ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు: కానిస్టేబుల్‌కు గాయాలు
Published Fri, Jul 28 2017 2:13 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా దండకారణ్యంలో ఏర్పాటు చేసిన ఓ బ్యానర్‌ను తొలగిస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దంతెవాడ జిల్లాలో మావోయిస్టు బ్యానర్‌లు తొలగిస్తుండగా ఐఈడీ పేలడంతో ఘటన జరిగింది. గాయపడిన కానిస్టేబుల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement