పేలుడు కేసు నిందితుడికి ఎంఏ గోల్డ్‌మెడల్‌ | Under Trial Boy Receives Gold Medal for Excelling in Masters Degree | Sakshi
Sakshi News home page

పేలుడు కేసు నిందితుడికి ఎంఏ గోల్డ్‌మెడల్‌

Published Sat, Feb 4 2023 5:44 AM | Last Updated on Sat, Feb 4 2023 5:44 AM

Under Trial Boy Receives Gold Medal for Excelling in Masters Degree - Sakshi

గువాహటి: బాంబు పేలుడు ఘటనలో నిందితుడిగా జైలులో ఉన్న మాజీ విద్యార్థి ఒకరికి అస్సాం గవర్నర్‌ బంగారు పతకం అందజేశారు. 2019లో గువాహటిలో తీవ్రవాద సంస్థ ఉల్ఫా జరిపిన బాంబు పేలుడు ఘటనలో నిందితుల్లో ఒకరైన సంజీవ్‌ తాలూక్‌దార్‌ (29) ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

జైల్లోంచే ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో ఎంఏ  పూర్తి చేశాడు. అంతేగాక అత్యధికంగా 71% మార్కులు సాధించాడు! గురువారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్‌ జగ్దీశ్‌ ముఖి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement