severe burns
-
యూపీలో మరో దారుణం.. నగ్నంగా రోడ్డుపై విద్యార్థిని
షాజహాన్పూర్: ఒక విద్యార్థిని దాదాపు 60% కాలిన గాయాలతో, నగ్నంగా రోడ్డు పక్కన పడిపోయి ఉన్న ఘటన ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానందకు చెందిన ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలో ఆమె బీఏ రెండో సంవత్సరం చదువుతోందని పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థినిని ఆసుపత్రిలో చేర్చామని, ప్రస్తుతం ఆమె ఏ వివరాలు వెల్లడించే స్థితిలో లేదని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతు న్నామని ఎస్పీ ఆనంద్ వెల్లడించారు. ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆ విద్యార్థిని దుస్తులు కనిపించలేదన్నారు. ముఖం, మెడ, ఛాతి తదితర భాగాల్లో కాలిన గాయాలున్నాయని, మెడ భాగంలో వాపు ఉందని వైద్యులు వెల్లడించారు. తండ్రితో పాటు సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లిన యువతి మళ్లీ తిరిగి రాలేదు. మూడు గంటలకు కాలేజీ సమయం ముగిసిన తరువాత తన కోసం కాలేజ్ గేట్ వద్ద ఎదురు చూశానని, అయితే, తను రాలేదని ఆమె తండ్రి పోలీసులకు తెలిపారు. సాయంత్రం ఆరు తరువాత లక్నో– బరేలీ జాతీయరహదారి పక్కన పడిపోయి ఉన్న విషయం, పోలీసులు ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందన్నారు. స్వామి చిన్మయా నందకు చెందిన ముముక్షు ఆశ్రమ్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి సుఖ్దేవానంద పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ఆ విద్యార్థిని చదువుతోంది. -
ఐఫోన్-7 చార్జింగ్ పెట్టి పడుకోగా..!
కొత్తగా వచ్చిన యాపిల్ ఐఫోన్-7 ఓ మహిళకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఐఫోన్ కు చార్జింగ్ పెట్టి ఆదమరిచి నిద్రించిన ఆమె తీవ్ర కాలిన గాయాలయ్యాయి. దీంతో పడుకునేటప్పుడు సెల్ ఫోన్ లను దూరంగా పెట్టాలని, ముఖ్యంగా చార్జింగ్ పెట్టి ఎంతమాత్రం వాడటం, పడుకొనేముందు పక్కన పెట్టడం సరికాదని హెచ్చరిస్తూ ఆమె ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. దీంతోపాటు ఐఫోన్ వల్ల తన చేతికి తీవ్రంగా కాలిన గాయాలైన ఫొటోను పోస్టు చేశారు. మెల్ బోర్న్ కు చెందిన మేలెనీ టాన్ పీలెజ్ కు ఈమేరకు చేదు అనుభవం ఎదురైందని సిడ్నీ హెరాల్డ్ పత్రిక తెలిపింది. "ఇటీవల నేను ఐఫోన్-7ను కొన్నాను. అనుకోకుండా ఫోన్ కు చార్జింగ్ పెట్టి దానిని చేతిలో పట్టుకొని నిద్రపోయాను. ఏదో తీవ్ర నొప్పిగా ఉంటే లేచి చూశాను. చెయ్యికి తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో నేను విస్తుపోయాను. ఒక్కక్షణం ఊపిరి ఆగినంత పని అయింది' అని మెలెనీ తన ఫేస్ బుక్ పోస్టులో తెలిపింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఐఫోన్ పట్ల ఇప్పటివరకు తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని, కానీ, తనకు ఇలాంటిది జరగడంతో ఇతరులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశముందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించింది.