
ముంబై : మావోయిస్టులు మరోసారి పేట్రేగిపో్యారు. భద్రతా సిబ్బందిపై పంజా విసిరిరారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ మందుపాతర పెట్టి పేల్చేశారు. ఈ ఘటన మహారాష్ట్రాలోని గడ్చిరోలిలో బుధవారం చోటుచేసుకుంది. భారీ విస్పోటనం కారణంగా వాహనం తునాతునకలైంది. ఈ ప్రమాదంలో 15 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. జాంబిర్‌కేడ అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో ఈ దారుణం జరిగింది. అంతకు ముందు ఇదే జిల్లా కుర్ఖేడా తాలూకా దాదాపూర్ వద్ద మావోయిస్టులు బుధవారం రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 36 వాహనాలకు నిప్పుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment