prakash nagar
-
వందేళ్ల వంతెన చాన్నాళ్లు 12 ఏళ్ల వంతెనకు నూరేళ్లు
నిజాం కాలంలో వందేళ్ల క్రితం ఖమ్మం మున్నేరుపై రాతి కట్టడంగా నిర్మించిన బ్రిడ్జి 36.9 అడుగుల మేర వరదను తట్టుకుని నిలబడింది. అదే మున్నేరుపై ప్రకాశ్‌నగర్ వద్ద పదేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి స్పాన్ మాత్రం పక్కకు జరిగింది. భారీ వరదతో బ్రిడ్జి స్పాన్ బేరింగ్ పైనుంచి పక్కకు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల 1న ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు మున్నేరుకు భారీగా వరద వచి్చంది. 36.9 అడుగుల మేర వరద ప్రవాహం ఆరు గంటలపాటు కొనసాగింది. ఈ వరద ప్రవాహంతోనే బ్రిడ్జి స్పాన్ బేరింగ్ల పైనుంచి పక్కకు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకొన్ని గంటలు వరద ఇలాగే కొనసాగితే బ్రిడ్జికి ముప్పు వాటిల్లేదని నిపుణులు చెబుతున్నారు. – ఖమ్మం మయూరి సెంటర్పదిలంగా వందేళ్ల బ్రిడ్జి.. అనేకసార్లు భారీగా వరదల తాకిడి తగిలినా ఎక్కడా తొణుకు లేకుండా ఖమ్మం కాల్వొడ్డు వద్ద నిర్మించిన బ్రిడ్జి పదిలంగా నిలిచింది. నిజాంల కాలంలో రాతితో కట్టిన ఈ బ్రిడ్జి వద్ద పలుసార్లు 30 అడుగులకు పైగా వరద ప్రవహించినా చెక్కుచెదరలేదు. గత పదేళ్లుగా బ్రిడ్జి పని అయిపోయిందని, వందేళ్లు దాటినందున ప్రమాదం పొంచి ఉన్నట్లేనని అధికార యంత్రాంగం, ప్రజలు చర్చించుకుంటున్నా.. సగర్వంగా నిలవడం విశేషం. కాగా, ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపై ఎస్12 స్పాన్ పక్కకు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూడో బ్రిడ్జిగా నిర్మాణం.. హైదరాబాద్, సూర్యాపేట, హైదరాబాద్, కోదాడ, విజయవాడ ప్రాంతాల వైపు నుంచి ఖమ్మం నగరంలోకి వచ్చేందుకు మున్నేరుపై మూడు వంతెనల నిర్మాణం జరిగింది. 110 ఏళ్ల క్రితం నిజాం కాలంలో కాల్వొడ్డు వద్ద ఒక బ్రిడ్జి.. కరుణగిరి వద్ద రెండు దశాబ్దాల క్రితం మరో బ్రిడ్జి నిర్మించారు. నానాటికీ రద్దీ పెరగడంతో 2010లో ప్రకాశ్‌నగర్ వద్ద మున్నేరుపై మూడో బ్రిడ్జి నిర్మాణానికి నాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2013లో ఈ బ్రిడ్జి అందుబాటులోకి రాగా.. గత ఏడాది 30.7 అడుగులు, ఈనెల 1న 36.9 అడుగుల మేర వరద వచి్చంది. తాజా వరదతో బ్రిడ్జి నాణ్యత వెలుగులోకి వచి్చందన్న చర్చ జరుగుతోంది. -
ఆ 9 మందిని కాపాడే వరకు ఇక్కడ నుంచి వెళ్ళను..
-
తాడేపల్లిలో కలకలం.. ఫ్రిడ్జ్‌లో గ్యాస్ పేలి మంటలు
సాక్షి, గుంటూరు : తాడేపల్లిలోని ప్రకాశ్ నగర్లో పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రకాశ్ నగర్‌లోని ఓ ఇంట్లో ఆదివారం ఉదయం ఫ్రిడ్జ్‌లోని గ్యాస్ పేలి.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో పైడమ్మ అనే మహిళకు గాయాలు అయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బేగంపేటలో టాటా వింగర్ బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : టాటా వింగర్ వాహనం ఆదివారం ఉదయం బేగంపేట ప్రకాశ్ నగర్లో బీభత్సం సృష్టించింది. టాటా వాహనం బేగంపేట ఎయిర్‌పోర్టు వద్దకు రాగానే అదుపు తప్పి వాహనదారులపైకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో అప్పుడే విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న హోంగార్డు ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. మరోవైపు ఈ సంఘటనలో గాయపడ్డ వాహనం డ్రైవర్ రవితో పాటు మరో అయిదుగురిని బేగంపేట పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా డ్రైవర్‌కు హఠాత్తుగా ఫిట్స్ రావడంతో వాహనం అదుపు తప్పి...ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. -
279 జీవో రద్దుచేయాలి
విజయవాడ (అజిత్‌సింగ్ నగర్) : మున్సిపల్ కార్మికుల జీవితాలను కాలరాసే నిర్ణయాలను ప్రభుత్వం మానుకోవాలని, కార్మికుల పాలిట శాపంగా మారిన జీవో నంబర్ 279ను వెంటనే రద్దు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. డ్వాక్రా, సీఎంఈవై కార్మికులను కార్పొరేషన్‌కు బదులు కాంట్రాక్టర్లకు అప్పగించే విధంగా విడుదలచేసిన జీవో నంబర్ 279ను రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రకాష్‌నగర్‌లో శుక్రవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని, ఈ జీవో వల్ల ఇన్నేళ్లుగా పనిచేస్తున్న డ్వాక్రా, సీఎంఈవై కార్మికులంతా ఉద్యోగ భద్రతను కోల్పోయి కాంట్రాక్టర్ల చెప్పు చేతల్లో నలిగిపోవాల్సిందేనన్నారు. యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి ఎం.డేవిడ్ మాట్లాడుతూ డ్వాక్రా కార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, ఈ జీవో వల్ల కార్మికులకు, వారి కుటుంబాలకు కలిగే నష్టాలను ప్రభుత్వం తెలుసుకుని వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో కార్మికుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రకాష్‌నగర్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన పైపులరోడ్డు మీదుగా డాబాకొట్లు సెంటర్ వరకూ సాగింది. సీఐటీయూ సెంట్రల్ జోన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.దుర్గారావు, రమణరావు, మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు చింతల శ్రీను, బుజ్జమ్మ, వేముల దుర్గ, సీతమ్మ, సుశీల, తదితరులు పాల్గొన్నారు. -
ఇండికా కారులో మహిళ మృతదేహం
-
ఇండికా కారులో మహిళ మృతదేహం
హైదరాబాద్ : బేగంపేట పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ప్రకాశ్‌నగర్‌లో నిలిపి ఉంచిన ఓఇండికా కారు నుంచి దుర్గంధం వెలువడటంలో స్థానికులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ప్రకాశ్‌నగర్ చేరుకుని మహిళ మృతదేహంతోపాటు కారును స్వాధీనం చేసుకుని... పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం మృతదేహాన్ని కారు నుంచి బయటకు తీశారు. మహిళ మృతదేహం గుర్తు పట్టలేకుండా ఉంది. దీంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొంత కాలంగా కారు అక్కడే ఉంటుందని స్థానికులు పోలీసులు తెలిపారు. ఎంత కాలం నుంచి ఆ కారు అక్కడే ఉంటుందన్నది మాత్రం స్థానికులు చెప్పలేకపోతున్నారు. కాగా కారు నెంబర్... వివరాలు లేకపోవడంతో పోలీసులు కారు యాజమాని ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతురాలు యాచకురాలని పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తెలిసింది. ఆమె సదరు కారులో నివాసం ఏర్పరుచుకుందా ? లేక దుండగులు ఆమెను హత్య చేసి ఈ కారులో పడేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ అసలు విషయం తెలియదని పోలీసులు వెల్లడించారు. -
పోలియోను తరిమేద్దాం
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ప్లేగు వ్యాధి తరహాలో పోలియో మహమ్మారిని కూడా సమాజం నుంచి తరిమికొడదామని చిన్ననీటిపారుదల మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక ప్రకాష్‌నగర్‌లోని ప్రకాశం పంతులు స్మారక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంత్రి టీజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1995 నుంచిపోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1950లో ప్లేగు వ్యాధి విజృంభించి ఊళ్లకు ఊళ్లే నాశనమై పోయాయని, అయితే ఆ వ్యాధిని సైతం సంపూర్ణంగా నిర్మూలించామన్నారు. అదే తరహాలోనే పోలియోను కూడా నిర్మూలించాలన్నారు. ఈ సంవత్సరం పల్స్‌పోలియో విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నంద్యాలలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, కల్లూరు పీహెచ్సీలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, స్థానిక ఎ.క్యాంపులోని మున్సిపల్ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డిలో పల్స్ పోలియో కార్యక్రమాలను ప్రారంభించారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి కర్నూలు నగరంలోని పలు పల్స్‌పోలియో కేంద్రాలను సందర్శించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వై. నరసింహులు ఓర్వకల్లు, నన్నూరు, లొద్దిపల్లి, ఉయ్యాలవాడ, బి.తాండ్రపాడు గ్రామాల్లో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇతర జిల్లా అధికారులు సైతం వారికి కేటాయించిన నియోజకవర్గాలు, ప్రాంతాల్లో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.