సాక్షి, కాకినాడ: పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ ఇండికా కారు హల్ చల్ చేసింది. సాక్షాత్తూ ఎస్పీ కార్యాలయం ఎదుట పోలీసులను ఢీకొడుతూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కారును నడపటం కలకలం రేపింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రాఫీక్ పోలీసులు తాజాగా విడుదల చేశారు.
ఆదివారం సాయంత్రం 4:45 గంటల ప్రాంతంలో ఎస్పీ ఆఫీసు ఎదుట పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వారి వద్ద నుంచి తప్పించుకునే యత్నంలో ఇండికా కారు డ్రైవర్ పోలీసుల పైనుంచి దూసుకుపోయింది. కారు ఆపడం లేదని గ్రహించిన ఓ పోలీసు బారికేడ్ అడ్డు పెట్టినా అతడిని ఢీకొడుతూ డ్రైవర్ ఆ కారును నడిపాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కి గాయాలు అయ్యాయి. బానుగుడి వైపు వెళ్తున్న కారును ట్రేస్ చేసిన పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు బైకర్స్ కారును ట్రేస్ చేసేందుకు పోలీసులకు లిఫ్ట్ ఇవ్వడం వీడియోలో కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment