
అత్తాపూర్ బ్రిడ్జిపై కారు దగ్ధం
రంగారెడ్డి(రాజేంద్రనగర్): రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ బ్రిడ్జిపై టీఎస్08 యూఏ 1865 నంబర్ గల ఇండికా కారు ప్రమాదవశాత్తూ మంటల్లో చిక్కుకుంది. మంటలు వెనువెంటనే కారును చుట్టుముట్టేశాయి. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ వెంటనే అప్రమత్తవటంతో ప్రమాదం తప్పింది. ఫైరింజన్ వచ్చేలోపే కారు పూర్తిగా బూడిదయిపోయింది. ఇండికా కారు, ముందు వెళ్తున్న ఇన్నోవా కారును ఢీకొట్టడంతో షార్ట్ సర్క్యూట్‌కు గురైంది.