రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో మావోయిస్టుల దాడి ఘటనపై పోలీసులు అధికారులు ప్రెస్ నోటు విడుదల చేశారు. ఈ ఘాతుకం ఎలా జరిగిందో తెలిపారు. మావోయిస్టులు రహదారి కింద రెండు, మూడు మీటర్ల దిగువన ఐఈడీ (ఫాక్స్‌హోల్ మెకానిజం) ఏర్పాటు చేశారని, 150 మీటర్ల దూరం నుంచి బటన్ క్లిక్ చేసి మందుపాతర పేల్చారని వెల్లడించారు.
'మందుపాతర పేలిన ప్రాంతంలో సంఘటనా స్థలంలో గాలిస్తున్న ఇద్దరు అనుమానిత నక్సల్స్, ఒక మిలీషియా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నాం. అరన్ పూర్ పోలీసు స్టేషన్ లో పలువురు నక్సల్స్‌పై కేసు నమోదు చేశాం. ఈ స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో పెడ్కా చౌక్ వద్ద డీఆర్జీ జవాన్లు వస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చారు. 10మంది జవాన్లు మృతి చెందారు. నక్సల్స్ ఘాతుకానికి అమరులైన జవాన్ల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. ఘటనా స్థలం లో సీఆర్పీఎఫ్ బెటాలియన్ జవాన్ల కూంబింగ్ కొనసాగుతోంది.' అని పోలీసులు తెలిపారు.
చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం
Comments
Please login to add a commentAdd a comment