యూపీలో మరో దారుణం.. నగ్నంగా రోడ్డుపై విద్యార్థిని | College Student Found With Severe Burns Along National Highway In UP | Sakshi
Sakshi News home page

దారుణం: కాలిన గాయాలతో నగ్నంగా రోడ్డుపై విద్యార్థిని

Published Wed, Feb 24 2021 4:42 AM | Last Updated on Wed, Feb 24 2021 7:57 AM

College Student Found With Severe Burns Along National Highway In UP - Sakshi

షాజహాన్‌పూర్‌: ఒక విద్యార్థిని దాదాపు 60% కాలిన గాయాలతో, నగ్నంగా రోడ్డు పక్కన పడిపోయి ఉన్న ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానందకు చెందిన ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలో ఆమె బీఏ రెండో సంవత్సరం చదువుతోందని పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థినిని ఆసుపత్రిలో చేర్చామని, ప్రస్తుతం ఆమె ఏ వివరాలు వెల్లడించే స్థితిలో లేదని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతు న్నామని ఎస్పీ ఆనంద్‌ వెల్లడించారు. ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆ విద్యార్థిని దుస్తులు కనిపించలేదన్నారు.  

ముఖం, మెడ, ఛాతి తదితర భాగాల్లో కాలిన గాయాలున్నాయని, మెడ భాగంలో వాపు ఉందని వైద్యులు వెల్లడించారు. తండ్రితో పాటు సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లిన యువతి మళ్లీ తిరిగి రాలేదు. మూడు గంటలకు కాలేజీ సమయం ముగిసిన తరువాత తన కోసం కాలేజ్‌ గేట్‌ వద్ద ఎదురు చూశానని, అయితే, తను రాలేదని ఆమె తండ్రి పోలీసులకు తెలిపారు. సాయంత్రం ఆరు తరువాత లక్నో– బరేలీ జాతీయరహదారి పక్కన పడిపోయి ఉన్న విషయం, పోలీసులు ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందన్నారు. స్వామి చిన్మయా నందకు చెందిన ముముక్షు ఆశ్రమ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి సుఖ్‌దేవానంద పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కాలేజీలో ఆ విద్యార్థిని చదువుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement