పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ ఇండికా కారు హల్ చల్ చేసింది. సాక్షాత్తూ ఎస్పీ కార్యాలయం ఎదుట పోలీసులను ఢీకొడుతూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కారును నడపటం కలకలం రేపింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రాఫీక్ పోలీసులు తాజాగా విడుదల చేశారు.