గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో 12 నుంచి 15మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో డిప్యూటీ ఎస్పీ సారథ్యంలో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు ఆరు గంటల పాటు జరగ్గా.. ఇప్పటివరకు 12మంది మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే, మూడు ఏకే 47 తుపాకీలతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇక, కాల్పుల సందర్భంగా తిపాగడ్ దళం ఇంఛార్జి డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం మృతిచెందినట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. మిగతా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, ఈ కాల్పుల్లో ఒక జవాన్‌కు బుల్లెట్ గాయం కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment