dantewada blast
-
దంతేవాడ పేలుడు సూత్రధారి ఇతనే.. మావోయిస్టు దళంలో కీలక పాత్ర..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత దంతేవాడ జిల్లాలోని అరన్పూర్ పేలుడు సూత్రధారి జగదీష్ చిత్రం తెరపైకి వచ్చింది. ఇతను చాలా కాలంగా బస్తర్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. నివేదికల ప్రకారం, అరన్‌పూర్‌లో జరిగిన పేలుడులో జగదీష్ మొత్తం సంఘటనకు ప్రణాళికను సిద్ధం చేశాడు. ఈ నక్సలైట్ నాయకుడి నేతృత్వంలోనే దంతేవాడలోని అరన్‌పూర్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్ బలి అయ్యారు. గతంలో జగదీష్ కాటేకల్యాణ్ ఏరియా కమిటీలో మాత్రమే యాక్టివ్‌గా ఉండేవాడు. అయితే పెద్ద పెద్ద సంఘటనలను నిరంతరం అమలు చేయడంలో విజయం సాధించడంతో జగదీష్ క్యాడర్ పెరిగింది. నక్సలైట్ల సైనిక దళంలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. జగదీష్ ప్రాథమికంగా జాగరగుండ తూర్పు గ్రామానికి చెందినవాడు. ఇతనిపై రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు. అరన్పూర్ పేలుడు తర్వాత జగదీష్‌తో పాటు మరో 12 మంది నక్సలైట్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దర్భా డివిజనల్ కమిటీలో చురుగ్గా ఉన్న నక్సల్స్ జగదీష్, లఖే, లింగే, సోమడు, మహేష్, హిద్మా, ఉమేష్, దేవే, నంద్ కుమార్, లఖ్మా, కోసా, ముఖేష్, చైతు, మంగ్తు, రాన్సాయి, జయలాల్, బమన్, సోమ, రాకేష్, భీమాతో పాటు మరికొందరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందరిపై యూఏపీఏ చట్టం ప్రయోగించారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు.. -
నా భర్తతో పాటే నన్నూ.. చితిపైకి చేరిన భార్య
భోపాల్: ఏప్రిల్ 26వ తేదీ బుధవారం ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో జరిగిన మావోయిస్టుల దుశ్చర్య.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. యాభై కేజీల మందుపాతరతో పది మంది డీఆర్జీ జవాన్లు, ఓ డ్రైవర్ బలిగొన్నారు మావోయిస్టులు. ఈ ఘటనలో అమరలైన జవాన్లకు ప్రభుత్వం తరపున గౌరవవందనం అందగా.. అనంతరం అయినవాళ్ల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే.. దంతేవాడ మావోయిస్టుల దాడిలో అమరుడైన డీఆర్జీ జవాన్ భార్య.. ఆత్మాహుతికి సిద్ధపడింది. భర్తతో పాటే తననూ చితి మీద కాల్చేయండంటూ గ్రామస్తులను, బంధువులను బతిమాలుకుందామె. ఆ దృశ్యం అందరినీ కంటతడి పెట్టింది. చివరికి ఆమెను అంతా బలవంతంగా చితిపై నుంచి బయటకు లాక్కొచ్చారు. భర్త మరణంతో తన బతుకు చీకట్లోకి కూరుకుపోయిందని, ఇంక తాను ఎవరి కోసం బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తోందామె. అమర జవాన్ లఖ్మూ మార్కం అంత్యక్రియలకు ఊరు ఊరంతా కదిలి వచ్చింది. షాహీద్ జవాన్.. అమర్ రహే అంటూ కన్నీటి నినాదాలతో అంతిమ యాత్ర నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణం పొగొట్టుకున్నందుకు నివాళి.. ఊరంతా లఖ్మూ మృతదేహాన్ని తాకి నివాళులర్పించారు. ఇదీ చదవండి: జనజీవన స్రవంతిలో కలిసి.. ఇప్పుడు బలైపోయారు! -
ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో మావోయిస్టుల ఘాతుకం జరిగిందిలా..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో మావోయిస్టుల దాడి ఘటనపై పోలీసులు అధికారులు ప్రెస్ నోటు విడుదల చేశారు. ఈ ఘాతుకం ఎలా జరిగిందో తెలిపారు. మావోయిస్టులు రహదారి కింద రెండు, మూడు మీటర్ల దిగువన ఐఈడీ (ఫాక్స్‌హోల్ మెకానిజం) ఏర్పాటు చేశారని, 150 మీటర్ల దూరం నుంచి బటన్ క్లిక్ చేసి మందుపాతర పేల్చారని వెల్లడించారు. 'మందుపాతర పేలిన ప్రాంతంలో సంఘటనా స్థలంలో గాలిస్తున్న ఇద్దరు అనుమానిత నక్సల్స్, ఒక మిలీషియా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నాం. అరన్ పూర్ పోలీసు స్టేషన్ లో పలువురు నక్సల్స్‌పై కేసు నమోదు చేశాం. ఈ స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో పెడ్కా చౌక్ వద్ద డీఆర్జీ జవాన్లు వస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చారు. 10మంది జవాన్లు మృతి చెందారు. నక్సల్స్ ఘాతుకానికి అమరులైన జవాన్ల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. ఘటనా స్థలం లో సీఆర్పీఎఫ్ బెటాలియన్ జవాన్ల కూంబింగ్ కొనసాగుతోంది.' అని పోలీసులు తెలిపారు. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం -
అప్పుడు జనజీవనంలో కలిసి.. ఇప్పుడు మందుపాతరకే బలి
రాయ్‌పూర్: దాదాపు రెండేళ్ల తర్వాత.. దంతేవాడ ఉదంతంతో ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖకు భారీ నష్టం వాటిల్లింది. పది మంది పోలీస్ సిబ్బంది మావోయిస్టుల ఘాతుకానికి బలయ్యారు. స్థానిక పండుగను ఆసరాగా తీసుకుని మావోయిస్టులు 50 కేజీల ఐఈడీతో సిబ్బంది కాన్వాయ్‌పై దాడికి పాల్పడగా.. నిర్లక్ష్యం పదిమంది పోలీసులు, ఒక డ్రైవర్ మొత్తం పదకొండు మంది ప్రాణాల్ని బలిగొంది. అయితే మరణించిన పది మంది డీఆర్జీ(డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్) సిబ్బందిలో.. ఐదుగురు మాజీ మావోయిస్టులేనని అధికారులు చెప్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ జోగా సోధి(35), మున్నా కడ్తి(40), కానిస్టేబుల్స్ హరిరామ్ మాండావి(36), జోగా కవాసి(22), గోప్నియా సైనిక్(సీక్రెట్ ట్రూపర్స్), రాజురామ్ కార్తమ్(25).. గతంలో మావోయిస్టులని.. కొన్నేళ్ల కిందటే లొంగిపోయి డీఆర్జీలో చేరారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మంచి జీవితం కోసం పాకులాడిన ఆ ఐదుగురు ఇలా అర్థాంతరంగా మావోయిస్టుల చేతిలో బలికావడం భాదాకరమని పేర్కొన్నారాయన. ► మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న బస్తర్ డివిజన్లో డీఆర్జీ విభాగంలో స్థానిక యువతను, లొంగిపోయిన మావోయిస్టులనే రిక్రూట్ చేసుకుంటుంది ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ. విద్యార్హతను పెద్దగా ప్రామాణికంగా తీసుకోదు కూడా!. ఈ క్రమంలోనే.. మావోయిస్టు గ్రూపుల నుంచి ఒక్కొక్కరిగా బయటకు వచ్చిన ఆ ఐదుగురు.. డీఆర్జీలో చేరారు. సుక్మా జిల్లా అర్లంపల్లికి చెందిన సోధి, దంతేవాడ ముదర్ గ్రామానికి చెందిన కడ్తి 2017లో డీఆర్జీలో చేరారు. అదేవిధంగా మాండావి 2020, కార్తమ్ 2022లో పోలీస్ ఫోర్స్‌లో చేరారు. దంతేవాడ బడే గదమ్ గ్రామానికి చెందిన కవాసి మాత్రం కిందటి నెలలోనే డీఆర్జీలో చేరాడు అని ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ► డీఆర్జీ.. District Reserve Guard (DRG) ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ పరిధిలోని విభాగం. బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాల్లో డీఆర్జీ సిబ్బందిని మోహరించారు. గత మూడు దశాబ్దాలుగా బస్తర్ రీజియన్‌లో పేట్రేగిపోతున్న మావోయిస్టులను అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో.. డీఆర్జీతో పాటు ఇతర సాయుధ బలగాల సిబ్బంది ప్రాణాలు కోల్పోతూ వస్తన్నారు. ► డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్‌ను 2008లో ఉత్తర బస్తర్ కన్కర్, అబుజ్మద్ నారాయణ్పూర్లలో మోహరించారు. ఐదేళ్ల తర్వాత బీజాపూర్, బస్తర్ జిల్లాలకు డీఆర్జీ బలగాలను విస్తరించారు. ఆ మరుసటి ఏడాది సుక్మా, కొండాగావ్ జిల్లాలకు, చివరికి.. 2015లో దంతేవాడకు డీఆర్జీని విస్తరించింది ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ. ► బుధవారం దంతేవాడ నుంచి అర్నర్పూర్కు డీఆర్జీ బలగాలను తీసుకొచ్చేందుకు ఏడు వాహనాలతో కాన్వాయ్ వెళ్లింది. ఆ సమయంలో ఆ దారిలో కొందరు పిల్లలు పండుగ కోసం వచ్చీపోయే వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో పరిస్థితి సాధారణంగానే ఉందనుకుని.. అదే రూట్లో పోలీస్ సిబ్బందితో కాన్వాయ్ తిరుగు పయనం అయ్యింది. కానీ, మావోయిస్టులు పిల్లలను పక్కకు పంపించేసి.. యాభై కేజీల ఐఈడీని అమర్చి దాడికి పాల్పడ్డారు. ఇదీ చదవండి: ప్రధాని మోదీకి కన్నీటి విన్నపం -
Dantewada: పేలుడు టైంలోని వీడియో బయటకు..
రాయ్‌పూర్: ఒక డ్రైవర్ సహా పది మంది పోలీసులను పొట్టబెట్టుకున్న మావోయిస్టుల ఘాతుకంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత మావోయిస్టులు భారీ దెబ్బ తీశారు. అయితే దంతేవాడ్ పేలుడు ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. పేలుడు తర్వాత.. ఓ పోలీస్ సిబ్బంది అక్కడే ఉన్న మావోయిస్టులపై కాల్పులు జరపడానికి యత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. పేలుడు తర్వాత.. మరో వాహనంలో ఉన్న పోలీస్ సిబ్బంది ఒకరు అక్కడే ఉన్న మావోయిస్టుల వైపుగా వెళ్తూ.. కాల్పులు జరిపేందుకు పొజిషన్ తీసుకుంటూ కనిపించాడు. ఓ వాహనం కింద దాక్కున్న మరో పోలీస్ సిబ్బంది అక్కడి పరిస్థితులను తన ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియోలో పేలుడు జరిగిన ప్రదేశం కనిపిస్తోంది. ‘‘వాహనం మొత్తం పేల్చేశారు..’’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ వాయిస్ వినిస్తోంది. పేలుడు ధాటికి పడిన పదడుగుల లోతు గుంత అంచులనూ క్లిప్‌లో చూడొచ్చు. ఇక క్లిప్ చివరిలో, తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఆ వీడియో చిత్రీకరించిన పోలీస్ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ.. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్((DRG) తరపున మేం యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్‌లో మంగళవారం నుంచి పాల్గొంటున్నాం. బుధవారం మధ్యాహ్నం 1.30 గం. ప్రాంతంలో తిరుగుపయనం అయ్యాం. పేలిన వాహనానికి 100-150 మీటర్ల దూరంలో మేం ప్రయాణిస్తున్న ఎయూవీ ఉంది. మా వాహనంలో మేం ఏడుగురం ఉన్నాం. మొత్తం ఏడు వాహనాల కాన్వాయ్‌లో.. మూడో వాహనం మావోయిస్టులకు లక్ష్యంగా మారిందని తెలిపారు. పేలుడు ధాటికి ఆ వాహనంలో ఉన్న ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు. అంతా చనిపోయారు అని ఆయన తెలిపారు. మేం వాళ్లున్న దిశలో కాల్పులు జరిపాం. వాళ్ల వైపు నుంచి ఒకటి రెండు రౌండ్ల కాల్పులు మాత్రమే వినిపించాయి. ఆ తర్వాత కాల్పులు ఆగిపోయాయి అని ఆ సిబ్బంది తెలిపారు. కాన్వాయ్‌లోని ఏడు వాహనాల్లో మొత్తంలో 70 మంది సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు. #Viral video surfaces showing moments after #Dantewada Naxal #attack in Chhattisgarh. pic.twitter.com/Xxr2mGr5t0 — Jammu Kashmir News Network 🇮🇳 (@TheYouthPlus) April 27, 2023 -
తొందరపాటు వల్లే మావోయిస్టుల ట్రాప్‌లో పడ్డారు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 10 మంది పోలీసులను మావోయిస్టులు బలి తీసుకున్న సంగతి తెలిసిందే. పల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది. దీంతో డీఆర్జీ సిబ్బంది మినీ బస్సులో ఆ ప్రాంతానికి మంగళవారం బయలుదేరి వెళ్లారు. గాలింపు చర్యలు పూర్తిచేసి బుధవారం దంతెవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం సమయంలో పల్నార్–అరన్పూర్ మధ్యలో ఉన్న అటవీ ప్రాంతానికి మినీ బస్సు చేరుకోగానే రోడ్డు మధ్యలో అమర్చిన ఐఈడీ బాంబును మావోయిస్టులు పేల్చారు. పేలుడు ధాటికి మినీ బస్సు గాల్లోకి లేచి పక్కన చెట్లలో పడిపోయింది. బస్సు భాగాలు తునాతునకలు అయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది డీఆర్జీ సిబ్బంది, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. భద్రతా బలగాలు తొందరపాటు చర్యవల్లే.. పేలుడు జరిగిన తీరును చూస్తే కూంబింగ్‌లో పోలీసులు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొటోకాల్ (ఎస్ఓపీ) పాటించలేదని తెలుస్తోంది. ప్రొటోకాల్ ప్రకారం నిఘా సమాచారాన్ని పక్కాగా ధ్రువీకరించుకోవాలి. తర్వాత భద్రతా దళాలు ప్రయాణించే మార్గంలో ప్రమాదం జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి . అవసరమైతే భద్రతా దళాల కంటే ముందు రోడ్ ఆపరేటింగ్ పార్టీని పంపించాలి. మినీ బస్సులో బయలుదేరిన డీఆర్జీ బృందం వీటిని పాటించలేదని తెలుస్తోంది. దాంతో తిరుగు ప్రయాణంలో మావోయిస్టుల ఉచ్చులో చిక్కారు. 2021 ఏప్రిల్ 3న బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో టేకుల్గూడా సమీపంలో సైతం ఇదే తరహాలో మావోయిస్టులు పన్నిన ట్రాప్‌లో భద్రతా దళాలు చిక్కుకున్నాయి. ఆ ఘటనలో 22 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది బలయ్యారు. టీసీఓసీ ఉచ్చులో.. వేసవికి ముందు అడవుల్లో పచ్చదనం పలచబడుతుంది. ఈ సమయంలో మావోయిస్టులు అడవి లోపలికి వెళ్లిపోతుంటారు. పోలీసులు మరింత ఉధృతంగా వారి కోసం గాలిస్తుంటారు. ప్రతి వేసవిలో సాయుధ భద్రతా దళాల దూకుడుతో మావోయిస్టులు చిక్కుల్లో పడుతున్నారు. దీంతో భద్రతా దళాల వేగానికి అడ్డకట్ట వేసేందుకు కొంతకాలంగా టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెన్ (టీసీఓసీ) పేరుతో సరికొత్త వ్యూహాన్ని మావోయిస్టులు అమలు చేస్తున్నారు. భావజాల వ్యాప్తి, కొత్త రిక్రూట్మెంట్, భద్రతా దళాలపై మెరుపుదాడులు చేయడం టీసీఓసీలో వ్యూహంలో భాగంగా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో టీసీఓసీని మావోయిస్టులు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే పల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు సంచారిస్తున్నాయంటూ భద్రతా దళాలకు సమాచారం చేరవేసి తమ ఉచ్చులో పడేసినట్టు తెలుస్తోంది. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం
-
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 11 మంది జవాన్లు మృతి..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా అరాన్పుర్ సమీపంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లతో వెళ్తున్న మినీ బస్సును టార్గెట్ చేసి ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా డిస్ట్రిక్ట్ రిజర్వుడు గార్డు(డీఆర్డీ)కు చెందినవారు. మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో అడవిలో కూంబింగ్ నిర్వహించేందుకు జవాన్లు వెళ్తుండగా.. వీరి రాకను పసిగట్టి మావోయిస్టులు దాడి చేశారు. మినీ బస్సును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేల్చారు. అమరులైన జవాన్ల పేర్లు 1. రామ్‌కుమార్ యాదవ్ - హెడ్ కానిస్టేబుల్ 2. టికేశ్వర్ ధ్రువ్ - అసిస్టెంట్ కానిస్టేబుల్ CAF, ధమ్తరి 3. సలిక్ రామ్ సిన్హా - కానిస్టేబుల్, కంకేర్ 4. విక్రమ్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్ 5. రాజేష్ సింగ్ - కానిస్టేబుల్ (ఘాజీపూర్, యుపి) 6. రవి పటేల్ - కానిస్టేబుల్ 7. అర్జున్ రాజ్‌భర్, కానిస్టేబుల్ (CAF) సీఎంకు అమిత్‌షా ఫోన్.. ఈ ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఛత్తీస్‌గఢ్ సీఎం బూపేశ్ బఘేల్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. జవాన్లు ప్రాణాలను బలిగొంటున్న మావోయిస్టులను వదిలిపెట్టబోమని సీఎం బఘేల్ తేల్చిచెప్పారు. పోరాటం చివరి దశలో ఉందని పేర్కొన్నారు. ఘటనలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ములుగు పోలీసులు అప్రమత్తం.. ఛత్తీస్‌గఢ్ ఘటనతో తెలంగాణలోని ములుగు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాలతో ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు. వెంకటాపురం-భద్రాచలం ప్రధాన రహదారిపై మావోయిస్ పార్టీ అగ్ర నేతల వాల్ పోస్టర్లతో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టు యాక్షన్ టీం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: భార్యను సమాధి చేసి దానిపై డ్యాన్సులు.. ఈ కేసు ఆధారంగా వెబ్ సిరీస్.. -
గుండెల్లో, తలమీద కాల్చి మరీ చంపారు!
సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చడంలో మావోయిస్టులు చాలా దారుణంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ప్రాంతం గుండా జవాన్లు ఎటువైపు నుంచి ఎటు వెళ్తున్నారో ముందుగానే పక్కా సమాచారం అందుకున్న మావోయిస్టులు.. ఆ దారిలోనే శక్తిమంతమైన మందుపాతర అమర్చి పేల్చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించినట్లు తొలుత కథనాలు వచ్చాయి. కానీ, దాడికి గురైన జవాన్లను చూసిన తర్వాత సరికొత్త విషయాలు తెలిశాయి. మందుపాతర పేల్చిన తర్వాత జవాన్లు ఇంకా ఎక్కడ బతికుంటారోనన్న అనుమానంతో.. మావోయిస్టులు వాళ్ల తలమీద, గుండెల్లోను కాల్చారని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు చెప్పారు. జవాన్లలో ముగ్గురు పేలుడు తర్వాత కూడా బతికే ఉన్నారని, కానీ ఆ తర్వాత వాళ్లను మావోయిస్టులు కాల్చేశారని సీఆర్పీఎఫ్ డీజీ దుర్గాప్రసాద్ తెలిపారు. బుల్లెట్ గాయాలు తగిలిన తర్వాత వాళ్లు బతికారో లేదో మాత్రం తమకు కూడా ఇంకా పూర్తిగా తెలియడం లేదని ఆయన అన్నారు.