ఓ బాంబును నిర్వీర్యం చేయడంలో సీఆర్పీఎఫ్ అధికారులు పొరపాటు చేయడంతో.. ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఓ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ని గుర్తించి, దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో పొరపాటు చేయగా, ముగ్గురు మరణించడంతో పాటు మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో దిలీప్ కుమార్ అనే జవాను తనను రక్షించమంటూ హృదయ విదారకంగా వేడుకుంటున్న దృశ్యాలు టీవీ ఛానళ్లలోను, సోషల్ మీడియాలోను విస్తృతంగా ప్రచారం అయినా, సీఆర్పీఎఫ్ చీఫ్ దిలీప్ త్రివేదీ మాత్రం తాము తరలింపులో ఎలాంటి జాప్యం చేయలేదని చెప్పారు.
బీహార్ నుంచి తమ అధికారులు వెంటనే అక్కడకు వెళ్లారని ఆయన అన్నారు. ఐఈడీని నిర్వీర్యం చేయడంలో జరిగినది మాత్రం మానవ తప్పిదమేనని ఆయన అంగీకరించారు. ఎంతటి నిపుణులైనా ఒక్కోసారి పొరపాటు చేస్తారని, దేశ భద్రత కోసం తాము చేసే త్యాగాలను మర్చిపోకూడదని ఆయన అన్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు సంఘటన జరిగితే, 2.30 గంటలకల్లా హెలికాప్టర్ అక్కడ ఉందని, విషమ పరిస్థితిలో ఉన్న జవానును రాంచీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చామని త్రివేదీ తెలిపారు.
బాంబు నిర్వీర్యంలో పొరపాటు.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
Published Wed, Apr 9 2014 4:31 PM | Last Updated on Sat, Aug 11 2018 9:02 PM
Advertisement
Advertisement