సంగారెడ్డి రూరల్(మెదక్): మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఏకకాలంలో ఆదివారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వాహనాల చట్టంతోపాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద 86 కేసులు నమోదు చేసి, రూ.20,400 చలాన్ విధించారు. జిల్లా ఎస్పీ సుమతి ఆదేశాల మేరకు సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో కంది శివారులోని జాతీయ రహదారిపై 132 వాహనాలను తనిఖీ చేసి, ఎంవీ యాక్ట్ ప్రకారం 25, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 5 కేసులు నమోదు చేసి రూ.5,800 చలాన్ విధించారు.
ఆర్‌సీ పురం డీఎస్పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 375 వాహనాలను తనిఖీ చేసి, 33 కేసులు నమోదు చేసి రూ.10,800 చలాన్ విధించారు. సిద్దిపేట డివిజన్‌పరిధిలో 219 వాహనాలను, తూప్రాన్ డివిజన్‌పరిధిలో 315 వాహనాలు తనిఖీ చేశారు. మెదక్ డివిజన్ పరిధిలో 138 వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో 19 ఎంవీయాక్ట్ కేసులు, 4 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి, రూ.3,800 చలాన్ విధించినట్లు ఎస్పీ వివరించారు.
మెదక్ జిల్లాలో పోలీసుల వాహన తనిఖీలు
Published Mon, May 4 2015 12:18 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement