ulfa militants
-
పేలుడు కేసు నిందితుడికి ఎంఏ గోల్డ్మెడల్
గువాహటి: బాంబు పేలుడు ఘటనలో నిందితుడిగా జైలులో ఉన్న మాజీ విద్యార్థి ఒకరికి అస్సాం గవర్నర్ బంగారు పతకం అందజేశారు. 2019లో గువాహటిలో తీవ్రవాద సంస్థ ఉల్ఫా జరిపిన బాంబు పేలుడు ఘటనలో నిందితుల్లో ఒకరైన సంజీవ్ తాలూక్దార్ (29) ప్రస్తుతం జైలులో ఉన్నాడు. జైల్లోంచే ఓపెన్ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో ఎంఏ పూర్తి చేశాడు. అంతేగాక అత్యధికంగా 71% మార్కులు సాధించాడు! గురువారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జగ్దీశ్ ముఖి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు. -
అస్సాంలో బాంబు పేలుళ్లు
గువాహటి: అస్సాంలో గణతంత్ర దినోత్సవ రోజు ఉదయం సమయంలో నాలుగు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ బాంబులను తామే అమర్చినట్లు నిషేధిత మిలిటెంట్ సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం– ఇండిపెండెంట్ (యూఎల్ఎఫ్ఏ–ఐ) ఆదివారం ప్రకటించింది. ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదు. అయితే గణతంత్ర వేడుకలు జరుపుకోవద్దంటూ పరేశ్ బారువా నేతృత్వంలోని యూఎల్ఎఫ్ఏ–ఐ సహా పలు సంస్థలు ముందే ప్రకటనలు జారీ చేశాయి. చారైడియో జిల్లాలో ఓ బాంబు పేలుడు జరగ్గా, దిబ్రూగఢ్ జిల్లాలో మూడు బాంబుపేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఉదయం 8:15 నుంచి 8:25 గంటల్లోపే నాలుగు పేలుళ్లు జరిగా యి. ఇందులో ఒక పేలుడు పోలీస్ స్టేషన్కు కేవలం 100 మీటర్ల దూరంలో జరగడం గమనార్హం. బైక్పై వచ్చిన యువకులు గ్రెనేడ్లను ఉంచడం సీసీటీవీల్లో నమోదైంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవా ల్ ఈ పేలుళ్లను ఖండించారు. ప్రజల చేత తిరస్కారానికి గురైన ఉగ్రసంస్థలు చేసిన పేలుళ్లు అంటూ మండిపడ్డారు. బాధ్యులపై తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ట్విట్టర్ ద్వారా స్పష్టంచేశారు. -
ఐదుగురిని కాల్చిచంపిన అల్ఫా మిలిటెంట్లు
ఖెరోనిబరి: అస్సాంలో నిషేధిత అల్ఫా(ఇండిపెండెంట్) తీవ్రవాదులు గురువారం రెచ్చిపోయారు. తిన్సుకియా జిల్లాలోని ఖెరోనిలో ఐదుగురు పౌరుల్ని కాల్చిచంపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులున్నారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. కొందరు సాయుధ అల్ఫా తీవ్రవాదులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఖెరోనిలోని ధోలా–సదియా వంతెన వద్దకు చేరుకుని ఐదారుగురు గ్రామస్తుల పేర్లను పిలిచారని తెలిపారు. దీంతో బయటకు వచ్చినవారిపై సమీపం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గాయపడ్డారని వెల్లడించారు. మరోవైపు ఈ దాడిని ఖండించిన అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
అసోంలో పేలుడు, ముగ్గురు జవాన్లు మృతి
గువహటి : అసోంలో ఉల్ఫా ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. టిన్సుకియా జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఆర్మీ జవాన్ల వాహనం లక్ష్యంగా ఐఈడీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. కాగా పెంగ్రీ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ అధికారి సునీత్ న్యూటన్ తెలిపారు. ఉగ్రవాదులు ముందుగా పేలుడుకు పాల్పడి అనంతరం జవాన్లపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ చర్యను అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్రంగా ఖండించారు. అధికారులను టిన్సుకియా పంపిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటనపై ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ కూడా ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించింది. #NEOps. IED blast,Tinsukia Update. Three Soldiers martyred & Four Soldiers Injured. Search Operation is on @adgpi — EasternCommand_IA (@easterncomd) 19 November 2016