మణిపూర్‌లో శక్తివంతమైన పేలుడు | Four security personnel injured after a suspected IED blast in manipur | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో శక్తివంతమైన పేలుడు

Published Mon, May 8 2017 9:22 AM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

Four security personnel injured after a suspected IED blast in manipur

ఇంఫాల్‌ : మణిపూర్‌లో జరిగిన పేలుళ్లలో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. టెంగ్యుపోరల్ జిల్లా సమీపంలోని దేశ సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున శక్తివంతమైన పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.  ట్రాన్స్-ఏషియన్ హైవే 102 ప్రాంతంలో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఈ పేలుడు జరిపినట్లు తెలుస్తోంది.

బాంబు పేలుడు జరిగినప్పుడు ఆ ప్రాంతం నుంచి 165 మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మరోవైపు గాయపడిన నలుగురు భద్రతా సిబ్బందిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌ ద్వారా లీమఖాంగ్లో ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడినవారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement