IED blast
-
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఇద్దరు జవాన్ల మృతి
రాయిపూర్ : ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్ల వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన జవాన్లు విష్ణు, శైలేంద్రగా గుర్తించారు పోలీసు అధికారులు. బీజార్ పూర్ జిల్లా సిల్గూర్ -టేకులగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
జమ్ముకశ్మీర్‌లో ఐఈడీ పేల్చిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్లు మృతి..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. కండి ఫారెస్ట్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించేందుకు శుక్రవారం ఉదయం వెళ్లారు జవాన్లు. ఓ గుహలో ఉన్న ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. అయితే జవాన్లు లక్ష్యంగా ఉగ్రవాదులు ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారత సైన్యం ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇద్దరు సైనికులను బలిగొన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపిటన్లు తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య కాల్పుల ఘటన జరగడం మూడు రోజుల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. గురువారం బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఉద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మణిపూర్‌లో హైటెన్షన్.. మంత్రిపై దాడి.. రైళ్లు బంద్ -
ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో మావోయిస్టుల ఘాతుకం జరిగిందిలా..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో మావోయిస్టుల దాడి ఘటనపై పోలీసులు అధికారులు ప్రెస్ నోటు విడుదల చేశారు. ఈ ఘాతుకం ఎలా జరిగిందో తెలిపారు. మావోయిస్టులు రహదారి కింద రెండు, మూడు మీటర్ల దిగువన ఐఈడీ (ఫాక్స్‌హోల్ మెకానిజం) ఏర్పాటు చేశారని, 150 మీటర్ల దూరం నుంచి బటన్ క్లిక్ చేసి మందుపాతర పేల్చారని వెల్లడించారు. 'మందుపాతర పేలిన ప్రాంతంలో సంఘటనా స్థలంలో గాలిస్తున్న ఇద్దరు అనుమానిత నక్సల్స్, ఒక మిలీషియా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నాం. అరన్ పూర్ పోలీసు స్టేషన్ లో పలువురు నక్సల్స్‌పై కేసు నమోదు చేశాం. ఈ స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో పెడ్కా చౌక్ వద్ద డీఆర్జీ జవాన్లు వస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చారు. 10మంది జవాన్లు మృతి చెందారు. నక్సల్స్ ఘాతుకానికి అమరులైన జవాన్ల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. ఘటనా స్థలం లో సీఆర్పీఎఫ్ బెటాలియన్ జవాన్ల కూంబింగ్ కొనసాగుతోంది.' అని పోలీసులు తెలిపారు. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం -
‘ఢిల్లీ బాంబు పేలుడు మా పనే’
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం ఐఈడీ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇక దీని వెనక ఉగ్రవాద గ్రూపుల హస్తం ఉంటుందని భావిస్తోన్న నేపథ్యంలో దాడి చేసింది తామే అంటూ జైష్ ఉల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ సంస్థ పేరు ఎప్పుడు, ఎక్కడా వినలేదని.. తెలియదని అధికారులు వెల్లడించారు. టెలిగ్రామ్ వేదికగా చేసిన ఈ ప్రకటనకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. అయితే దర్యాప్తు సంస్థలు కేవలం ఈ ప్రకటన మీద మాత్రమే ఆధారపడకూడదని భావిస్తున్నాయి. సరైన ఆధారాలు లభించేతవరకు దాడి చేసింది జైష్ ఉల్ హింద్ సంస్థ అని నమ్మడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నాయి. దర్యాప్తును తప్పదోవ పట్టించే ప్రయత్నం కూడా అయ్యి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం వైరలవుతోన్న స్క్రీన్షాట్లలో ‘‘సర్వశక్తివంతుడైన అల్లా దయ, సాయంతో జైష్ ఉల్ హింద్ సైనికులు ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉన్న ప్రాంతంలోకి చొచ్చుకుని వెళ్లి.. ఐఈడీ దాడి చేశారు. భారతదేశం చేసిన దాడులకు ప్రతీకారంగా అల్లా ఆజ్ఞతో మొదలైన ఈ దాడులు కొనసాగుతాయి. ముఖ్యమైన భారతదేశ నగారలను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా దాడులు చేస్తాం. వేచి ఉండండి’’ అని ఉంది. (ఢిల్లీ పేలుడు : ఇది ట్రైలర్ మాత్రమే) ఇక ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకలు జరిగిన ప్రదేశానికి సమీపంలో సుమారు 50 మీటర్ల దూరంలో అబ్దుల్ కలాం రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఈ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలనలో పేవ్మెంట్ కింద పేలుడు పదార్థాలను అమర్చినట్టు గుర్తించారు. ఫోరెన్సిక్ ఆధారాలను బట్టి పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ వినియోగించినట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు క్యాబ్‌లో ఇద్దరు వ్యక్తులు అక్కడ దిగినట్టు గుర్తించిన పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు క్యాబ్ డ్రైవర్ నుంచి వివరాలు ఆరా తీస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ రాయబారికి పంపినట్టుగా భావిస్తున్న పింక్ స్కార్ఫ్, ఒక కవరును కూడా సంఘటనా స్థలానికి 12 గజాల దూరంలో స్వాధీనం చేసుకున్నారు. పేలుడును “ట్రైలర్”గా ఈ లేఖలో ప్రకటించినట్టు తెలుస్తోంది. అలాగే గత ఏడాది హత్యకు గురైన ఇరాన్ టాప్ సైనికాధికారి ఖాసిం సోలైమాని, అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫఖ్రిజాదేహ్ లను అమర వీరులుగా పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ప్రతీకార చర్యగానే ఈ దాడి జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఢిల్లీ పేలుడు : ఇది ట్రైలర్ మాత్రమే
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో సంభవించిన ఐఈడి పేలుడు ఆందోళన రేపింది. దీనిపై కేంద్రం సీరియస్‌గా స్పందిస్తోంది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రికి పూర్తి రక్షణ కల్పిస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హామీ ఇచ్చారు.అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీనియర్ పోలీసు అధికారులతో సంప్రదిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ దాడి నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇతర దేశాల రాయబార కార్యాలయాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు అలాగే దేశంలోని పలు విమానాశ్రయాల్లో గట్టి భద్రతా జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఢిల్లీ, ముంబై, జైపూర్, యూపీ తదితర స్టేట్స్లో విమానాశ్రయాలకు హై అలర్ట్ ప్రకటించారు. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్, సహా అన్ని ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైపూర్ నగరంలో హై అలర్ట్ ప్రకటించామని రాజస్థాన్ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకలు జరిగిన ప్రదేశానికి సమీపంలో సుమారు 50 మీటర్ల దూరంలో అబ్దుల్ కలాం రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఈ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ కమిషనర్ (డిసిపి) ప్రమోద్ కుష్వాతో సహా సీనియర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఢిల్లీలో తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలన సందర్భంగా పేవ్మెంట్ కింద పేలుడు పదార్థాలను అమర్చినట్టు గుర్తించారు. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ వినియోగించినట్టు ఫోరెన్సిక్ ఆధారాలను బట్టి అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు క్యాబ్‌లో ఇద్దరు వ్యక్తులు అక్కడ దిగినట్టు గుర్తించిన పోలీస్ స్పెషల్ సెల్ అధికారులుక్యాబ్ డ్రైవర్నుంచి వివరాలను ఆరా తీస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ రాయబారికి పంపినట్టుగా భావిస్తున్న పింక్ స్కార్ఫ్, ఒక కవరును కూడా సంఘటనా స్థలానికి 12 గజాల దూరంలో స్వాధీనం చేసుకున్నారు. పేలుడును “ట్రైలర్” గా ఈలేఖలో ప్రకటించినట్టు తెలుస్తోంది. అలాగే గత ఏడాది హత్యకు గరైన ఇరాన్ టాప్ సైనికాధికారి ఖాసిం సోలైమాని, అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫఖ్రిజాదేహ్ లను అమర వీరులుగా పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ప్రతీకార చర్యగానే ఈ దాడి జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ పేలుడు 'ఉగ్రవాద దాడి' కావచ్చని రాయబారి రాన్ మాల్కా చెప్పారు. భారత అధికారులపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు. అటు ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరగణిస్తున్నామని ఇజ్రాయె మంత్రి గబీ అష్కెనాజీ వెల్లడించారు. తమ దౌత్యవేత్తలకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. దర్యాప్తు జరుగుతోందని, దోషులను క్షమించే ప్రశ్నే లేదంటూ ట్విట్ చేశారు. #WATCH | Delhi Police Special Cell team outside Israel Embassy in New Delhi where a low-intensity explosion took place yesterday. pic.twitter.com/mmpNbhDkV4 — ANI (@ANI) January 30, 2021 Blast outside Israeli Embassy could be a 'terror attack', says envoy Ron Malka Read @ANI Story | https://t.co/90BQrgcrmj pic.twitter.com/8wMfw1xWFT — ANI Digital (@ani_digital) January 30, 2021 In 2012, there was a terror attack on Israeli diplomats in Delhi not far from Embassy. It might be connected, there might be a pattern. We're investigating & this is one of the options: Ambassador of Israel to India Ron Malka on possibility of link b/w explosions in 2012&onJan 29 pic.twitter.com/1RKX6MKhVW — ANI (@ANI) January 30, 2021 -
చత్తీస్‌గఢ్‌లో పేలుడు : జవాన్ మృతి
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఆగడాలు కొనసాగుతున్నాయి. దంతెవాడ సమీపంలో బొద్లి ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఐఈడీ పేలుడులో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మరణించారు. మృతుడిని బీహార్‌కు చెందిన రోషన్ కుమార్‌గా గుర్తించారు. రోషన్ సీఆర్పీఎఫ్ 195వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. దంతెవాడ-జగ్ధాల్పూర్ బోర్డర్లోని సీఆర్పీఎఫ్ శిబిరానికి 700 మీటర్ల దూరంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. జవాన్ మృతదేహాన్ని చత్తీస్‌గఢ్‌లోని బర్సుస్ ప్రాంతానికి తరలించారు. -
జార్ఖండ్‌లో ఐఈడీలు పేల్చిన మావోలు
రాంచీ: జార్ఖండ్‌లో మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడ్డారు. జవాన్ల వాహనాలు లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున వరుసగా ఐఈడీలు పేల్చడంతో 15 మంది గాయపడ్డారు. సెరైకెలా–ఖర్సవాన్ జిల్లాలోని హుర్దా అటవీ ప్రాంత సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. పోలీసు అధికారుల కథనం ప్రకారం.. సీఆర్పీఎఫ్ జవాన్లు, కోబ్రా, జార్ఖండ్ పోలీసులు కుచాయ్ ప్రాంతంలో కూంబింగ్ నిమిత్తం వాహనాల్లో బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వీరిని గమనించిన మావోయిస్టులు వరుసగా 15కు పైగానే ఐఈడీ (ఆధునిక పేలుడు పదార్థాలు) పేలుళ్లకు పాల్పడ్డారు. కాగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో రాంచీకి తరలించారు. మావో నేత మహరాజ్ ప్రమాణిక్ నాయకత్వంలో ఈ పేలుళ్లు జరిగాయని జిల్లా ఎస్పీ తెలిపారు. -
జార్ఖండ్‌లో భారీ పేలుడు
రాంచీ : జార్ఖండ్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు వణికించాయి. ఐఈడీ పేలుడుతో 11 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. సరైకెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలడంతో ఆ సమయంలో స్పెషల్ ఆపరేషన్స్‌లో నిమగ్నమైన భద్రతా సిబ్బంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విమానాల్లో రాంచీలోని ఆస్పత్రులకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. జార్ఖండ్‌లో నక్సల్స్ ఏరివేతకు భద్రతా సిబ్బంది, పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌కు ప్రతీకారంగా గతవారంలోనూ నక్సల్స్ ముగ్గురు భద్రతా సిబ్బందిని హతమార్చారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పోలీసులపై మావోల పంజా
సాక్షి, ముంబై, హైదరాబాద్, భూపాలపల్లి/ గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కూంబింగ్‌కు బయలుదేరిన పోలీసుల వాహనం లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ మందుపాతరను పేల్చారు. ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర పోలీస్ విభాగం క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ) యూనిట్‌కు చెందిన 15 మంది కమాండోలతో పాటు ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు ధాటికి పోలీసులు ప్రయాణిస్తున్న వ్యాను తునాతునకలైంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు మావోయిస్టుల ఏరివేతకు అదనపు బలగాలను ఘటనాస్థలికి పంపారు. కాగా, మావోయిస్టుల దుశ్చర్యను ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సీఎం ఫడ్నవీస్‌తో పాటు పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి. మరోవైపు మావోయిస్టులకు దీటైన జవాబు ఇస్తామని మహారాష్ట్ర డీజీపీ సుబోధ్ జైశ్వాల్ ప్రకటించారు. మహారాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవమైన మే 1నే మావోయిస్టులు ఈ ఘాతుకానికి తెగబడటం గమనార్హం. పక్కాగా వలపన్ని దాడి.. పక్కా ప్రణాళిక ప్రకారమే మావోయిస్టులు కమాండోలను ఉచ్చులోకి లాగి హత్య చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. గడ్చిరోలి జిల్లాలోని దాదర్‌పూర్ గ్రామ సమీపంలో 136వ జాతీయ రహదారి పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున పలువురు మావోయిస్టులు ఇక్కడకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు వాడుతున్న జేసీబీలు, ట్రాక్టర్లు, డంపర్లు సహా 36 వాహనాలపై కిరోసిన్, డీజిల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి అడవిలోకి పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న క్యూఆర్టీ కమాండోల బృందం అక్కడకు బయలుదేరింది. వీరి వాహనం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుర్ఖేదా ప్రాంతంలోని లెన్ధారీ వద్దకు రాగానే రోడ్డుపై చెట్లు పడిపోయి ఉన్నాయి. వెంటనే వ్యాను నుంచి దిగిన కమాండోలు వాటిని తొలగించబోతుండగా అక్కడే నక్కిన మావోలు ఒక్కసారిగా మందుపాతరను పేల్చారు. అనంతరం పేలుడుకు చెల్లాచెదురైన కమాండోలపై అన్నివైపుల నుంచి చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కమాండోలు ఎదురుకాల్పులు జరుపుతూనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. సాధారణ వ్యానులో ప్రయాణం.. మావోయిస్టులకు గట్టి పట్టున్న గడ్చిరోలిలో కూంబింగ్ సందర్భంగా భద్రత విషయంలో పోలీస్ కమాండోలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కీలకమైన ఆపరేషన్‌కు వెళుతూ కూడా వీరంతా మైన్‌ప్రూఫ్ వాహనంలో కాకుండా సాధారణ వ్యానులో ప్రయాణించడాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయమై మహారాష్ట్ర పోలీస్ డీజీపీ సుబోధ్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘నిఘా వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఇప్పుడే చెప్పడం సరికాదు. ఈ కూంబింగ్‌కు ఓ ప్రైవేటు వాహనాన్ని ఎందుకు ఎంచుకున్నారు? క్యూఆర్టీ కమాండోల కదలికలపై మావోయిస్టులకు ముందే సమాచారం అందిందా? అనే కోణంలో విచారణ జరుపుతాం. మావోయిస్టులకు దీటుగా బదులివ్వగలిగే సత్తా మాకుంది. భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకే మావోలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. గడ్చిరోలిలో ఎన్నికలు పూర్తయిందున దాడులకు ఎన్నికలను ముడిపెట్టలేమని స్పష్టం చేశారు. కాగా, 2018, ఏప్రిల్‌లో క్యూఆర్టీ కమాండోలు ఓ ఆపరేషన్‌లో 40 మంది మావోయిస్టులను హతమార్చారు. ఇందుకు ప్రతిగానే మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. దాడి వెనుక తెలంగాణ మావోయిస్టు కమిటీ గడ్చిరోలి దాడికి మావోయిస్టులు చాలాకాలం క్రితమే పథక రచన చేశారని నిఘావర్గాలు తెలిపాయి. ఈ దాడి పథకం అమలులో తెలంగాణ మావోయిస్టు కమిటీ నాయకులే కీలకమని వెల్లడించాయి. ఈ ఆపరేషన్‌లో కనీసం 100 మంది పాల్గొని ఉంటారని పేర్కొన్నాయి. మరోవైపు హైఅలర్ట్ ప్రకటించిన తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు, గ్రేహౌండ్స్ బలగాలను సరిహద్దు ప్రాంతానికి తరలించారు. గడ్చిరోలిలో కూంబింగ్ నుంచి తప్పించుకునేందుకు మావోలు తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి జిల్లాల్లో ప్రవేశించే అవకాశముండటంతో గాలింపును ముమ్మరం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వీవీఐపీలు, రాజకీయ నేతలను పోలీసులు అప్రమత్తం చేశారు. మహారాష్ట్రలో నెత్తుటి మరకలు మహారాష్ట్రలో భద్రతాబలగాలు లక్ష్యంగా గతంలో మావోయిస్టులు చేసిన దాడులివే.. ► 2009, ఫిబ్రవరి 1: గడ్చిరోలి జిల్లాలోని మోర్కే గ్రామం వద్ద మావోలు జరిపిన దాడిలో గస్తీ బృందానికి చెందిన 15 మంది పోలీసులు దుర్మరణం. ► 2009, మే 21: మహారాష్ట్రలోని మురు మ్ గ్రామం వద్ద మావోల మెరుపుదాడి లో 16 మంది పోలీస్ సిబ్బంది మృతి. ► 2009, అక్టోబర్ 8: గడ్చిరోలిలోని లహేరీ వద్ద ఎదురుకాల్పులు. 17 మంది పోలీసులు దుర్మరణం. ► 2011, మే 19: భమ్రాగఢ్ తాలుకాలో మావోయిస్టుల మెరుపుదాడి. నలుగురు పోలీస్ సిబ్బంది మృతి. ► 2012, మార్చి 27: ధనోరాలో సీఆర్పీఎఫ్ బస్సును పేల్చివేసిన మావోలు. 12 మంది సీఆర్పీఎఫ్ ఎలైట్ యూనిట్ జవాన్లు మృత్యువాత. మరో 28 మందికి తీవ్రగాయాలు. దోషులను వదిలిపెట్టం: మోదీ ‘గడ్చిరోలిలో మన భద్రతాసిబ్బందిపై మావోయిస్టుల హేయమైన దాడిని ఖండిస్తున్నా. ఈ హింసకు పాల్పడ్డ దోషులను వదిలిపెట్టబోం. అమరులైన వీరులకు నా సెల్యూట్. వారి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోం. అమరుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని చెప్పారు. పిరికిపందల చర్య: రాజ్‌నాథ్ ‘తీవ్రమైన నిరాశలో కూరుకుపోయిన మావోలు ఈ పిరికిపంద చర్యకు పాల్పడ్డారు. మావోల దుశ్చర్య విషయమై సీఎం ఫడ్నవీస్‌తో ఇప్పుడే మాట్లాడాను. మహారాష్ట్రకు కేంద్రం అన్నివిధాలుగా అండగా ఉంటుంది. హోంశాఖ వర్గాలు గడ్చిరోలి జిల్లా యంత్రాంగంతో టచ్‌లో ఉన్నాయి. ఈ దుర్ఘటనలో అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వీరి త్యాగం వృధాగా పోదు’ అని తెలిపారు. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా: రాహుల్ ‘గడ్చిరోలీలో మన భద్రతాసిబ్బందిపై దాడి గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. తమ ప్రియమైనవారిని కోల్పోయిన అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందిస్తూ..‘ఈ విషాద సమయంలో నేను, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తున్నాం. దేశం మొత్తం మావోల హింసను వ్యతిరేకిస్తోంది. ఈ హింసాత్మక భావజాలాన్ని కలసికట్టుగా ఓడిస్తాం’ అని పేర్కొన్నారు. దాదర్పూర్లో మావోయిస్టులు తగులబెట్టిన వాహనాలు -
మావోయిస్టుల దాడిలో 15 మంది జవాన్ల మృతి..!
-
మావోయిస్టుల దాడిలో 15 మంది జవాన్ల మృతి..!
ముంబై : మావోయిస్టులు మరోసారి పేట్రేగిపో్యారు. భద్రతా సిబ్బందిపై పంజా విసిరిరారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ మందుపాతర పెట్టి పేల్చేశారు. ఈ ఘటన మహారాష్ట్రాలోని గడ్చిరోలిలో బుధవారం చోటుచేసుకుంది. భారీ విస్పోటనం కారణంగా వాహనం తునాతునకలైంది. ఈ ప్రమాదంలో 15 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. జాంబిర్‌కేడ అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో ఈ దారుణం జరిగింది. అంతకు ముందు ఇదే జిల్లా కుర్ఖేడా తాలూకా దాదాపూర్ వద్ద మావోయిస్టులు బుధవారం రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 36 వాహనాలకు నిప్పుపెట్టారు. (చదవండి : గడ్చిరోలిలో మావోయిస్టుల విధ్వంసకాండ) -
పోలింగ్ హింసాత్మకం : నారాయణ్‌పూర్‌లో భారీ పేలుడు
రాయ్‌పూర్ : లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగలో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చత్తీస్‌గఢ్‌లో పోలింగ్ బహిష్కరణకు పిలుపు ఇచ్చిన మావోయిస్టులు హింసతో చెలరేగారు. నారాయణపూర్‌లో భారీ ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకున్నా పోలింగ్ నేపథ్యంలో భయాందోళనలు నెలకొన్నాయి. నారాయణపూర్ ఫరాస్‌గాం ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఘటనలో ఎవరూ గాయపడలేదని ఎస్పీ చెప్పారు. మరోవైపు బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో భారీ భద్రత నడుమ పోలింగ్ జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే సహా నలుగురు వ్యక్తులు మంగళవారం మావోల చేతిలో హత్యకు గురైన దంతెవాడ అసెంబ్లీ సెగ్మెంట్ ఈ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో 80,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. -
జమ్ము కాశ్మీర్లో భారీ ఉగ్రదాడి
పుల్వామా : జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 39 మంది జవాన్లు మృతిచెందారు. అవంతిపొరలోని గొరిపొరలో మెయిన్ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ముందుగా కాల్పులు జరిపి, అనంతరం వాహనాలు ఆగగానే ఐఈడీ బాంబు పేల్చారు. బాంబు పేలుడు దాటికి వాహనం తునాతునకలై, 39 మంది మృతిచెందగా, మరో 40 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు జమ్ము నుంచి శ్రీనగర్‌కు వెలుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు కాన్వాయ్‌లోకి కారును తీసుకెళ్లి తనను తాను పేల్చేసుకున్నాడు. దాడి సమయంలో కాన్వాయ్‌లో మొత్తం 70 వాహనాలు ఉన్నాయి. కారు నడిపిన ఉగ్రవాదిని పుల్వామా ప్రాంతానికి చెందిన అదిల్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. 2018లో అతడు జైషే మహ్మద్‌లో చేరాడు. ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ (జేఈఎం) ప్రకటించింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, డీజీ సీఆర్పీఎఫ్ ఆర్ఆర్ భట్నాగర్‌తో రాజ్‌నాథ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉగ్రదాడిని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. అవంతిపురలో జవాన్ల మృతి వార్త నన్ను తీవ్ర కలవరానికి గురిచేసిందని, ఈ దారుణ ఉగ్రదాడిని ఖండించడానికి మాటలు రావడం లేదని పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా దాడిపై విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణమని, సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
మావోయిస్టుల దుశ్చర్య: జవాన్ల మృతి
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని కుత్రు వద్ద మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, జవాన్లు కలిసి సోమవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా పేలుడు సంభవించినట్లు స్పెషల్ డీజీ తెలిపారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు: కానిస్టేబుల్‌కు గాయాలు
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా దండకారణ్యంలో ఏర్పాటు చేసిన ఓ బ్యానర్‌ను తొలగిస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దంతెవాడ జిల్లాలో మావోయిస్టు బ్యానర్లు తొలగిస్తుండగా ఐఈడీ పేలడంతో ఘటన జరిగింది. గాయపడిన కానిస్టేబుల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. -
మణిపూర్‌లో శక్తివంతమైన పేలుడు
ఇంఫాల్ : మణిపూర్‌లో జరిగిన పేలుళ్లలో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. టెంగ్యుపోరల్ జిల్లా సమీపంలోని దేశ సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున శక్తివంతమైన పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ట్రాన్స్-ఏషియన్ హైవే 102 ప్రాంతంలో రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ పేలుడు జరిపినట్లు తెలుస్తోంది. బాంబు పేలుడు జరిగినప్పుడు ఆ ప్రాంతం నుంచి 165 మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మరోవైపు గాయపడిన నలుగురు భద్రతా సిబ్బందిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా లీమఖాంగ్లో ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడినవారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
అసోంలో పేలుడు, ముగ్గురు జవాన్లు మృతి
గువహటి : అసోంలో ఉల్ఫా ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. టిన్సుకియా జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఆర్మీ జవాన్ల వాహనం లక్ష్యంగా ఐఈడీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. కాగా పెంగ్రీ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ అధికారి సునీత్ న్యూటన్ తెలిపారు. ఉగ్రవాదులు ముందుగా పేలుడుకు పాల్పడి అనంతరం జవాన్లపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ చర్యను అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్రంగా ఖండించారు. అధికారులను టిన్సుకియా పంపిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటనపై ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ కూడా ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించింది. #NEOps. IED blast,Tinsukia Update. Three Soldiers martyred & Four Soldiers Injured. Search Operation is on @adgpi — EasternCommand_IA (@easterncomd) 19 November 2016 -
ఇంఫాల్‌లో బాంబు పేలుడు: ముగ్గురు మృతి
ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంపాల్లోని పశ్చిమ ప్రాంతమైన కుత్యాంగ్ ప్రాంతంలో ఆదివారం శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరొకరు మరణించారు. దాంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మిగిలిన క్షతగాత్రుల పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. -
ఇంఫాల్‌లో బాంబు పేలుడు: ఇద్దరు మృతి
-
బాంబు నిర్వీర్యంలో పొరపాటు.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
ఓ బాంబును నిర్వీర్యం చేయడంలో సీఆర్పీఎఫ్ అధికారులు పొరపాటు చేయడంతో.. ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఓ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ని గుర్తించి, దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో పొరపాటు చేయగా, ముగ్గురు మరణించడంతో పాటు మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో దిలీప్ కుమార్ అనే జవాను తనను రక్షించమంటూ హృదయ విదారకంగా వేడుకుంటున్న దృశ్యాలు టీవీ ఛానళ్లలోను, సోషల్ మీడియాలోను విస్తృతంగా ప్రచారం అయినా, సీఆర్పీఎఫ్ చీఫ్ దిలీప్ త్రివేదీ మాత్రం తాము తరలింపులో ఎలాంటి జాప్యం చేయలేదని చెప్పారు. బీహార్ నుంచి తమ అధికారులు వెంటనే అక్కడకు వెళ్లారని ఆయన అన్నారు. ఐఈడీని నిర్వీర్యం చేయడంలో జరిగినది మాత్రం మానవ తప్పిదమేనని ఆయన అంగీకరించారు. ఎంతటి నిపుణులైనా ఒక్కోసారి పొరపాటు చేస్తారని, దేశ భద్రత కోసం తాము చేసే త్యాగాలను మర్చిపోకూడదని ఆయన అన్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు సంఘటన జరిగితే, 2.30 గంటలకల్లా హెలికాప్టర్ అక్కడ ఉందని, విషమ పరిస్థితిలో ఉన్న జవానును రాంచీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చామని త్రివేదీ తెలిపారు. -
ఒడిశాలో పేలిన మందుపాతర
సాలూరు(విజయనగరం), న్యూస్‌లైన్/కొరాపుట్(ఒడిశా): ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మంగళవారం మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 161వ బీఎస్ఎఫ్ బెటాలియన్‌కు చెందిన 18 మంది జవాన్లు మల్కన్‌గిరి నుంచి విశాఖపట్నానికి మూడు వాహనాల్లో బయలుదేరారు. ఉదయం 9.30కు కొరాపుట్-సాలూరు జాతీయ రహదారి సమీపంలోని సకిరాయి గ్రామం దగ్గరకు వాహనాలు వచ్చాయి. మొదటి వాహనం అక్కడి క ల్వర్టు దాటింది. రెండో వాహనం దాటుతుండగా కల్వర్టు కింద అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. పేలుడు ధాటికి వాహనం తునాతునకలైంది. అందులోని జవాన్లలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తర్వాత మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు ఎన్కౌంటర్లు చింతూరు, న్యూస్‌లైన్:ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. లోండిగూడ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్టీఎఫ్, డీఎఫ్ బలగాలు సోమవారం సాయంత్రం సమీప అడవుల్లో కూంబింగ్ చేపడుతుండగా మర్దాపాల్ గ్రామం వద్ద మావోయిస్టులు తారసపడ్డారు. అప్పుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలు మృతి చెందారు.