మందుపాతర పేలుడు: జవాన్లకు గాయాలు
Published Fri, May 19 2017 12:33 PM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM
ఛత్తీస్‌ఘడ్: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి కూంబింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఛత్తీస్‌ఘడ్ సుక్కమాజిల్లా ధోర్నపాల్ అటవీ ప్రాంతంలో శుక్రవారం వెలుగుచూసింది. సీఆర్‌పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ బాంబ్ పేలింది. దీంతో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని జగదల్పూర్ ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement