ్బరాజు వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య పాతూరు(తాడేపల్లిగూడెం రూరల్), న్యూస్‌లైన్ : జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నందమూరు గ్రామానికి చెందిన గుండు వెంకన్న(37)కు తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన మహిళతో 2006లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకన్న మంగళవారం అత్తవారింటికి వ చ్చాడు. తెల్లవారు జామున అతను ఉరి వేసుకుని ఉండటాన్ని బంధువులు గమనించారు. పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ పోలీస్ స్టేషన్ హెచ్‌సీ ముత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.