మణిపూర్లో శక్తివంతమైన పేలుడు
ఇంఫాల్ : మణిపూర్లో జరిగిన పేలుళ్లలో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. టెంగ్యుపోరల్ జిల్లా సమీపంలోని దేశ సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున శక్తివంతమైన పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ట్రాన్స్-ఏషియన్ హైవే 102 ప్రాంతంలో రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ పేలుడు జరిపినట్లు తెలుస్తోంది.
బాంబు పేలుడు జరిగినప్పుడు ఆ ప్రాంతం నుంచి 165 మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మరోవైపు గాయపడిన నలుగురు భద్రతా సిబ్బందిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా లీమఖాంగ్లో ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడినవారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.