అసోంలో పేలుడు, ముగ్గురు జవాన్లు మృతి | 3 soldiers killed, 4 injured after blast hits army vehicle in assam's tinsukia | Sakshi
Sakshi News home page

అసోంలో పేలుడు, ముగ్గురు జవాన్లు మృతి

Published Sat, Nov 19 2016 11:27 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM

3 soldiers killed, 4 injured after blast hits army vehicle in assam's tinsukia

గువహటి : అసోంలో ఉల్ఫా ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. టిన్‌సుకియా జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఆర్మీ జవాన్ల వాహనం లక్ష్యంగా ఐఈడీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. కాగా పెంగ్రీ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ అధికారి సునీత్‌ న్యూటన్‌ తెలిపారు.

ఉగ్రవాదులు ముందుగా పేలుడుకు పాల్పడి అనంతరం జవాన్లపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.  గాయపడిన జవాన‍్లను చికిత్స ని​మిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ చర్యను అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్రంగా ఖండించారు. అధికారులను టిన్‌సుకియా పంపిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటనపై ఆర్మీ ఈస్ట్రన్‌ కమాండ్‌ కూడా ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement